.
అల్లు అర్జున్‌ను వెనకేసుకొచ్చే క్రమంలో… దేవుళ్లను అరెస్టు చేస్తారా వంటి కొన్ని పిచ్చి కూతల్ని ట్వీటుతున్నాడు కదా రాంగోపాలవర్మ… నిజానికి తనే ఓ పెద్ద ఫ్రాడ్… ఆ ముఖ్యమైన వార్త ఒకటి ఈ పుష్పరాజ్ వార్తల్లో పడి ఎవరూ పట్టించుకోలేదు గానీ…
వర్మ నాసిరకం పనితనం, మోసకారితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో… అప్పట్లో జగన్ రాజకీయ జీవితం మీద వ్యూహం, శపథం అని సినిమాలు తీశాడు కదా… జగన్ క్యాంపు డబ్బు సమకూర్చింది…
Ads
అప్పుడే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… జగన్ అనవసరంగా, అనాలోచితంగా వర్మకు సహకరిస్తున్నాడు, ఈ సినిమాలు జగన్‌కే కౌంటర్ ప్రాడక్ట్స్ అవుతాయి అని…! ఎందుకంటే..? వర్మలోని దర్శకుడు ఏనాడో చనిపోయాడు… తనలో మిగిలిన అర, పావు క్రియేటివిటీ కాస్తా నటి ఆషురెడ్డి కాలి వేళ్ల దగ్గర చతికిలపడిపోయింది… అనుకున్నట్టే ఆ సినిమాలు అనబడే వీడియోలను ఎవడూ చూడలేదు… చివరకు హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్ కూడా… అదీ వర్మ పనితనం…
ఆ సినిమాలతో నాలుగు వోట్లు పడతాయని అనుకున్నాడేమో జగన్… థియేటర్లకు ఎవరూ రాకపోతేనేం… చేతిలో ఫైబర్‌నెట్‌లో ప్రసారానికి పెట్టారు… పైగా వ్యూస్ సంఖ్యను బట్టి డబ్బు చెల్లించేలా ఒప్పందం…
ఎందరు చూశారో తెలుసా..? రెండో భాగానికి జస్ట్ 383 వ్యూస్… మొదటి భాగానికి 1845 వ్యూస్… అవి ఎంత ఘోరమైన డిజాస్టర్లో అర్థమైంది కదా… ఇలా 25 సినిమాల ప్రసారానికి వర్మతో ఫైబర్‌నెట్ ఒప్పందం… అంటే వరుసగా పిచ్చి వీడియోలు తీసేసి, ఫైబర్‌నెట్‌లో పెట్టేయాలనే ఆలోచన…
సరే, ఫైబర్‌నెట్ పనితీరూ ఇలాంటిదే కదా… ఇక్కడ వర్మ ఏ అక్రమానికి తెరతీశాడంటే..? 2.09 లక్షల వ్యూస్ వచ్చాయనీ, 2.09 కోట్లు రావాలని ఇన్‌వాయిస్ సమర్పించాడు… 1.15 కోట్లను వర్మకు చెల్లించేశారు… అసలు వచ్చిందెంత..? నిజంగా వర్మకు ఎంత ఇవ్వాలి..? ఎంత ఇచ్చారు..? అంతా అరాచకం… నిజానికి ఈ వసూళ్ల విలువ 2 లక్షల చిల్లర…
జగన్ వీరసమర్థకుడు వర్మ… పైగా ఈ విషయంలో చేతివాటం చూపించాడు కదా… ఇక ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది…? పైగా తను పవన్ కల్యాణ్ భీకర వ్యతిరేకి… బాధ్యులందరికీ నోటీసులు పంపించబడ్డాయి… అవకాశాన్ని బట్టి వర్మ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడాలనేది తాజా ఆలోచన…
అక్రమంగా చెల్లించబడిన సొమ్మును 12 శాతం వడ్డీతో, 18 శాతం అపరాధ రుసుంతో వెంటనే చెల్లించాలని తాజా లీగల్ నోటీసులు పంపించారు… కానీ ఇక్కడ డబ్బు అనేది ముఖ్యం కాదు… ఫైబర్‌నెట్ అనే వ్యవస్థను దుర్వినియోగం చేసిన తీరు, డబ్బును అక్రమంగా పొందిన క్రైమ్ ముఖ్యం… ఏమో, తదుపరి ఏ చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి…
Share this Article