జాగ్రత్తగా చదవండి…… ఒకాయన మీద పోలీసులు ఒక కేసు నమోదు చేశారు… అరెస్టు చేశారు… కోర్టు మెట్లు ఎక్కించారు… ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు చెప్పారు… టీవీలు, పత్రికలు ఘోషించాయి… విచారణ జరిగింది… తరువాత కొంతకాలానికి కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది… బయటికి వచ్చాడు… గూగుల్‌లో తన పేరు కొట్టగానే ఈ కథనాలు, ఈ ఫోటోలు, ఈ వీడియోలు… పదే పదే కెలుకుతున్నయ్… మానసికంగా, సామాజికంగా గోస… ఉపాధి, కెరీర్ అవకాశాల్లేవ్… సమాజం దోషిగానే చూస్తూ ఉంటుంది… ఆన్‌లైన్‌లో అవి ఉండటం వల్లే కదా ఈ నష్టం… పాత తప్పుడు వార్తలు, ఫోటోలు, వీడియోలు ‘డిలిట్’ అయ్యేదెలా..? మీడియా కూడా నేరం నమోదు సమయంలో రకరకాల కథనాలు రాస్తాయి, తరువాత ఏం జరిగిందో దానికి పట్టదు, పట్టించుకోదు… అసలు తన పాత, చేదు జ్ఞాపకాల్ని, తనను నేరస్తుడిగానే చూపే ఆ సమాచారాన్ని ‘డిలిట్’ చేసుకోవడం… కాదు, కాదు… గూగుల్ వంటి సెర్చింజన్లతో చేయించడం ఎలా..? సాధ్యమేనా..? దేశంలో ఇలాంటి బాధితులు అనేకులు… ఢిల్లీ హైకోర్టుకు ఇలాగే ఒక విజ్ఞప్తి వచ్చింది… ఎన్ఆర్ఐ వ్యాపారి ప్రదీప్, సిరాజ్ ఆమని ఏమంటారంటే…? తమపై 2002లో క్రిమినల్ కేసులు పెట్టారు, 2016లోనే కోర్టు తమను నిర్దోషులు అని చెప్పింది… ఐనా ఆ పాత స్మృతులు, ఆన్‌లైన్‌లో కనిపించే డేటా తమను డిస్టర్బ్ చేస్తోంది, తప్పుడు సమాచారం మమ్మల్ని వెంటాడుతోంది, సో, ‘మరిచిపోయే హక్కు’ లేదా మాకు..? ఆ డేటా డిలిట్ చేయించండి అనేది పిటిషన్…
కోర్టు కూడా ‘అవున్నిజమే, మీకు గోప్యత హక్కు ఉంది… కానీ పాత డేటా తొలగింపు ఎలా..?’ అని సానుభూతి వ్యక్తీకరించింది… గూగుల్‌ను, కేంద్రాన్ని ప్రశ్నించింది… నిజానికి ఇదే మొదటి కేసేమీ కాదు… జూలైలో కూడా సేమ్ కేసు వచ్చింది… టీవీ పర్సనాలిటీ, ఎంటీవీ రోడీస్ విజేత, 2008 బిగ్‌బాస్ విజేత అశుతోష్ కూడా అదే అడిగాడు… అప్పుడు గూగుల్ ‘‘ఇండియాలో ఇలాంటి హక్కు లేదు కదా…’’ అని వాదించింది… Right To Be Forgetten ఏమిటి..? అలాంటి చట్టాలు కూడా ఉంటాయా..? ఇదీ ప్రశ్న… మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 జీవించే హక్కును ఇస్తోంది, గోప్యత హక్కు కూడా అందులో భాగమే… గౌరవంగా జీవించడం కూడా మనిషి హక్కే కదా అనేది అశుతోష్ లాయర్ల వాదన… నిజానికి దాదాపు ఇదే హక్కును కల్పించేలా పార్లమెంటులో 2019లో ఒక బిల్లు ప్రవేశపెట్టబడింది… అది పీడీపీ బిల్లు… అంటే… Personal Data Protection Bill… దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు ఇచ్చారు… అదక్కడ ఆగిపోయింది… ప్రస్తుతం అమల్లో ఉన్న Information Technolgy Rules-2011లో మాత్రం ఇలాంటి హక్కును ఏమీ ప్రస్తావించలేదు… యూరోపియన్ యూనియన్‌లో ఓ రూల్ ఉంది… General Data Protection Regulation… పలు దేశాల్లోనూ ఈ చర్చ సాగుతోంది… ఇంట్రస్టింగు కేసు కదా… ‘‘మరిచిపోయే హక్కు’’ ఈరోజుల్లో అవసరమే అనిపిస్తోంది కదా… కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది… ఇలాంటి కేసుల్లో సదరు బాధితుల డేటా మొత్తం డిలిట్ చేస్తే, ఆ పాత సంఘటనల క్రమాన్ని మొత్తం ఆన్‌లైన్ రికార్డుల నుంచి తొలగించినట్టు అవుతుంది కదా… అదెలా..? ఒకవేళ కేంద్రం పీడీపీ బిల్లు పాస్ చేస్తే, అందులో ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి..!
Ads
Share this Article