RJ సూర్య… అలియాస్ కొండబాబు… మంచి మిమిక్రీ ఆర్టిస్ట్… సటైరిక్ న్యూస్ బిట్స్ లో బాగా పర్ఫామ్ చేస్తాడు… బయట తన తత్వం ఏమిటీ అంటే, భక్తిపరుడు… స్నేహశీలి… అందరితో బాగుంటాడు…. కానీ బిగ్‌బాస్ తనను ఎలా ఎక్స్‌పోజ్ చేసింది… ఓ లస్ట్ లవర్‌గా… చివరకు అలాగే బయటికి పంపించారు… ఇదీ బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల తనకు దక్కిన వ్రతఫలం…
నిజానికి తను ఆల్‌రెడీ లవర్ ఉంది… బుజ్జమ్మ అనో, మరో పేరో తనే చెప్పినట్టు గుర్తు… కానీ హౌజులోకి వచ్చాక కొన్నాళ్లు ఆరోహితో ప్రేమాయణం నటించాడు… నటనే… ఎందుకంటే..? ఆల్‌రెడీ ఆమెకు ఓ లవర్ ఉన్నాడు బయట… కాకపోతే ఈ ఇద్దరూ ఒకే ప్రోగ్రామ్‌లో పనిచేస్తుంటారు కాబట్టి కాస్త ఇంటిమసీ ఉంది… అదే అదునుగా బిగ్‌బాస్ వాడు రాజేసిన పెంట ఇది… ఇద్దరి నడుమ కావాలని ఓ లవ్ ట్రాక్ స్టార్ట్ చేయించాడు… వాడే చెప్పాక తప్పేది ఏముంది..? వీళ్లూ నటించారు…
కాదు, పాత్రల్లో జీవించారు… తరువాత ఏమైందో ఏమో గానీ, వీళ్ల లవ్ ట్రాక్ జనంలోకి సరిగ్గా వెళ్లలేదు… నిజమేమిటో బయటికి చెప్పేశారు… ఇక ఆరోహితో పనేముంది అనుకుని ఆమెను బయటికి పంపించేశారు… తరువాత ఇనయతో జతకట్టమని బిగ్‌బాస్ ఆర్డర్… చేసేదేముంది..? మరింత స్వేచ్ఛగా ఆ పాత్రలో జీవించాడు సూర్య… ఇనయ కూడా సూపర్ పర్‌ఫామ్ చేసింది… నిజానికి ఆమెకూ తెలుసు… అందుకే బాగా నటించింది… చివరకు హౌజు నుంచి వెళ్తున్నప్పుడు కూడా బాగా ఏడ్చి, బాధపడి, ఇనయ అపూర్వంగా నటించింది…
Ads
అసలే జనం ఈసీజన్‌కు చీదరించుకుంటున్నారు… క్రియేటివ్ టీంకు ఏం చేయాలో అర్థం కావడం లేదు… సూర్య, ఇనయ లవ్ ట్రాక్ కూడా బాగా నెగెటివ్‌గా వెళ్లింది జనంలోకి… ఇంకేముంది..? ఎలిమినేషన్ ప్రొసీజర్ లేదు, వోట్లు లేవు, జస్ట్, అలా బయటికి పంపించేశారు… అనూహ్యం… అసాధారణం… కానీ సూర్య బాగా బదనాం అయిపోయాడు… చెప్పింది బిగ్‌బాస్ టీమే… డ్రామా ఆడిందీ, ఆడించిందీ ఆ టీమే… కాకపోతే పూర్తిగా ఓ కామరూపుడిగా చిత్రితుడై, ఓ శిక్షకు గురై బయటికి వచ్చిన బాధితుడు మాత్రం సూర్య… అబ్బే, రాలేదు, ఇదంతా స్ట్రాటజీ అంటారా..? ఇప్పటిదాకా తను ఎలా ప్రొజెక్టయ్యాడు..? హఠాత్తుగా ఇకపై యోగిపుంగవుడిగా పాత్రీకరించలేరు కదా…
నిజానికి అర్జెంటుగా హౌజు నుంచి పంపించాలంటే అందరినీ పంపించేయాలి… ఎవడికీ ఆట ఏమిటో తెలియదు… మోస్ట్ హోప్‌లెస్ సెలక్షన్స్… క్రియేటివ్ టీంను తన్ని తరిమేయాలి… అసలు హైకోర్టు నోటీసులు ఇచ్చింది, తనే ఓసారి చూస్తానంటోంది, బ్యాన్ పెట్టాలా వద్దా అనే విచారణ జరుగుతోంది, అదంతా వేరే కథ… కానీ జనమే ఈసీజన్‌ను ఛీత్కరించేస్తున్నారు… వాళ్లే చూడటం ఆపేస్తున్నారు…
ఎంత దరిద్రం అంటే… రేటింగ్స్‌కు కీలకంగా భావించే వీకెండ్ షోకు వచ్చిన హోస్ట్ గంటన్నరసేపు ఏదేదో మాట్లాడి, కంటెస్టెంట్లకు వాళ్లలోవాళ్లతోనే మార్కులు వేయించి, ఏవో నాలుగు నీతి వాక్యాలు చెప్పి, ఫలానావాడు ఎలిమినేటెడ్ అని చెప్పేసి వెళ్లిపోయాడు… హహహ… గంటారెండు గంటల చేపల ఆట మీద గంటన్నర రివ్యూ… అందుకే ఈసారి బిగ్‌బాస్ సీజన్ పెద్ద డిజాస్టర్… ఇంకా చెప్పుకోవాలి..? అర్థమైంది కదా… మరి రేపు నాగార్జున ఏం చేస్తాడు అంటారా..? వీలయితే ఇంకొకరిని బయటికి పంపిస్తాడు… ప్రేక్షకులకు మరింత రిలీఫ్…
నిజానికి ఆదిరెడ్డి, రాజ్ వెంటనే బయటికి పంపించాల్సిన కేరక్టర్లు… హోప్ లెస్… ఆడ లేడీస్ పర్లేదు అనుకున్నా సరే, ఎందుకో మొన్నటిదాకా బాగా మోసిన బిగ్‌బాస్ టీం ఇప్పుడు హఠాత్తుగా గీతును బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది… కొంపదీసి ఆమెకు స్పాట్ పెట్టలేదు కదా…!?
ష్… ఇలా ఎవరికీ సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరిగిందీ అంటే తనను సీక్రెట్ రూంకు పంపించి, రీఎంట్రీ చేయిస్తారు… చిన్న పిల్లాడు కూడా చెబుతాడు, బిగ్‌బాస్ స్ట్రాటజీ ఏమిటో… తాతలనాటి ఓల్డ్ స్ట్రాటజీ… బోర్… అయితే ఇక్కడ ఫాఫం, ఆర్జే సూర్యను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది కూడా ముఖ్యమే…
Share this Article