Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…

May 2, 2026 by M S R

.

యాక్సిస్ మై ఇండియా: ‘బెంగాల్’ భయం.. ‘తమిళ’ సాహసం! ప్రదీప్ గుప్తకు ఇది ఆఖరి ఛాన్సా?… తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ విశ్లేషణలన్నీ ఒకవైపు ఉంటే, ప్రదీప్ గుప్త (Axis My India) లెక్కలు మాత్రం మరోవైపు ఉన్నాయి… రాష్ట్రంలో మెజారిటీ జనం, సర్వే సంస్థలు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఫ్రంట్ ఏకపక్షంగా గెలుస్తుందని చెప్తుంటే… గుప్త గారు మాత్రం ఎవరూ ఊహించని విధంగా విజయ్ (TVK) పార్టీకి పట్టం కడుతూ పెద్ద బాంబు పేల్చాడు…

బెంగాల్ అంటేనే ‘వణుకు’.. ఫలితం చెప్పలేక దాటవేత! … అన్ని రాష్ట్రాల గురించి లెక్కలు తేల్చిన ప్రదీప్ గుప్త, పశ్చిమ బెంగాల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేశాడు… “70 శాతం మంది ఓటర్లు అసలు మాట్లాడటం లేదు” అని ఆయన సాకు చెబుతున్నా, అసలు విషయం అది కాదని అందరికీ తెలుసు…

Ads

  • నమ్మకం లేని చోట మౌనం…: 2021లో బెంగాల్ ఫలితాన్ని అంచనా వేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యాడుె… బీజేపీ గెలుస్తుందని చెప్పి, రిజల్ట్స్ రోజున మమత దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు…  ఇప్పుడు మళ్ళీ అలాంటి అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందో, క్రెడిబిలిటీ ఎక్కడ గంగలో కలిసిపోతుందో, మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుందో అన్న భయంతోనే ‘ఫలితం చెప్పలేక’ తెలివిగా దాటవేశాడు…

తమిళనాడులో మళ్ళీ అదే ‘బెంగాల్’ సీన్? … ఒకవైపు బెంగాల్‌లో భయపడి తప్పుకున్న గుప్త, తమిళనాడులో మాత్రం అందరూ స్టాలిన్ అంటుంటే ఆయన మాత్రం విజయ్‌కు 98-120 సీట్లు ఇచ్చాడు… సాహసమే…

  • డైరెక్షన్ ఉంటే సరిపోదు…: ప్రదీప్ గుప్త అంచనాలు “ఎవరు గెలుస్తారు” అనే డైరెక్షన్ విషయంలో నిజమైనా, సీట్ల సంఖ్యలో మాత్రం తరచుగా ఫెయిల్ అవుతున్నాడు… 2024 లోక్‌సభలో ఎన్డీఏ సీట్ల అంచనా తప్పి లైవ్ డిబేట్‌లో ఏడ్చేసిన సీన్…, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ వైఫల్యాలు ఆయన ట్రాక్ రికార్డును ప్రశ్నిస్తున్నాయి…

  • రిస్క్ లో ‘విజయ్’ మంత్రం…: విజయ్ తన అభ్యర్థులను చెన్నైకి పిలిపించడం, అన్నాడీఎంకేతో చర్చల వార్తలు రావడం చూస్తుంటే ఏదో జరుగుతోందనిపిస్తోంది కానీ… డీఎంకే ఓటు బ్యాంకును చీల్చి విజయ్ 35% ఓట్లు సాధించడం అంటే అది అద్భుతమే కావాలి…

యాక్సిస్ మై ఇండియా ఇచ్చేవి అసలు ఎగ్జిట్ పోల్స్ కావు, అవి ‘పోస్ట్ పోల్ సర్వేలు’… పోలింగ్ ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత తీరిగ్గా ఇచ్చే సర్వేలు కూడా తప్పుతున్నాయంటేనే ఆ సంస్థ డైలమా అర్థమవుతోంది… తమిళనాడులో ఈ అంచనా గానీ తేడా కొడితే, ప్రదీప్ గుప్త సక్సెస్ రేటు 92% నుండి నేరుగా 50% కి పడిపోతుంది.,. తన సర్వే దుకాణం మూసుకోవాల్సిందే…

బెంగాల్‌లో భయంతో ‘సేఫ్ గేమ్’ ఆడినా, తమిళనాడులో స్టాలిన్ ప్రభంజనాన్ని కాదని ఆయన చేసిన ఈ సాహసం వికటిస్తే మాత్రం… ప్రదీప్ గుప్త మళ్ళీ కర్చీఫ్ బయటకు తీయాల్సిందే! ఇది కేవలం ఒక సర్వే ఫలితం కాదు, యాక్సిస్ మై ఇండియా భవిష్యత్తును తేల్చే అగ్నిపరీక్ష….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…
  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…
  • ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…
  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions