రాంగోపాలవర్మ గెలిచాడా..? బ్రియాన్ లారా గెలిచాడా..? సీరియస్ ప్రశ్న కాదులెండి… జస్ట్ ఫర్ ఫన్… నిజానికి వర్మకూ, లారాకు సాపత్యం ఏమిటసలు..? పోలిక పెట్టకూడని రెండు వేర్వేరు కేరక్టర్లు… ఎక్కడి వర్మ..? ఎక్కడి లారా..? లారా పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండదు… తనది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో లెజెండ్ స్టేటస్… వర్మ ప్రస్తుత దురవస్థ మనం చూస్తున్నదే, కొత్తగా చెప్పుకునేది ఏముంది..? అయితే… ఓ పోటీలో లారా మీద వర్మ గెలిచాడు…
నిజం… మాటీవీలో బిగ్‌బాస్ షో వస్తోంది కదా… వర్మ తను ఇష్టపడినవారిని బిగ్‌బాస్ హౌజులోకి తీసుకోవాలని ఆదేశిస్తుంటాడు… ముంబైలోని టీం దాన్ని పాటిస్తుంది… అది మొన్న మనం ఓ కథనంలో చెప్పుకున్నాం కదా… ఇనయపై తన ప్రేమ గాఢత ఎంతో ఫోటోలు, వీడియోలు కూడా చూశాం కదా… సో, ఇనయ వర్మ కేండిడేటుగా హౌజులోకి అడుగుపెట్టింది… కానీ మొదటి రోజు నుంచే కయ్ కయ్ అరుస్తూ చికాకుపెడుతోంది… ఆమెకు బిగ్‌బాస్ ఆట అంటే ఏమిటో బేసిక్‌గా అర్థం కాలేదు… హౌజులో ఎవరితోనూ బాగుండదు…
ఈసారి నామినేషన్లలో ఉంది… ఆమె మీద ప్రేక్షకుల్లో కూడా అసంతృప్తి ఉంది… ఒక దశలో ఆమె వోటింగులో అందరికన్నా దిగువన ఉండిపోయింది… నిజానికి లెక్క ప్రకారం ఆమె ఎలిమినేట్ అయినట్టేనని అందరూ భావించారు… కొన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, టీవీల సైట్లతో సహా యూట్యూబర్లు, సైట్లు ఆమె ఎలిమినేట్ అయినట్టు రాసేశారు కూడా… అదెలా సాధ్యం..? బిగ్‌బాస్‌లో నిజానికి ఈ వోటింగులు, వోట్లు జుజూబీ… ఆ టీం వద్దనుకుంటే తరిమేస్తారు, హౌజులో ఉండాలీ అనుకుంటే ప్రొటెక్ట్ చేస్తారు… ఒక్క వోటు రాకపోయినా సరే, హౌజులోనే ఉంచేయగలరు…
Ads
మరి ఇనయ వర్మ కేండిడేట్… తను ఎన్నివారాలు హౌజులో ఉంచాలనుకుంటే అన్నివాారాలు ఆమె కొనసాగాల్సిందే అక్కడ… పైగా ఇనయకు అందరూ వోట్లేయాలంటూ ట్వీట్ కూడా పెట్టాడు వర్మ… ఓ దర్శకుడు ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కోసం ట్వీట్ పెట్టడం ఏమిటనే చర్చలోకి ఇక్కడ మళ్లీ వెళ్లవద్దు ఇప్పుడు… వర్మ అంటే అంతే… ఆ ట్వీట్ తరువాత ఇనయకు వోట్లు పెరిగాయి… కానీ ఆ దెబ్బకు మరో కంటెస్టెంటు నేహ చౌదరి చివరి స్థానంలోకి వెళ్లింది వోటింగులో… ఎలాగూ బిగ్‌బాస్ టీం కూడా ఆమె పర్‌ఫామెన్స్ మీద అసంతృప్తితో ఉంది… సో, ఈ దెబ్బకు ఇనయను సేఫ్ చేసేసి, నేహ చౌదరిని ఎలిమినేట్ చేసి, ఇంటికి పంపించేశారు…
మరి ఇక్కడ లారా ఓడిపోవడం ఏమిటి అంటారా..? ఇనయకు వర్మ మద్దతుగా ట్వీట్ చేసినట్టుగానే… నేహకు వోట్లేయాలంటూ బ్రియాన్ లారా ఓ ఇన్‌స్టా స్టోరీలో కోరాడు… ఇటు ఇనయకు వర్మ, అటు నేహకు లారా… నేహ ఎలిమినేటర్ అయ్యిందంటే వర్మ బ్రియాన్ లారాను క్లీన్ బౌల్డ్ చేసినట్టే కదా మరి… వర్మ లోకల్, తన తిక్క చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటాడు… కానీ లారా డిగ్నిఫైడ్, పెద్దమనిషి తరహా… ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చు… తను ఎవరో తెలుసా..?
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడు… టెస్టు క్రికెట్‌లో 400 పరుగులు నాటౌట్… అత్యున్నత రికార్డు… ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 501 నాటౌట్… ఇలాంటి రికార్డులు బోలెడు… మరి నేహకు ఈ సపోర్ట్ ఏమిటి అంటారా..? ఈమె పలు క్రికెట్ మ్యాచులకు తెలుగు వ్యాఖ్యాతగా ఉండేది… లారా ఆ మ్యాచుల సందర్భంగా పరిచయం తనకు… ఆ కమ్యూనికేషన్ కొనసాగుతూ ఉన్నట్టుంది… ఆమె అడగ్గానే ఓ ఇన్‌స్టా పోస్టు పెట్టేశాడు… కానీ బిగ్‌బాస్‌కు సంబంధించి వర్మ బీసీసీఐ మెంబర్‌లాంటోడు… తన మాటే నెగ్గుతుంది కదా… ఈ పాతతరం, విదేశీ లారాలతో ఏం ఒరుగుతుందమ్మా నేహమ్మా..!!
Share this Article