Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ చిన్న తప్పు కొన్ని జీవితాల్ని కూల్చేయగలదు, కొంపలు కాల్చేయగలదు…

January 10, 2024 by M S R

యండమూరి వీరేంద్రనాథ్ కాపీ సాహిత్యం, నవలా వ్యాపారం మీద బోలెడు విమర్శలున్నయ్… ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు, తెలుగు పాఠకులకు నచ్చేలా ఎలా మార్పులు చేసుకున్నాడనేది వదిలేస్తే… తన మొత్తం నవలల్లో కొన్ని మంచి కథలూ ఉన్నయ్… కొన్ని ప్రయోగాలూ ఉన్నయ్… నో డౌట్, తెలుగు పాఠకులను తన రచనాస్రవంతిలో ఉర్రూతలూగించినవాడు… అగ్రగణ్యుడు…

అందరూ తన రచనల్లో అంతర్ముఖం సూపర్ అంటారు గానీ… పర్ణశాల ఇంకా బెటర్ అనుకోవచ్చు… కథకు కమర్షియల్ వాసనలేవీ అద్దకుండా లైఫ్ రియాలిటీస్‌ను చిత్రీకరించుకుంటూ పోయాడు… అవును, తరువాత చెడిపోయాడేమో గానీ మొదట్లో యండమూరి మంచి సెన్సిబుల్ రైటర్… తన ప్రతీ నవలలో ఏదైనా కొత్త సబ్జెక్టును చెప్పడం తనకు అలవాటే కదా, ఇందులో రొయ్యల అంతర్జాతీయ వ్యాపారం…

అన్నింటికీ మించి మానవ సంబంధాలన్నీ అవసరాల ఆధారితమేననీ… అవసరాల ఆధారంగానే మనిషిని మనిషి దోచుకోవడం, వాడుకోవడం, ముంచేయడం గట్రా అన్నీ… అవన్నీ ఈ కథలో రిఫ్లెక్టవుతాయి… మనిషికి ఎంత బుర్ర ఉన్నా, ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత బలగమున్నా, కాస్త అదృష్టం కూడా తోడుండాలి, ఒక్క చిన్న తప్పు (మన ప్రమేయం లేనిదైనా సరే) జీవితాన్ని, కాదు, జీవితాల్ని ఎలా కాల్చేస్తుందో, ఎలా కూల్చేస్తుందో చెబుతుంది ఈ కథ…

Ads

దీని ఆధారంగా ఓ టీవీ సీరియల్ కూడా నిర్మితమైనట్టు గుర్తు (Subject to Correction)… కానీ నవలలోని ఇంటెన్సిటీని కాస్తయినా ప్రజెంట్ చేయలేకపోయారు అందులో… Subbarao Bharthepudi  ఫేస్‌బుక్‌లో ఈ నవల రివ్యూ పోస్ట్ చేస్తే, Yandamoori Veerendranath  i love it. But a failure serial… అంటూ షేర్ చేసుకున్నాడు… ఒకసారి ఆ రివ్యూ చదవండి… బాగుంది…



పర్ణశాల… కొన్ని బుక్స్ ఆహ్లాదాన్ని ఇస్తాయి . . . కొన్ని బుక్స్ ఓ మధురమైన భావనను మిగులుస్తాయి . . . కొన్ని మాత్రం జీవిత కాలం నిద్రలో కూడా వదలకుండా వెంటాడుతాయి . . . కమల్ “మహానది” సినిమా . . . యండమూరి గారి “పర్ణశాల” నవల నాకు ఆ కోవలోనివి . . .

“మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే” అనే మార్క్స్ సిద్ధాంతానికి అక్షర కావ్య రూపమే “పర్ణశాల” .‌. . 20 సంవత్సరాల యుక్త వయసులో మొదటిసారి చదివిన నవల నన్ను ఇప్పటికీ భయపెడుతూ, వెంటాడుతూ ఉంటుంది . . . తన చిన్ననాటి మాస్టారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఇన్‌టైమ్‌లో తన వ్యాపారానికి సంబంధించిన ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయటం మర్చిపోయిన పొరపాటు కథానాయకుని జీవితాన్ని, కుటుంబాన్ని తలక్రిందులు చేసేస్తుంది . . .
నన్ను బాధించిన, వేధించిన పాత్రలు మాత్రం అతని భార్య, చెల్లెలు పాత్రలు . . . బంగారు గూడులో ఇద్దరి అన్నల ముద్దుల చెల్లెలుగా పెరిగి పెళ్ళి చేసుకుని మరో బంగారు గూడులో ప్రవేశించబోయే తరుణంలో, సర్వస్వం కోల్పోయి తన భార్యా బిడ్డలతో ఇల్లొదిలెళ్ళిపోయిన అన్నను వెదకటానికి బయల్దేరిన అతని చెల్లెలు లోకం పోకడ తెలీని కారణంగా రైల్లో లోకంలోని దుర్మార్గపు రూపాల్లో ఒకదానికి బలైపోతుంది . . ‌.

ఇక చైతన్య భార్య . . . చదివిన చాలా సంవత్సరాలు ఆ పాత్రంటే అసహ్య భావన ఉండేది . .‌. సమాజంలో జీవిత అనుభవాలు ఎన్నో చూసేకొద్ది క్రమేపీ అసహ్యం పోయి ఆ పాత్రంటే జాలి మిగిలిపోయింది . .‌. మరేం చేస్తుంది? ఓ అరిస్ట్రోక్రాట్ ఫ్యామిలీలో పుట్టి మరో అరిస్ట్రోక్రాట్ ఫ్యామిలీలో మెట్టిన ఆమె భర్త చేసిన ఓ పొరపాటుకు ఓవర్ నైట్‌లో వీధి పాలైంది . . . వైద్యం చేయించలేని పరిస్థితికి పండంటి కన్నబిడ్డను పోగొట్టుకుంది . . . భిక్షాటనతో సహా అన్నీ చేసింది . . . అలాంటి పరిస్థితుల్లో భర్త డ్రైవర్ ఉద్యోగం పేరుతో కొద్దిపాటి కూడు, నీడ దొరికాయి . . . భర్త యొక్క ఆత్మ గౌరవానికి మళ్ళీ అది కూడా పోయే పరిస్థితికి భయపడి భర్త పనిచేసే ఓనర్‌కి లొంగి పోయి శాశ్వతంగా అతని స్వంతమై పోయింది . . .

రాముడితో సీత, పాండవులతో ద్రౌపది అడవులకెళ్ళటం చదవటానికి, చూడటానికి బానే ఉంటాయి . . . ఎందుకంటే మనింట్లో ఫ్యాన్ కిందో, థియేటర్లో ఏ.సీ. కిందో ఉండి చూస్తాం, ఛదువుతాం కాబట్టి . . . తమ దాక వస్తే మాత్రం భర్త ఏ ఆఫీస్ టూర్‌కో ఓ నెల వెళ్తే అత్తా మామలతో ఎవరడ్జెస్ట్ అవుతారని పుట్టింటికెళ్తారు పిల్లలను తీసుకొని . . . మనం ఎదుర్కోవాల్సొస్తే అదంత ఈజీ కాదు . . .
కంఫర్ట్ జోన్ లైఫ్‌ నుంచి ఒక్కసారిగా వీధిన పడితే నిజ జీవితంలో అందరూ ఆమెలానే చేస్తారు కథల్లో పాత్రలు తప్ప . . . లక్షలో, కోటిలో ఒకరుండచ్చేమో ఎక్సప్షనల్ కేసెస్ . . . అప్పటికి ఏమంత అనుభవాలు చూడని చిన్న వయసులో ఈ నవల రాయగలగటం మాత్రం . .‌. సమాజాన్ని నిశితంగా గమనించిన Yandamoori  లోతైన విశ్లేషణా ముందుచూపుకు మాత్రం ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే . .‌.

తెలుగు వాళ్ళ మనస్తత్వం ట్రాజెడీ ఎండింగ్ అసలు తట్టుకోలేరు… మరో చరిత్ర దేవదాసు లాంటి అతి కొన్ని ఎక్సెప్షనల్… నా మటుకు నాకే ఈ నవల బాగా నచ్చింది. కానీ ఈ ఇద్దరి పాత్రలు గుర్తుకు రాగానే మనసంతా చేదు అయిపోతుంది. చెల్లెలు పాత్ర ఏం కోల్పోకుండా తిరిగి ప్రవేశించక పోతుందా అని ఆశ పడ్డాను. మీకూ అనిపించి ఉంటుంది కానీ వాస్తవికతకే కట్టు పడ్డారు రచయిత…



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions