.
నిన్నటిదే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్త పలుకులో ఒకటీరెండు పేరాలు బలంగా ఆకర్షించాయి…
‘‘హైదరాబాద్‌లోని ఒక డిస్టిలరీ యాజమాన్యం 200 కోట్ల రూపాయలతో దాదాపు మూడున్నర క్వింటాళ్లు, అంటే 350 కిలోల బంగారు నాణేలను కొనుగోలు చేసింది. పద్మావతి జ్యువెలర్స్ అనే సంస్థకు సదరు డిస్టిలరీ నుంచి 200 కోట్ల రూపాయలు చెక్కు రూపంలోనే అందాయి.
ఆ డబ్బు తీసుకున్న పద్మావతి జ్యువెలర్స్ సంస్థ 350 కిలోల బంగారాన్ని నాణేలుగా మార్చి అందజేసింది. సదరు బంగారాన్ని అహ్మద్ అనే వ్యక్తికి ఇవ్వవలసిందిగా సదరు డిస్టిలరీ కంపెనీ ఆథరైజేషన్ లేఖను పద్మావతి జ్యువెలర్స్‌కు ఇచ్చింది.
బంగారు నాణేలు తీసుకున్న అహ్మద్ అనే వ్యక్తి వాటిని ఎవరికి అందజేసి ఉంటారో తదుపరి విచారణలో తేలుతుంది. ఏ డిస్టిలరీ కంపెనీ అయినా ముడి సరుకు కొంటుంది. బంగారం ఎందుకు కొంటుంది? అది కూడా 200 కోట్ల రూపాయలతో దాదాపు 350 కిలోల బంగారం ఎందుకు కొంటుంది?’’
…. ఇదీ తను రాసుకొచ్చింది… కొన్నాళ్ల క్రితం తెలంగాణలో కిలో, 2 కిలోల బంగారు ఇటుకల్ని సమర్పించడం మీద చర్చ జరిగేది… కానీ నిజంగానే ఆర్కే పరోక్షంగా చెబుతున్నట్టుగీ జగన్ ఆ డిస్టిలరీ నుంచి ముడుపుల్ని తీసుకున్నాడనే అనుకుందాం కాసేపు… ఎందుకంటే..? తన పాలనలో మద్యం విషయంలో సాగింది మామూలు అరాచకం కాదు కదా…
Ads
ఏమో… కారణాలు ఏవైనా అప్రూవర్‌గా మారుతున్న విజయసాయిరెడ్డి చెబుతున్నట్టు… మద్యం అక్రమాలకు కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అట… ఢిల్లీ, తమిళనాడు, కేరళ స్కాములు ఏపీ మద్యం స్కాంతో పోలిస్తే జుజుబీ అట… ఆర్కే చెబుతున్నదీ అదే… సరే, నిజంగానే చంద్రబాబు, సారీ, లోకేష్ గనుక సీరియస్ దర్యాప్తు చేయిస్తే… స్కాం అసలు తీవ్రత తెలుస్తుంది…
‘‘భారతి సిమెంట్‌లో పనిచేస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన మనుషులతో మద్యం అమ్మకాలను పర్యవేక్షించేవారు. ఆయన మనుషులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించడం హైలైట్. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పాత్ర కూడా ఉంది. కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, మిథున్‌రెడ్డిని కూడా విచారిస్తే మరిన్ని విస్తుగొలిపే నిజాలు బయటకు రావొచ్చు.
బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నోరు విప్పితే మూల విరాట్ ముసుగు తొలగవచ్చు…’’ అంటూ ఎవరెవరిని విచారించాలో కూడా ఏకరువు పెడుతున్నాడు రాధాకృష్ణ… ఇదంతా వోకే… కానీ వర్తమానంలో అవినీతి సొమ్మును ఏవేవే ఖాతాల నుంచి ఇంకేవో ఖాతాలకు రకరకాల పేర్లతో తరలించడం ఉంటుంది కదా… కరెన్సీ, బంగారం రూపంలో స్వీకరించడం ఉంటోందా అసలు..?
(దుబయ్ యవ్వారాలపై నా దగ్గర చాలా సమాచారం ఉంది అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి…? ఎవరినో బలంగా ఫిక్స్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టుంది… అబ్బే, ఫార్ములా రేసు కేసులోనే అరెస్టు చేయలేకపోయాడు, ఇప్పుడేం చేస్తాడు అంటారా..? ఏమో, వేచి చూడాలి…)
350 కిలోల బంగారం, 200 కోట్లు… అంటే ఎన్ని నాణేలు..? అవి తీసుకున్న ఆ అహ్మద్ ఎవరు..? ఏ కంపెనీ అయినా సరే ముడుపుల్ని అధికారిక కొనుగోళ్లు చూపించి మరీ ఇస్తుందా..? పైగా అన్ని బంగారు నాణేల్ని తీసుకుని జగన్ ఏం చేశాడబ్బా..? ఎక్కడ దాచిపెట్టాడు..? ప్చ్, రాధాకృష్ణ సరిగ్గా అక్కడే ఆపేశాడు తన వ్యాసాన్ని..!!
సరే, దాన్నలా వదిలేస్తే… కొద్దిరోజుల క్రితం సాయిరెడ్డి, రాధాకృష్ణ మస్తు సవాళ్లు విసురుకున్నారు… తొడలు కొట్టారు… ఆ జగడం అలా ఉండగానే సాయిరెడ్డి పాలిటిక్సుకు రిటైర్మెంట్ అన్నాడు… వ్యవసాయం చేసుకుని బతికేస్తా అన్నాడు… అలాంటి ప్రత్యర్థి సాయిరెడ్డి భద్రత మీద రాధాకృష్ణ బెంగపెట్టుకున్నాడు ఇప్పుడు…
తక్షణం చంద్రబాబు ఆయనకు బలమైన రక్షణ కల్పించాలి అంటున్నాడు… లేకపోతే వివేకానందరెడ్డిలాగే అయిపోతాడూ అంటున్నాడు పరోక్షంగా… కనీసం మద్యం కుంభకోణం మూలవిరాట్ ముసుగు తొలగే వరకైనా విజయసాయిరెడ్డికి భద్రత కల్పించాలట…
ఎందుకయ్యా అంటే..? వివేకా హత్య కేసులో సాక్షులందరూ మరణిస్తున్నారు… అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఒక్కడే బతికి ఉన్నాడు… అంతేనా..? పరిటాల రవి హత్య కేసులో నిందితులు కూడా వరుసగా చనిపోయారు… హత్యా రాజకీయాల్లో ఇదొక కొత్త మలుపు… అందుకని సాయిరెడ్డికి బలమైన భద్రత కల్పించాలని ఆర్కే కోరిక..!!
Share this Article