Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నోటికొచ్చింది పేలితే ఇకపై కుదరదు… పవన్ ఖేరా కేసే ఉదాహరణ…

April 24, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….  పవన్ ఖేరా కేసులో గౌహతి హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు…
పవన్ ఖేరాపై నమోదైన కేసులో గౌహతి హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ కేసు రాజకీయాలు vs చట్టం మధ్య జరిగిన కీలక సంఘటనగా మారింది.

కేసు ఎలా ప్రారంభమైంది?
అస్సాం సీఎం భార్య రినికి భుయాన్ శర్మపై 3 విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయని, అమెరికాలో కంపెనీ, భారీ పెట్టుబడులు ఉన్నాయని ఖేరా ఆరోపించారు. (అస్సోం ఎంపీ గగోయ్ భార్య ఎలిజబెత్‌కూ పాకిస్థానీ లింకులపై అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా ఈ కాంగ్రెస్ ఆరోపణ)
ఈ ఆరోపణలపై అస్సాం పోలీస్ క్రైమ్ బ్రాంచ్ FIR నమోదు చేసింది.

Ads

 కోర్ట్‌లో ఏమైంది?
జస్టిస్ Parthivjyoti Saikia కీలక వ్యాఖ్యలు.
ఇది సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదు.
రాజకీయాల్లో లేని మహిళను వివాదంలోకి లాగడం తగదు.
ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు చూపలేదు. ఒక వేళ ఆధారాలు ఉంటే విచారణకు హాజరు అయ్యి ఆధారాలు చూపించే బదులు విచారణకు తప్పించుకొని తిరుగుతున్నారు;
కేవలం పరువు నష్టమే కాదు , ఫోర్జరీ, కుట్ర అంశాలు కూడా ఉన్నాయి
అందుకే: “Custodial interrogation అవసరం” అని కోర్ట్ చెప్పింది.

 ఎందుకు బెయిల్ నిరాకరించింది?
ఖేరా వద్ద ఉన్న డాక్యుమెంట్స్ మూలం తెలుసుకోవాలి.
ఎవరు ఇచ్చారు? నకిలీ పత్రాలా? అన్నది విచారణలో తెలుసుకోవాలి
కస్టడీ లేకుండా ఈ అంశాలు బయటపడవు అని కోర్ట్ అభిప్రాయం

 కేసు ప్రయాణం (Timeline):
ఢిల్లీ ఇంటికి అస్సాం పోలీస్ వెళ్లింది (ఏప్రిల్ 7)
తెలంగాణ హైకోర్ట్ → తాత్కాలిక బెయిల్ (ఏప్రిల్ 10)
సుప్రీం కోర్ట్ ఆ ఆర్డర్ స్టే చేసింది
ట్రాన్సిట్ బెయిల్ పొడిగింపు కూడా నిరాకరించింది
చివరకు → గౌహతి హైకోర్ట్ బెయిల్ తిరస్కరించింది

 ఖేరా వాదనలు:
ఇది రాజకీయ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు మాత్రమే, నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.
FIR వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉంది.
నేను కేవలం ప్రశ్న రూపంలో అడిగాను. కేవలము ప్రశ్నలు అడిగితే నకిలీ డాక్యుమెంట్ లు చూపి అడగాలా?

అక్కడే ఇరుక్కొని పోయావు 
ఈ కేసు ఎందుకు ముఖ్యమైనది?
రాజకీయ నాయకులు చేసే ఆరోపణలకు ప్రమాణాలు అవసరం అనే సందేశం. రాజకీయ వ్యాఖ్యలు vs వ్యక్తిగత పరువు నష్టం మధ్య గీత ఎక్కడ? రాజకీయాల్లో లేని వ్యక్తుల ప్రైవసీ రక్షణపై కోర్ట్ దృష్టి
ఈ కేసు ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుతోంది: రాజకీయ స్వేచ్ఛ పేరుతో ఏదైనా చెప్పొచ్చా? లేక చట్టానికి పరిమితులు ఉంటాయా?
— ఉపద్రష్ట పార్ధసారధి

#PawanKhera #GauhatiHighCourt #AssamPolitics #LegalAnalysis #IndianPolitics #BreakingNews #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నోటికొచ్చింది పేలితే ఇకపై కుదరదు… పవన్ ఖేరా కేసే ఉదాహరణ…
  • ఏపీ పాలిటిక్స్..! చివరకు ‘హానీ ట్రాప్’ చీకట్లు… బ్లాక్ మెయిల్ దందాలు…!!
  • 24 లక్షల ప్రాణాలు కాపాడాడు… అక్షరాలా ఈయన ఓ అద్భుతం…
  • ముఖ్యమంత్రి కావడం సులభం సుమీ… నమ్మకపోతే ‘సూర్య IPS’ చూడుడు…
  • Ola, Uber, Rapido… ‘చక్కదిద్దడం’ ఈ సర్కారుకు చేతకాదా..?
  • సత్తెన్నా… గిసంటోళ్ల కోసమా నువ్వు జీవితాన్ని ధారబోసింది…
  • ఈ ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్లే సగం దరిద్రం… ఇదుగో వివరాలు…
  • సంభవం… మలయాళీ డైరెక్టర్లూ, ఇలాంటి మూవీస్ మీకే సంభవం…
  • ప్రపంచాన్ని వణికించే ఉగ్రభూతాలు… భయంతో వణికి చస్తున్నాయి…
  • నిన్నటి హీరో, ఈరోజు విలన్? నేపాల్ రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions