ఒక వివాదం… ఒక రచ్చ… ఎక్కడో మొదలవుతుంది… అది ఎటెటో తిరుగుతూ, ఎవరెవరినో చుట్టేస్తూ… పొరపాటున రాజకీయాలు ఎంటరైతే మరింత వికృతంగా మారిపోతూ… అసలు మూలకారణం మరుగున పడిపోతుంది… దాన్నెవరూ ఆలోచించరు… దానిపై ఏమీ చర్చించరు… దాదాపుగా ఇదీ అంతే… ఇద్దరు లేడీ ఐఏఎస్ ఆఫీసర్ల గొడవ… కొప్పులుకొప్పులూ పట్టుకుని కొట్టుకున్నట్టు… ఐఏఎస్ అధికారులయితేనేం మనుషులు కారా..? కొన్నిసార్లు వీథి కుళాయిల దగ్గర మహిళల్లాగే..! నిన్న కర్నాటక ప్రభుత్వం ఇద్దరు లేడీ ఐఏఎస్ అధికార్లను వాళ్లు పనిచేస్తున్న పొజిషన్ల నుంచి తప్పించి, బదిలీ చేసింది… ఒకరి పేరు రోహిణి సింధూరి, మరొకరి పేరు శిల్ప నాగ్… ఇందులో రోహిణి 2009 బ్యాచ్ అయితే శిల్ప 2014 బ్యాచ్… ఎందుకు బదిలీ చేశారంటే..? ఆ ఇద్దరూ బహిరంగంగా గొడవపడుతున్నారు… పత్రికలకు ఎక్కుతున్నారు… ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు… అంతేనా..? కాదు..! ఇంకా ఉంది…
రోహిణి సింధూరి తెలుగు మహిళ… తెలుగు వాడినే పెళ్లి చేసుకుంది… కొలువులో చేరిన కొత్తలో హసన్ వంటి జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు నాయకుల ఒత్తిళ్లకు బెదరకుండా ధైర్యంగా పనిచేసింది… మంచి పేరొచ్చింది… మన తెలుగు సైట్లు కూడా మెచ్చుకున్నయ్… మన పత్రికలు ఇంటర్వ్యూలు చేశాయ్… నీలాంటోళ్లు ఉండాలమ్మా సర్వీసులో అన్నారందరూ… కానీ ఎప్పుడూ ఒకేలాగా ఉంటే ఐఏఎస్ అధికారి అని ఎందుకంటారు..? తనకొచ్చిన పేరుకు భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది… మైసూరు డిప్యూటీ కమిషనర్‌గా తనకు ఓ అధికారిక నివాసం ఇచ్చారు… ఇస్తారు కదా… కలెక్టర్లు మారుతుంటారు తప్ప ఆ నివాసం మారదు… పైగా అది హెరిటేజ్ కట్టడం… ఈ నిజాన్ని ఆమె లైట్ తీసుకుంది… ఆ నివాసంలో ఓ స్విమ్మింగ్ పూల్, ఓ జిమ్ కట్టడానికి పూనుకుంది… ఖర్చు 50 లక్షలు… మరి మైసూరు కలెక్టరంటే మాటలా..? ఏ క్షణం బదిలీ అయినా ఆ ఖర్చు తనకు సుఖాన్ని ఇవ్వలేదనీ, తను ఖాళీ చేయకతప్పదనీ, పైగా అదేమీ తన సొంత ఇల్లు కాదని ఆమె ఎందుకు మరిచిపోయింది..? ఉఫ్… రోహిణి ఇలాంటి ఐఏఎస్ అధికారిణా..?
Ads
శిల్ప నాగ్… ఈమె మైసూర్ కార్పొరేషన్ కమిషనర్… రోహిణి చేసే 50 లక్షల ఖర్చు తెలుసు… వ్యతిరేకించింది… అది హెరిటేజ్ కట్టడం అని గుర్తుచేసింది… రూల్స్‌కు విరుద్దమని చెప్పింది… ఆఫ్టరాల్, తన జూనియర్, పైగా తను కూడా లేడీ ఆఫీసర్… రోహిణి ఇగో దెబ్బతిన్నట్టుంది… శిల్ప నాగ్‌ను సతాయించడం స్టార్ట్ చేసింది… శిల్ప మీద కోపాన్ని కార్పొరేషన్ అధికారుల మీద చూపించసాగింది… ఇదంతా శిల్పకు మరింత చిర్రెత్తింది… అసలే ఆమె మైసూరు లోకల్… పైగా ఇంటింటికీ జ్వరసర్వే, కరోనా వ్యాప్తి నియంత్రణలో కాస్త బాగా వర్క్ చేస్తున్నదనే మంచి పేరు సంపాదించింది… కానీ ఈ రోహిణి ఇగో భరించలేక ఓ ఝలక్ ఇవ్వాలనుకుంది… ఛట్, ఈ సర్వీసుకు రాజీనామా చేస్తున్నాను అని బజారుకెక్కింది… 64 మంది కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా, శిల్పకు మద్దతుగా, రోహిణి మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేశారు… ఇలా ఈ ఇద్దరి గొడవ ప్రభుత్వానికి తలనొప్పి అయిపోయింది… దాంతో అసలు ఈ యవ్వారంపై దర్యాప్తు చేయాలని ఆదేశించి, ఇద్దరినీ బదిలీ చేసింది… రోహిణి దేవాదాయ శాఖలోకి, శిల్పను పంచాయత్‌రాజ్ శాఖలోకి పంపించేసింది… ఎలాంటి రోహిణి చివరకు ఏం పేరు సంపాదించుకుంది ఇప్పుడు..?! ఈ మొత్తం ఎపిసోడ్ ఏం నీతి చెబుతున్నదయ్యా అంటే…. పోస్టులు, పొజిషన్లు, చదువుల్లో ఓ రేంజ్‌కు పోయినా సరే… ఇద్దరు మహిళల మధ్య సయోధ్య అనేది ఎప్పుడూ ఓ భ్రమపదార్థమే…!!
ఈమెను వ్యతిరేకిస్తే చాలు లాండ్ మాఫియా ముద్ర వేస్తూ, సోషల్ ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు… ఇప్పుడు మైసూరులో రోహిణి పేరు చెబితేనే మండిపడుతున్నారు అందరూ… ఇదే చెబితే అందరూ లాండ్ మాఫియానేనట..!!
Share this Article