నిజమే… రిషబ్ శెట్టికి ముందుంది ముసళ్ల పండుగ… హార్ష్‌గా ఉన్నట్టుంది కదా వ్యాఖ్య… కానీ నిజమే… ఇన్నాళ్లూ తీసిన సినిమాలు వేరు, ఇప్పుడిక కాంతార తరువాత తీయబోయే సినిమా వేరు… తనకు తాను ఓ హైరేంజ్ బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు… హీరోగా, దర్శకుడిగా, కథకుడిగా..! ఎక్కడి 15 కోట్ల సినిమా… ఎక్కడి 250- 300 కోట్ల వసూళ్లు… డబ్బు సంగతి ఎలా ఉన్నా సరే, ఆ సినిమాయే ఓ ఊపు ఊపేస్తోంది… తన నటనను ఇప్పట్లో ఎవడూ అందుకోలేడు… అది మాత్రం గ్యారంటీ…
ఇదంతా సరే, తరువాత సినిమా ఏమిటి..? పెద్ద క్వశ్చన్ మార్క్… ఇంకెంత బాగా తీసినా సరే, ఎంత కష్టపడినా సరే, కాంతారతో పోలుస్తారు జనం… సహజం… కానీ అన్నీ కాంతారలు ఎందుకవుతాయి..? అది అలా కుదిరింది… ఇప్పుడు మళ్లీ ఇదే సినిమా తీసినా ఇలా కుదరకపోవచ్చు… అలాంటిది దాన్ని మించిన సినిమా కావాలంటే ఎలా కుదురుతుంది..? సో, ఆడియెన్స్ అంచనాల్ని అందుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ కాబోతోంది…
Ads
నిజానికి రిషబ్‌కు మాత్రమే కాదు… బంపర్ హిట్లు పడ్డాక చాలామందికి ఈ సవాల్ ఎదురవుతుంది… మార్కెటింగ్ మంత్రగాడు రాజమౌళి కూడా ఓసారి ఇదే అన్నాడు… ఓ పెద్ద హిట్ పడ్డాక, వెంటనే ఓ చిన్న సినిమా తీసి, నేల మీదకు దిగిరావాలి… జనం అంచనాలు కూడా సాధారణ స్థితికి వస్తాయి… మన మీద ప్రెజర్ తగ్గుతుంది అని..! సునీల్‌తో తీసిన మర్యాద రామన్న సినిమా ఆ కోవలోనిదే… అంతెందుకు..? గతంలో కృష్ణకూ ఈ స్థితి ఎదురైందని అంటారు…
అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణకు జనం నీరాజనం పట్టారు… తరువాత కృష్ణ వరుసగా ఎన్ని సినిమాల్లో నటించినా జనానికి ఆనలేదు… అన్నీ ఫ్లాపులే… మరి అన్నీ అల్లూరి రేంజ్ సినిమాలు తీయలేడు కదా… తను మళ్లీ మామూలు హీరో కావడానికి చాన్నాళ్లు పట్టింది… బాహుబలి తరువాత సాహో అని ఓ భారీ చిత్రం తీసినా సరే ప్రభాస్‌కు ఇప్పటికీ బాహుబలి రేంజ్ తగల్లేదు… రానా అయితే మరీ ఘోరం… సో, అందరికీ వచ్చే స్థితే ఇది…
రిషబ్ శెట్టికి డబుల్ గండం… తనే దర్శకుడు, తనే హీరో… ఒకవేళ లీడ్ రోల్ వేరే వాళ్లతో చేయించినా సరే, దర్శకుడిగా కాంతార రేంజ్ సినిమాను ప్రేక్షకులు అంచనా వేస్తారు… తనే ఏదో మార్గం ఆలోచించుకుంటాడులే గానీ… అప్పుడే కాంతారను ఆస్కార్‌కు పంపించాలనే డిమాండ్లు పెరుగుతున్నయ్… నిజానికి ఆస్కార్‌కు పంపించకపోతే ఏమిటట..? ఎస్, ఆస్కార్ మంచి గుర్తింపే గానీ… కానీ ఆసియన్ దేశాల కల్చర్, ప్రేక్షకుల టేస్టును ఆస్కార్ ఎప్పుడైనా పరిగణనలోకి తీసుకుందా..?
మొన్న ఏదో గుజరాతీ సినిమా చెలో షోను ఆస్కార్ పరిశీలనకు పంపించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని జ్యూరీ నిర్ణయం తీసుకుంది… కానీ ఆర్ఆర్ఆర్ దర్శకుడికి నచ్చలేదు… జనరల్ కేటగిరీలో ఏకంగా 14 కేటగిరీల్లో అవార్డుల పరిశీలనకు అంటూ పంపించాలని నిర్ణయం తీసుకున్నారు… దాంతో ఒరిగేదేమీ లేదు… కాకపోతే వాళ్లకు కావల్సింది ప్రచారం… మరి జపాన్ తదితర దేశాల్లో ఇంకా ఈ సినిమా ఉద్దరించాల్సి ఉంది కదా… తెలుగు చరిత్రపురుషుల కథను భ్రష్టుపట్టించి, ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు కదా…
చివరకు నాటునాటు అనే పాటను కూడా ఆస్కార్ అవార్డు పరిశీలన కోసం పంపిస్తున్నారు అంటేనే, ఆ ఆస్కార్ అవార్డుల ఎంట్రీ, పరిశీలన, దరఖాస్తులు ఎంత నీచస్థాయికి పడిపోయాయో అర్థమవుతోంది… మరి కాంతారను పంపిస్తే ఎంత..? పంపించకపోతే ఎంత..? సమయానికి మళ్లీ ఏదో చెల్లోషో వచ్చి, కాంతారను పక్కన చెత్తబుట్టలో కూడా పడేసే ప్రమాదముంది… మరి మన జ్యూరీల తెలివితేటలు అలాగే ఏడుస్తుంటాయి… ఇక జాతీయ అవార్డులు అంటారా..? ఆ జ్యూరీలు కూడా ఇలాంటివే కదా…
పైరవీలు, పైరవీలు… అవే కదా జాతీయ అవార్డులను ప్రభావితం చేసేవి… కాంతార నిర్మాతలు హొంబళె ఫిలిమ్స్ ఇప్పుడు సాధనసంపత్తి ఉన్నవాళ్లే… కేజీఎఫ్, కాంతార డబ్బులు బోలెడు పోగయ్యాయి… పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా చేయించగలరు… కానీ ఆ అవార్డులకు విలువ ఏమున్నట్టు..? సో, అవార్డుల జంఝాటంలోకి ఆ సినిమాను అప్పుడే నెట్టేయడం దేనికి..? ఆల్‌రెడీ యాంటీ-హిందూ, యాంటీ-ఇండియా పోకడలకు ప్రసిద్థి చెందిన బీబీసీ వాడు ఈ సినిమా కంటెంటు మీద చర్చలు, రచ్చలు స్టార్ట్ చేశాడు కదా… కొన్నాళ్లు నడవనివ్వండి…!!
Share this Article