ప్రపంచంలో ఆరో పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన UK, తమ పార్లమెంట్ ని సడన్ గా రద్దు చేసి ఎన్నికలకి పోతుంది.
సాధారణంగా ప్రస్తుత UK ప్రధానమంత్రి రుషి సునాక్ ఈ సంవత్సరం చివరివరకు అధికారంలో ఉండొచ్చు. వచ్చే సంవత్సరం జనవరిలో ఎన్నికలు జరగాలి. కానీ రాయల్ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని UK పార్లమెంట్ ని రద్దు చేసి జూలై 4 వ తేదీన ఎన్నికలకి పోతుండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనియాంశమయ్యింది.
650 మంది మెంబర్స్ ఉన్న UK పార్లమెంట్ లో 325 సీట్లు వచ్చిన పార్టీ ప్రధాని పదవి చేపట్టవచ్చు. ముఖ్యంగా UK లో ఉన్న పార్టీలు 1. కన్సర్వేటివ్ పార్టీ 2. లేబర్ పార్టీ . ఇంకో రెండు చిన్న పార్టీలు స్కాటిష్ నేషనల్ పార్టీ, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఉన్నై.
కోవిడ్ తర్వాత అతలాకుతలమైన దేశాల్లో UK ఒకటి. రుషి సునాక్ ఒకరకంగా UK ఆర్ధిక వ్యవస్థని గాడిన పెట్టాడు అనే చెప్పాలి. కానీ స్వదేశంలో అతని మీద వ్యతిరేకత ఉంది. నిజానికి UK ఒకటే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిచోటా ధరలు పెరిగాయి, వడ్డీ రేట్లు పెరిగాయి, భూముల ధరలు పెరిగాయి మరియూ నిరుద్యోగుల సంఖ్య పెరిగింది.
రుషి పాలనలో UK ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది, రీసెంట్ గా వడ్డీ రేట్లు కూడా తగ్గించారు.
6.8 కోట్ల జనాభా ఉన్న UK లో ప్రధాన సమస్యలు
1) అస్థిరమైన ఆర్ధిక వ్యవస్థ
2) ఇమ్మిగ్రేషన్/ అక్రమ వలసలు
3) హెల్థ్ కేర్
4) పర్యావరణం
నిన్న సాయంత్రం సడన్ గా పార్లమెంట్ ని రద్దు చేయటం ఒక్క నెలలోపే ప్రచారం మరియూ ఎన్నికలు జరగబోతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదా స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి… ( By .. Jagan Rao)
Share this Article