బిగ్‌బాస్ మస్తు పైసలు ఇచ్చింది శ్రీముఖికి..! కానీ కెరీర్‌కు ఊపునివ్వలేదు… ప్రస్తుతం ఖాళీ… దిక్కులు చూడటమే…! నిజానికి అప్పట్లో మస్తు జోకులు పడేవి… ఏమనీ అంటే..? యాంకర్ పళ్లికిలిస్తేనే షో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాడేమో నాగబాబు… అందుకే అదిరింది నవ్వుల షోకు ముందుగా సమీరను తీసుకున్నాడు… షో క్లిక్ కావడం లేదని ఆమెను మధ్యలోనే తరిమేశాడు… భానుశ్రీని, రవిని తీసుకొచ్చాడు… వాళ్లనూ వెళ్లగొట్టేశాడు… అసలు షోలో దమ్ముండాలి మాస్టారూ అంటే వినడు…
ఈయన్ని అనవసరంగా ఈటీవీ నుంచి లాక్కొచ్చాం, ఈయనేమో జబర్దస్త్ తాత వంటి షో నడిపిస్తాడని అనుకుంటే అసలు షో లేవడం లేదు, ఏమి సేతురా లింగా అని జీతెలుగు వాళ్లు తలలు పట్టుకున్నారు… ఈలోపు కరోనా వచ్చి పడింది… మొత్తమే ఆగిపోయింది… సరే, మెల్లిమెల్లిగా మళ్లీ స్టార్టయ్యాయి… ఈసారి నవదీప్‌ను కూడా జడ్జి కుర్చీ నుంచి తరిమేసి, జానీ మాస్టర్‌ను పట్టుకొచ్చారు… అరివీర భయంకరంగా నవ్వగలిగే శ్రీముఖిని కొత్త యాంకర్‌గా తీసుకొచ్చారు…
Ads
ఫాఫం, ఆమెకు చేతనైనంత హైపిచ్‌లో నవ్వింది… కానీ అసలు స్కిట్ల సరుకులో దమ్ముంటే కదా… రేటింగ్స్ లేస్తే కదా… అప్పట్లో కొందరు వేదిక మీదే జోకులు వేశారు శ్రీముఖి మీద… నువ్వెన్నాళ్లో చూస్తాములే అని కొందరు… నాకు నా కుర్చీ కావాలి అంటూ భానుశ్రీ… నాగబాబు వెళ్లిపోయాక రోజా జబర్దస్త్ షో సొంతం చేసుకుంది… ఆమెకు పోటీగా అదిరింది షోను దుమ్మురేపేలా నడిపించాలనుకున్నాడు… చివరకు ఏమైంది.,. శ్రీముఖిని తరిమేయాల్సిన అవసరమే లేదు… షో ప్రసారం కావడం లేదు… చివరగా 13 డిసెంబరున ప్రసారం జరిగినట్టుంది… మొన్నటి ఆదివారం *పార్టీకి వేళాయెరా* వేసి, సరిగమ కాస్త లేటుగా ప్రసారం చేశారు… అదిరింది మాత్రం కనిపించలేదు… రేపటి కోసం ప్రోమో రానే లేదు… అంటే ఢమాల్… సో, మళ్లీ వస్తుందా రాదా అనేది ఇక ప్రశ్నార్థకం…
తాత్కాలికంగా ఆగిపోయిందా..? ఇక దాని కథ పూర్తిగా ముగిసినట్టేనా తెలియదు… ఆమధ్య మరుగుజ్జు కమెడియన్ ఒకతను జగన్‌ను వెకిలిగా అనుకరిస్తూ చేసిన స్కిట్ మీద జగన్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఆడుకున్నారు… దాన్ని నాగబాబు పీకీపీకీ రెచ్చగొట్టి, రచ్చచేసి వదిలేశాడు… చివరకు చానెల్ బాధ్యులు తలపట్టుకున్నారు…
తీసేస్తే తీసేశారు, మంచే జరిగింది అని యాంకర్ రవి… నాగబాబును నమ్ముకుని ఈటీవీ వదిలి బయటికి రానుందుకు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ తదితరులు ఖుషీ అవుతున్నారేమో… కానీ మధ్యలో అదిరింది షోలోకి వచ్చిన సద్దాం, యాదమ్మరాజు తదితరుల సంగతి సరే… గతంలో ఓ రేంజ్లో సక్సెసైన చమ్మక్ చంద్ర పరిస్థితి ఏమిటి..?
నిజానికి కరోనా అనంతర కాలంలో ఈరోజుకూ సినిమాల షూటింగుల్లేవు సరిగా… అందరికీ తిండి పెడుతున్నవి టీవీ సీరియళ్లు, రియాలిటీ షోలే… చివరకు డాన్స్ మాస్టర్లు కూడా ఎక్కడా ఏ దిక్కూలేక, ఈ షోలలో చాన్సులు వెతుక్కుంటున్నారు… అసలే జబర్దస్త్ షోలో పస తగ్గింది… అందరూ విసుగెత్తిస్తున్నారు… కమెడియన్లు వేసే పంచుల్ని కూడా జడ్జిగా ఉన్న రోజాయే వేసేస్తుంటే, అందరూ తూతూమంత్రం స్కిట్లు చేసి మమ అనిపిస్తున్నారు… అసలు స్కిట్లు మానేసి, వాళ్లపై వాళ్లే పంచులు వేసుకుంటూ పరమ దరిద్రంగా మార్చేస్తున్నారు… చివరికి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్కిట్లు కూడా చప్పబడి పోయాయి… అదిరే అభి, రాకెట్ రాఘవ కూడా అంతే… (ఢీ షోలో కామెడీ బిట్లు వంద రెట్లు బెటర్) ఈ స్థితిలో తమను వీడి వెళ్లిపోయిన కమెడియన్లను తిరిగి రప్పించుకుంటే మల్లెమాల టీవీకి కాస్త బెటర్… మరీ ఈమధ్య నాసిరకంగా మారిన షోను కాస్తయినా లేపవచ్చు…
బిగ్‌బాస్ పరిచయాలతో అవినాష్ మాటీవీలో ఓ కామెడీ షో స్టార్ట్ చేయనున్నాడు… ఒకవేళ జీతెలుగు ఇక అదిరింది షోపై పూర్తిగా ఆశలు వదిలేసుకుంటే మాత్రం… అవినాష్‌కు మంచి చాయిస్… ఎలాగూ మాటీవీకి శ్రీముఖి కూడా కావల్సిన కళాకారిణే… కాస్త నోరు, బరువు తగ్గించుకుంటే చాలు… అన్నింటికీ మించి నాన్-ఫిక్షన్ కేటగిరీలో మాటీవీ వాడికి అర్జెంటుగా ఓ మంచి షో పడాలి… లేకపోతే కష్టం… అవినాష్, వింటున్నావా..?
Share this Article