.
( Gopu Vijay Kumar Reddy ) రోడ్రి… ఫుట్‌బాల్ ప్రపంచపు ‘ప్రొఫెసర్’- సైలెంట్ సూపర్ స్టార్
ఫుట్‌బాల్‌లో స్ట్రైకర్లు, వింగర్లు మెరుపులు మెరిపిస్తుంటే, తెర వెనుక ఉండి జట్టును నడిపించే ‘ఇంజనీర్’ రోడ్రిగో హెర్నాండెజ్ కాస్కేంటే (రోడ్రి)… స్పెయిన్ జట్టుకు వెన్నెముక వంటి ఈ డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్, తనదైన శైలిలో ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్నాడు… అర్జెంటీనా మెస్సీ కాదు, స్పెయిన్ యమాల్ కాదు, ఇతని గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే, అసలు విజేత తనే కాబట్టి!! (ఫైనల్స్‌లో 93 ఖచ్చితమైన పాస్‌లు)…
Ads
30 నిమిషాల అదనపు టైమ్… హోరాహోరీ పోరు… ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో, తద్వారా ఫైనల్స్‌లో ఒక గోల్‌తో స్పెయిన్ విజయం సాధించింది…
మైదానంలో ప్రత్యేకత
-
గుర్తింపు…: చాలా మంది ఆటగాళ్లు టీ-షర్ట్‌లను వదులుగా వదులుతారు, కానీ రోడ్రి తన టీ-షర్ట్‌ను షార్ట్‌లోకి ఇన్‌సర్ట్ చేసి (Tucked in) ఆడతాడు. ఈ ప్రత్యేక శైలి వల్ల గ్రౌండ్‌లో అతన్ని సులభంగా గుర్తుపట్టవచ్చు.
-
పాత్ర…: ఫుట్‌బాల్‌లో అత్యంత కఠినమైన ‘డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్’ పొజిషన్‌లో ఆడుతూ, ప్రత్యర్థి దాడులను అడ్డుకోవడమే కాకుండా, మిడ్‌ఫీల్డ్ నుండి ఫార్వార్డ్స్ వరకు బంతిని చేరవేయడంలో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు…
నిజ జీవితంలో ఒక రోల్ మోడల్
ఫుట్‌బాల్ ప్రపంచంలో గ్లామర్‌కు, వేగవంతమైన జీవనశైలికి లోటు లేదు. కానీ, రోడ్రి మాత్రం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత నిబద్ధతను ప్రదర్శిస్తాడు.
-
ప్రేమాయణం…: పెళ్లి కాదు, దాదాపు 15 ఏళ్లుగా తన చిన్ననాటి స్నేహితురాలితో కలిసి ఉంటూ, కమిట్‌మెంట్‌కు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు.
-
మధుర క్షణం…: ఎంతటి కీలకమైన మ్యాచ్ అయినా, తను గోల్ కొట్టిన వెంటనే తన ప్రేయసి పంపే వీడియోను చూడందే అతను డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు రాడు. గెలుపు కంటే కూడా తన ప్రియతమురాలి సంతోషానికి అతను ఇచ్చే ప్రాధాన్యత గొప్పది.
అసాధారణ ప్రస్థానం: గాయం నుండి శిఖరానికి
మోకాలి శస్త్రచికిత్స (Knee Surgery) తర్వాత, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడం అసాధ్యం అనిపించిన స్థితి నుండి, చేతిలో కట్టె పట్టుకుని నడిచిన అదే కళ్లతో నేడు ప్రపంచ కప్‌ను ముద్దాడటం ఒక అద్భుతం. ఇది క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకం.
రోడ్రి సాధించిన ఘనతలు (Awards & Achievements)
2024 సంవత్సరంలో ఎంబప్పే వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ‘బాలన్ డి ఓర్’ను గెలుచుకోవడం అతని స్థాయికి నిదర్శనం.
-
Ballon d’Or: 2024 విజేత.
-
UEFA Euro: Player of the Tournament.
-
UEFA Champions League: 2024 సీజన్ ఉత్తమ ఆటగాడు.
-
IFFHS: 2022–23 ప్రపంచ ఉత్తమ ఆటగాడు.
-
UEFA Nations League: Finals Player of the Tournament.
-
FIFA Club World Cup: Golden Ball (2023).
-
PFA Team of the Year: 2022–23 & 2023–24.
రోడ్రి కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, నిబద్ధతకు, అంకితభావానికి నిలువుటద్దం. మాంచెస్టర్ సిటీకి, స్పెయిన్ జట్టుకు అతను అందిస్తున్న సేవలు చిరస్మరణీయం…
పెప్ గార్డియోలా అన్నట్లు, “అత్యుత్తమ హోల్డింగ్ మిడ్‌ఫీల్డర్లు వార్తాపత్రికల మొదటి పేజీల్లో కనిపించరు, వారు జట్టు వెనుక దాగి ఉంటారు. కానీ జట్టు బాగా ఆడిందంటే దానికి కారణం వారే”. రోడ్రి సరిగ్గా అదే రకమైన ఆటగాడు.
Share this Article