Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెరపై కనిపించక ఉండలేదు… ఇప్పుడు బోలెడు తీరిక… వచ్చేస్తోంది…

April 11, 2025 by M S R

.

రోజా… ఆమె తెర మీద కనిపించకుండా ఉండలేదు… అసలు ఈటీవీ జబర్దస్త్ కారణంగానే తన పాపులారిటీ పెరిగి, తనను ఎమ్మెల్యేను చేసి, మంత్రిగా కూడా చేసిందని నమ్ముతుంది…

నిజానికి జబర్దస్త్ కామెడీ షో మీద ఉన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు… ఐనా ఆమెకు అవన్నీ పట్టవు… మంత్రయ్యాక ఇక తప్పలేదు… అయిష్టంగానే టీవీ తెరకు అనివార్యంగా దూరమైంది… ఇక ఇప్పుడయితే కావల్సినంత తీరిక కదా… మళ్లీ బుల్లి తెర మీదకు వచ్చేస్తోంది…

Ads

ప్రజాజీవితంలో ఉన్నప్పుడు జబర్దస్త్ వంటి చీప్ టేస్ట్ షోలకు దూరంగా ఉంటే బాగుండు అని అందరూ తమలో తామే అనుకుంటారు, కానీ ఎవరూ నేరుగా చెప్పరు కదా… ఇప్పుడు నయం… జీతెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ షోకు జడ్జి అట…

కో-జడ్జి దర్శకుడు అనిల్ రావిపూడి… తనకు ఆల్రెడీ ఆహా ఓటీటీలో ఓ కామెడీ షోకు జడ్జిగా చేశాడు… పర్లేదు… కాకపోతే ఈ షో డిఫరెంటు… పిల్లల్లో నటన పోటీ… జీతెలుగు ఆస్థాన నటి ఆషికా పడుకోన్ ఉంది కదా… కథలో రాజకుమారి, త్రినయని ఫేమ్… జీ సీరియళ్లతో పాపులర్ ఆమె…

తనతోపాటు మరో టీవీ సెలబ్రిటీ లాస్య మంజునాథ్ మెంటార్స్ అట… సుడిగాలి సుధీర్ దీనికి హోస్టింగ్… అదీ ఓ ప్లస్ పాయింట్ ఈ షోకు ఇప్పుడు… తను ఈటీవీ షోల నుంచి బయటికి వచ్చేశాక తరచూ ఏదో ఓ షో చేస్తూనే ఉన్నాడు…

ఆహా ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ హోస్ట్ చేశాడు… సర్కార్ షో చేశాడు… ఇప్పుడు ఈటీవీలోనే ఫ్యామిలీ స్టార్స్ అనే ఓ సాదాసీదా షోను హోస్ట్ చేస్తున్నాడు… ఇప్పుడిక డ్రామా జూనియర్స్… సినిమాల్లేవు కదా, ఇక టీవీ షోలే ముఖ్యం…

ఇది డ్రామా జూనియర్స్ సీజన్ 8… వచ్చే 12 వ తేదీ శనివారం రాత్రి 9 గంటలకు లాంచింగ్ షో… జీతెలుగు రియాలిటీ షోలు తక్కువే కదా… దీనికి కాస్త హంగామా చేస్తున్నారు… ఫస్ట్ ఎపిసోడ్‌లో జగపతిబాబు, రంభ, ఆమని హాజరై కాస్త హడావుడి చేశారట మరి… మొత్తానికి రోజా టీవీ రీఎంట్రీ మాత్రమే కాదు, ఈ షోకు చాలా విశేషాలే ఉన్నాయన్నమాట…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions