Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బహుశా చాలామంది సినిమా సెలబ్రిటీలకు జీర్ణం కాని కథ..!!

October 9, 2025 by M S R

.

అసలు రిషబ్ శెట్టికి జూనియర్ ఎన్టీఆర్‌కూ ఏమిటి సంబంధం..? పిలవగానే వచ్చేసి ప్రి రిలీజ్ ఫంక్షన్ ముఖ్య అతిథి ఎలా అయ్యాడు…?

వందల కోట్ల వసూళ్ల హీరో కమ్ దర్శకుడు బెంగుళూరులో ఉండకుండా ఓ సముద్రతీరంలోని ఆ చిన్న పట్టణంలో ఎందుకు ఉంటున్నాడు..?

Ads

కాంతార రెండు భాగాలూ నిర్మించిన హొంబలె ఫిలిమ్స్‌కూ దివంగత కైకాల సత్యనారాయణకు సంబంధం ఏమిటి..? ఎందుకు వాళ్లు పదే పదే స్మరిస్తారు..?

రిషబ్ శెట్టి భార్య ప్రగతి నేపథ్యం ఏమిటి..? ఆమె స్వస్థలంలోనే ఉండిపోదామని ఎందుకు అంటోంది..?

.

kamtara

ఇంట్రస్టింగు కదా… మొదటిది జూనియర్ ఎన్టీయార్… ఆయన తల్లి షాలిని… బతుకుతెరువు కోసం ఎన్టీయార్ కుటుంబపు హోటల్ (ఆహ్వానం..?) లో పనిచేస్తున్నప్పుడు, హోటల్ వ్యవహారాలు చూసే హరికృష్ణతో పరిచయం, ప్రణయం… పరిణయం లేకుండానే సహజీవనం… జూనియర్ పుట్టుక… చాలా ఏళ్ల తరువాత గానీ జూనియర్‌ను గుర్తించని నందమూరి కుటుంబం…  జూనియర్‌ను ఇగ్నోర్ చేయలేని అనివార్యత…

ఆమెది కర్నాటక తీరప్రాంతంలోని కుందాపుర… ఎస్, రిషబ్ శెట్టిదీ అదే ఊరు… అదే జూనియర్‌కూ రిషబ్‌కూ నడుమ అనుబంధానికి ఆధారం… జూనియర్ రూట్స్ ఏపీలో లేవు, తెలంగాణలో లేవు… తను కన్నడ పుత్రుడు…

jr ntr

మరి రిషబ్ శెట్టి ఇంత ఎదిగినా కుందాపురలోనే ఎందుకు ఉంటున్నాడు..? అసలు ఏమిటి కుందాపుర స్పెషాలిటీ… చాలా చిన్న పట్టణం అది… తను అక్కడే రకరకాల చిన్న వృత్తులు చేస్తూ బతికాడు… మినరల్ వాటర్ క్యాన్లు ఇంటింటికీ వేసేవాడు కూడా…

మినరల్ వాటర్ వ్యాపారంలో నిలదొక్కుకోలేకపోయాడు… హోటల్ పెట్టి నష్టపోయి పాతిక లక్షల అప్పు తీర్చడానికి అవస్థలు పడి, వడ్డీలు కట్టలేక అప్పుల వాళ్ళ నుండి తప్పించుకోడానికి మారు వేషం వేసుకుని తిరిగిన రిషబ్ షెట్టి “సరైన వేషం వేయడం తన సమస్యకి పరిష్కారం అనుకున్నాడు.. వేశాడు గెలిచాడు… ఎక్కడ…? తప్పించుకు తిరిగిన తన ఊళ్లోనే…

కుందపుర పట్టణం మూడు వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది… ఉత్తరాన పంచగంగవల్లి నది ఉంది … తూర్పున కలఘర్ నది ఉంది… పశ్చిమాన బ్యాక్ వాటర్స్ సీ వాక్… అరేబియా సముద్రం… దక్షిణం వైపు ఇతర భూభాగాల్ని కలిపే అనుసంధానం…

kundapura

కుందాపూర్ తాలూకాలో అనేక నదులు… భారీ వర్షపాతం నమోదవుతుంది… ప్రధాన నదులు చక్ర, సౌపర్ణిక, వారాహి, కుబ్జా, ఖేటా… వాస్తవానికి, కుందాపూర్- బైందూర్ మధ్య 36 కి.మీ. దూరంలో ఏడు నదులు లేదా ప్రవాహాలు… అవి హలాడి నది, కొల్లూర్ నది, చక్ర నది, రాజాడి, నుజాడి, యాదమావిన హోలె, ఉప్పుండ హోలె…

ఎటు చూసినా నీళ్లు, పచ్చదనం… దానికితోడు తనకు ఇష్టమైన బలమైన జానపద సంస్కృ‌తి… అందుకే రిషబ్ ఆ ఊరు వదల్లేదు… బెంగుళూరుకు మారలేదు… పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నాడు… ఎవరు తన కోసం వచ్చినా, వందల కోట్ల హీరో అయినా… కుందాపుర రావల్సిందే… అవును, కుందాపుర బిడ్డ రిషబ్… రిషబ్ కన్నతల్లి కుందాపుర…

kundapura



  • ఆ ఊరు వదిలితే పేగు కత్తిరించుకున్నట్టే అంటాడు అందుకే… తను కుందాపురకు గర్వం… తనకు కుందాపుర గౌరవం… ఎంత మంచి బంధం..?!

మరి కాంతార నిర్మాతలు హొంబలేకు మన కైకాల సత్యనారాయణకూ ఏమిటీ లింకు..? ఆయన కేజీఎఫ్, కాంతార తెలుగు వెర్షన్ రిలీజ్‌కు బాగా సహకరించాడు… ఈరోజుకూ కైకాల కొడుకు రామారావు (చిన్నబాబు) హొంబలె మిత్రుడు… తమ సినిమాకు సహకరించినందుకు ఇప్పటికీ హొంబలె ఫిలిమ్స్ తమ సినిమాల్లో కైకాల సత్యానారాయణకు స్మరిస్తుంది… గొప్ప కృతజ్ఞత…



మరి రిషబ్ భార్య ప్రగతి… ఆమె సాఫ్ట్‌వేర్… అప్పట్లో రిక్కీ కావచ్చు, సినిమా చూస్తున్నప్పుడు హీరో రక్షిత్ శెట్టితో అందరూ సెల్ఫీలు దిగుతున్నారు… ఆ పక్కనే దర్శకుడు రిషబ్… రక్షిత్ చెప్పాడు తనే దర్శకుడు అని… తనదీ కుందాపుర అని తెలిసింది… తరువాత సోషల్ మీడియాలో ఒకరికొకరు యాడ్ చేసుకున్నారు…

rishab

మాటలు, పరిచయం, స్నేహం, ప్రణయం… ఈ తాడూ బొంగరం లేనివాడిని పెళ్లి చేసుకోవద్దని తల్లిదండ్రుల అభ్యంతరాలు… ఒకే ఊరు, ఆమెదీ కుందాపురమే… ఎలాగోలా అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు…

ఆమె కుందాపుర వదలదు, ఆమే కాదు, అక్కడున్నవాళ్లు ఎవరూ వదిలిపోరు… ప్రకృతి ఒడిలోని పచ్చటి ఊరు… అందుకే రిషబ్ శెట్టి కూడా ఆ ఊరు వదలడు, కదలడు…. అక్కడి కల్చర్ తనకు పిచ్చి, వదిలి పోలేడు… కాంతార లొకేషన్లన్నీ అక్కడివే…  బాగుంది కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…
  • భార్యను చంపాడని జైల్లో వేశారు… రెండేళ్లకు ఆ భార్య కనిపించింది…
  • కిిం కర్తవ్యం..? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు..!!
  • స్వదేశీ విస్కీమేకర్లకు కిక్కిచ్చే అవార్డులు… అంతర్జాతీయ అమ్మకాలు…
  • బహుశా చాలామంది సినిమా సెలబ్రిటీలకు జీర్ణం కాని కథ..!!
  • రక్తికడుతున్న జుబ్లీహిల్స్ పోటీ… రేవంత్‌రెడ్డి ఎత్తులు ఇంట్రస్టింగ్..!
  • నాతూ పెళ్లాం తావాలి… మనిషి వైకల్యాల నుంచి పుట్టించే కామెడీ…
  • ఇంటిపేరు పూరీ ఐనా సరే… తనకు ఉప్మా అంటేనే అడిక్షన్ తెలుసా..!!
  • చంద్రబాబు చెప్పాడు… ఎన్టీయార్ మాట తిప్పాడు… ఏం జరిగిందంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions