Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రెట్టీ రోహిణి సింధూరి… ప్రైవేటు ఫోటోల కోసం నెట్‌లో తెగ వెతుకులాట…!

February 21, 2023 by M S R

ప్రస్తుతం చాలామంది నెట్‌లో సెర్చ్ చేస్తున్నది ఏమిటో తెలుసా..? రోహిణి సింధూరి ప్రైవేటు ఫోటోలు..! ఎందుకు..? ఐపీఎస్ అధికారిణి రూప కొన్ని రోహిణి ఫోటోలను రిలీజ్ చేసింది… అవన్నీ రోహిణి స్వయంగా మగ అధికార్లకు పంపించిందని ఆరోపించింది… అవి ఎలాంటి ఫోటోలు..? మరీ అసభ్యమైన ఫోటోలు అని ఒక సెక్షన్ మీడియా రాస్తుండగా… అవన్నీ తాను ఫేస్‌బుక్‌లో, వాట్సపుల్లో పెట్టిన ఫోటోలేననీ, కానీ వాటిని ఇలా బురద జల్లడానికి వాడుకోవడం నీచమైన పని అని రోహిణి చెబుతోంది…

చీఫ్ సెక్రెటరీకి ఐపీఎస్ రూప మీద ఫిర్యాదు చేసింది… ప్రభుత్వానికి తిక్కరేగి ఇద్దరూ తమ హోదాల్ని కంపు చేస్తున్నారనే భావనతో తమ పోస్టుల నుంచి పీకేసింది… కొత్తగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు… నిజానికి వీళ్లిద్దరి నడుమ రెండేళ్లుగా వైరం పెరుగుతోంది… ఇప్పుడు ఏకంగా ఫోటోల షేరింగ్ దాకా వచ్చింది… నిజానికి ఇద్దరికీ మొదట్లో మంచి పేరే ఉండేది… కానీ వ్యక్తిగత వైరాలతో భ్రష్టుపట్టిపోయారు ఇలా… రోహిణి సింధూరి పేరు అప్పట్లో డీకే రవి అనే అత్యంత నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కేసులో ప్రైవేటుగా వినిపించింది… సీబీఐ దర్యాప్తు చేసింది ఆ కేసును… రవి భార్య కుసుమ చివరకు ‘‘ఎవరి దుష్కర్మ వాళ్లనే అనుభవించేలా చేస్తుంది’’ అని ఓ ట్వీట్ కొట్టి ఇక వదిలేసింది…

ఇప్పుడు రూప వర్సెస్ రోహిణి వివాదంలో రోహిణి అవినీతి కూడా ఓ ముఖ్యమైన పాయింటే… అదెవరూ పట్టించుకోవడం లేదు, ఎంతసేపూ ఆమె ఫోటోల సెర్చింగులోనే పడ్డారు… సహజంగానే మంచి అందగత్తె కావడం, ప్రైవేటు ఫోటోలు, మగ జెంట్స్‌కు పంపించిన అసభ్య ఫోటోలు అనే ప్రచారం జరిగేసరికి, పంచాయితీ మొత్తం ఆ ఫోటోల చుట్టే తిరుగుతోంది… చివరకు ఇద్దరి మీదా వేటు పడింది… ఇద్దరి కెరీర్ కంపుకంపు అయిపోయింది…

Ads

rohini sindhuri…. (rohini sindhuri)….

నిజానికి ఒక లేడీ ఐఏఎస్, ఒక లేడీ ఐపీఎస్ తగాదా… అందులోనూ గతంలో డైనమిక్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నవాళ్లు కొట్లాడుకుంటే జనానికి ఓ ఇంట్రస్టింగు షో అయిపోయింది… ఒక్కసారి రోహిణి వివాదాస్పద కెరీర్‌లో ఇప్పటిలాగే మరో మహిళా అధికారిణితో గొడవపడింది… అదీ సీరియస్ చర్చకు దారి తీసింది… ఆమె పేరు శిల్పనాగ్… రోహిణి 2009 బ్యాచ్, శిల్ప 2014 బ్యాచ్… ఈ ఇద్దరూ వీథి కుళాయిల దగ్గర కొట్టుకున్నట్టుగా వ్యవహరించడంతో అప్పుడు కూడా ప్రభుత్వం ఇద్దరినీ తమ తమ పోస్టుల నుంచి బదిలీ చేసింది… కాకపోతే వేర్వేరు శాఖలకు పంపించింది… మరీ ఇప్పటిలాగా ఏ శాఖలకూ కేటాయించక శిక్షించలేదు…

రోహిణి సింధూరి తెలుగు మహిళ… తెలుగు వాడినే పెళ్లి చేసుకుంది… కొలువులో చేరిన కొత్తలో మంచి పేరే సంపాదించింది… కానీ తరువాత అన్నీ వివాదాలే… ఉదాహరణకు  మైసూరు డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు తనకు ఓ అధికారిక నివాసం ఇచ్చారు… కలెక్టర్లు మారుతుంటారు తప్ప ఆ నివాసం మారదు కదా… పైగా అదేమో హెరిటేజ్ కట్టడం… అందులో ఓ స్విమ్మింగ్ పూల్, ఓ జిమ్ కట్టడానికి పూనుకుంది… ఖర్చు 50 లక్షలు… అదేమీ తన సొంత ఇల్లు కాదని ఆమె ఎందుకు మరిచిపోయింది..? ఇటలీ నుంచి ఫర్నీచర్ తెప్పించుకుని టాక్స్ ఎగవేసిందని మరో ఆరోపణ…

shilpa nag….(shilpa nag)….

శిల్ప నాగ్… ఈమె అప్పట్లో మైసూర్ కార్పొరేషన్ కమిషనర్… రోహిణి చేసే 50 లక్షల ఖర్చును వ్యతిరేకించింది… అది హెరిటేజ్ కట్టడం కాబట్టి రూల్స్‌కు విరుద్దమని చెప్పింది… ఆఫ్టరాల్, తన జూనియర్, పైగా తను కూడా లేడీ ఆఫీసర్… రోహిణి ఇగో దెబ్బతిన్నట్టుంది… శిల్ప నాగ్‌ను సతాయించడం స్టార్ట్ చేసింది… శిల్ప మీద కోపాన్ని కార్పొరేషన్ అధికారుల మీద చూపించసాగింది… ఇదంతా శిల్పకు మరింత చిర్రెత్తింది… ఛట్, ఈ సర్వీసుకు రాజీనామా చేస్తున్నాను అని బజారుకెక్కింది… 64 మంది కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా, శిల్పకు మద్దతుగా, రోహిణి మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేశారు… ఇలా ఈ ఇద్దరి గొడవ ప్రభుత్వానికి తలనొప్పి అయిపోయింది… పోస్టులు, పొజిషన్లు, చదువుల్లో ఓ రేంజ్‌కు పోయినా సరే… ఇద్దరు మహిళల మధ్య సయోధ్య అనేది ఎప్పుడూ ఓ భ్రమపదార్థమే…!!

rohini n roopa….(rohini vs roopa)….

రోహిణి తన ప్రైవేటు ఫోటోలను మగ ఆఫీసర్లకు పంపిస్తే, దాన్ని బహిరంగం చేయాల్సిన అవసరం రూపకు ఏమిటి..? అదంతా ఆమె పర్సనల్ యవ్వారం కదా… కానీ రూప ఊరుకోదు కదా… ఆమె కూడా ఓ తిక్క కేసే… పైగా ఇద్దరు మహిళలు బజారునపడి జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకుంటే గలీజుగా ఉంటుంది… (ఈ ఇద్దరి నడుమ తగాదా ఎలా స్టార్టయిందో గానీ రెండేళ్లుగా ఉప్పూనిప్పు టైపే)… రోహిణి కెరీర్‌లో కొన్ని వివాదాలు చూద్దాం…

  • హాసన్ జిల్లాకు కలెక్టర్‌గా చేసినప్పుడు హెచ్‌డీ రేవణ్ణతో గొడవ… ఆమె మైసూరు డీసీగా ఉన్నప్పుడు కూడా ఆయనతో గొడవ… చివరకు ఆమెను బదిలీ చేయడం, ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం జరిగిపోయాయి… చెప్పుకుంటే వాళ్లిద్దరి తగాదా మరో పెద్ద ఎపిసోడ్…
  • చామరాజనగర్‌లో ఆక్సిజన్ కొరతతో 24 మంది కరోనా బారిన పడి మరణించడానికి మైసూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న రోహిణి సింధూరి సమయానికి ఆక్సిజన్ ఇవ్వకపోవడమే కారణమని చామరాజనగర్ జిల్లా కలెక్టర్ ఆరోపించారు.
  • మైసూరులోని కేఆర్ నగర్ ఎమ్మెల్యే సా.రా. మహేష్‌తో రోహిణి సింధూరికి విభేదాలు వచ్చాయి. రోహిణి అవినీతిని మహేష్ బయటపెట్టగా, ఆ సారా మహేష్ అక్రమంగా భూములిచ్చారని రోహిణి సింధూరి చెప్పిన ఆడియో వైరల్‌గా మారింది. రోహిణి సింధూరిపై సారా మహేష్ పరువునష్టం కేసు కూడా పెట్టారు. తరువాత వివాదం సద్దుమణిగింది… రోహిణి సారీ కూడా చెప్పింది… వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోను కూడా రూప రిలీజ్ చేసి, ఏవో సందేహాలకు తెరతీసింది…
  • కొడగు-మైసూరు ఎంపీ ప్రతాప్ సింహాతో రోహిణి సింధూరికి మధ్య గొడవలు ఉన్నాయి.

rohini….(rohini sindhuri)….

ఈ ఫోటోల్లో అశ్లీలం ఏమీ లేదు… (ఇవి గాకుండా ఇంకేమైనా ఉన్నాయా తెలియదు…) కానీ అవి మగ ఆఫీసర్లకు ఎందుకు పంపిస్తోందనేది రూప ప్రశ్న… అవును, ఇతర అధికార్లకు ఈ ఫోటోలు పంపించడం ఏమిటి..? దాల్ మే కుచ్ కాలా హై… ఒకప్పుడు నిప్పు అని పేరు తెచ్చుకున్న రోహిణి ప్రభ చివరకు ఇలా బజారున పడిపోయింది…

రూప రోహిణికన్నా చాలా సీనియర్… ఆమె 2000 ఐపీఎస్ అధికారిణి… ఒకప్పుడు ఎంపీ సీఎం ఉమాభారతిని, ఓ మాజీ మంత్రి యువగల్ అరెస్టు సందర్భాల్లో ఆమెకు మంచి పేరు వచ్చింది… జైలులో శశికళ అక్రమ సౌకర్యాలను కూడా బయటపెట్టింది… ఆ పేరు కూడా ఇప్పుడు అనవసర, వ్యక్తిగత కక్ష ప్రదర్శించడం ద్వారా పోగొట్టుకుంది… రోహిణి-శిల్పనాగ్… రోహిణి-రూప… ఇద్దరు మహిళల కొట్లాట జనానికి ఎప్పుడూ ఇంట్రస్టింగే..! ఐఏఎస్, ఐపీఎస్ అయితేనేం వాళ్లూ మనుషులేగా… రాగద్వేషాలు, చిల్లర తగాదాలకు వాళ్లు దూరమేమీ కాదు… రోహిణి కథే పెద్ద ఉదాహరణ..! వివరంగా రాస్తూ పోతే రోహిణి కథ ఎంతకూ తెగేట్టు లేదు…!!

roopa….. (roopa)….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions