.
గుదిమెళ్ల రాజశేఖర్… అంటే ఎవరికీ తెలియదు… ఆర్జే శేఖర్ బాషా అంటే అందరికీ తెలుసు… తన పేరు కూడా వినిపిస్తున్న సోకాల్డ్ మస్తాన్ సాయి వందల బ్లూవీడియోల దుమారం వార్తలు చదువుతూ ఉంటే… ప్రతిభకూ గుణానికీ ఏమాత్రం సంబంధం లేదు అని..!
గతంలో ఎప్పుడూ పెద్దగా ఇతని గురించి సెర్చ్ చేసింది లేదు కానీ మొన్నటి బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్… నీలి మరకలు పడిన అక్రమవర్తనుడిని ఆ షోకు ఎలా, ఎందుకు ఎంపిక చేశారో ఏ ప్రబుద్ధులో గానీ… మధ్యలోనే తరిమివేయబడ్డాడు…
Ads
తెలుగు పదాలను నిలువునా చీల్చి, అడ్డంగా విరిచి పిచ్చి కుళ్లు జోకులు వేసి నవ్వించలేక నవ్వులపాలయ్యాడు… తరువాత ఓ చిత్రమైన కేరక్టర్, నటుడు రాజ్‌తరుణ్ కేస్ ఫేమ్ లావణ్య వరుసగా బయటపెడుతున్న డ్రగ్స్, బ్లూ వీడియోల నేరంలో ఈ శేఖర్ బాషా పేరూ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది…
తనది కాకినాడ… ఏజ్ 43 ఏళ్లు… మొదట్లో జెమిని మ్యూజిక్, మా మ్యూజిక్ చానెళ్లలో వీజేగా మొదలుపెట్టిన కెరీర్ అనితర సాధ్యంగా సాగింది… తోంది కూడా… ప్రత్యేకించి 93.5 ఎఫ్ఎం, 92.7 ఎఫ్ఎం రేడియో జాకీగా బాగా పాపులర్… దేశంలో ఎవరికీ చేతకాని రీతిలో 19 సార్లు ఎక్సలెన్స్ ఇన్ రేడియో ఐఆర్ఎఫ్ గెలుచుకున్నాడు తను…
92.7 గంటల మారథాన్ షో… 100 గంటలపాటు మొబైల్ స్టూడియో ఆన్ వీల్స్ షో… తరువాత 106 గంటల ఆన్ వీల్స్ మారథాన్ షో… మరోసారి 92 గంటల మారథాన్ షో… రేడియో షోలకు సంబంధించి ప్రయోగాలు, ప్రశంసలు… ఇదంతా నాణేనికి ఒకవైపు… మరి అసలు గుణం..?
అదే లావణ్య ఇప్పుడు బయటపెడుతోంది… మస్తాన్ సాయి అనబడే పరమ నీచ వికృత నేరగాడికి శేఖర్ బాషా ఎలా సపోర్ట్ చేశాడో… దొంగతనంగా తనను డ్రగ్స్ కేసులో ఇరికించడానికి ఎలా ప్లాన్ చేశాడో లావణ్య ఓ ఆడియో క్లిప్ ఆధారసహితంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందని తాజా వార్త… (సరే, మన పోలీసులు ఇలాంటి క్రూర, సీరియస్ కేసుల్ని కూడా ఎటూ తెమల్చరు, కొలిక్కి తీసుకురాలేరు గానీ… తన గుణం మాత్రం బహిర్గతం అవుతోందిగా…)
లావణ్య ఇంట్లో డ్రగ్స్ పెట్టేయాలనే కుట్రే నిజమైతే… ఈ శేఖర్ బాషాకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తాయి…? ఎంత మంది పెడ్లర్స్‌తో సంబంధాలున్నాయి…? మస్తాన్ సాయి డ్రగ్స్ రాకెట్ సీరియస్‌నెస్ ఎంత..? ఇవన్నీ పోలీసులు తేల్చాల్సిందే కదా…
మస్తాన్ సాయి అనే వాడు ఏకంగా 1500 వీడియోలు రూపొందించాడట… ఈరోజు వార్త… ఎన్ని వందల మంది అమ్మాయిలు బలయ్యారో… అఫ్‌కోర్స్, వాళ్ల తప్పూ ఉంది, అదే వాడి నేరాలకు ఆధారం కూడా..! అదుగో వాడి నేరఖాతాల్లో ఈ శేఖర్ బాషా పేరు కూడా… అందుకే మొదట చెప్పింది, ఏదేని రంగంలో విశేష ప్రతిభకూ, అసలు వికృత గుణానికీ సంబంధం లేదు అని..!
అవునూ, ఎవడైతేనేం..? ఎంత ప్రసిద్ధుడైతేనేం..? కాస్త పోలీసు మర్యాద రుచిచూపించలేదా ఈ ప్రభుత్వం..? పోనీ, ఆ లావణ్య తప్పుడు ఫిర్యాదులే నిజమైతే, ఆమెనే ఫిక్స్ చేయండి, కేసు బుక్ చేయండి, ఓ కంపు వార్తల బాగోతానికి తెరపడుతుంది…!!
Share this Article