Devika Reddy… అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను… ‘‘ఒక స్థాయిలో ఉన్నవాళ్లు ఆచితూచి మాట్లాడాలి… ఒక్క మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి… సామాన్యులు ఏం మాట్లాడినా చెల్లుతది… చెల్లకపోయినా పైవాళ్లు ఏదో కవర్ చేస్తారు… నడిపించే నాయకుడు జాగ్రత్తగా మాట్లాడాలి…
ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించేప్పుడు… అసలైతే తెలంగాణలో కామన్ గా వాడే మాటే… (కొట్టకుంటే ముద్దుపెట్టుకుంటరా… తిట్టకుంటే ముద్దుపెట్టుకోవాల్నా అంటారు పెద్దవాళ్లు… పిల్లలు ఏదన్నా చిన్న తప్పుచేస్తే ..) కానీ… అవతల ఉన్నది మహిళ, పైగా ప్రత్యర్థి కూడా … సందు కోసమే చూస్తరు ఎవరైనా… ఇట్లే అందుకుంటరు…’’ ఇదీ ఆమె అభిప్రాయం…
జరిగింది అదే… ఊరూరా బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ మీద నిరసన ప్రదర్శనలు చేశారు… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌నే బజారుకు లాగే ప్రయత్నం చేసి, మోడీని- అమిత్ షాను రోడ్డు మీదకు లాగి బదనాం ఎలా చేయాలో సీరియస్‌గా ప్లాన్స్ వేస్తున్న కేసీయార్‌ను ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు…
Ads
బీజేపీ శ్రేణులు అసహనంతో… ‘‘సాక్షాత్తూ లేడీ గవర్నర్ ను ఓ నియోజకవర్గ నాయకుడు ‘ఫైళ్లన్నీ ము– కింద పెట్టుకుంటవా’ అన్నాడు… (ఆ మాట అన్నాక కూడా ఆ నాయకుడు విప్ అయ్యాడు) ఓ మహిళా ఎంపీడీవోను ‘అంతటా బానే ఊపుతున్నవ్ కానీ ఈడ ఊపుతలేవు’ అని ఓ మంత్రే అన్నాడు… ‘నీ భర్తకు చెప్పకుండా షాపింగ్ పేరుతో బయటకు రా…’ అని ఎమ్మెల్యే మరో మహిళ ద్వారా సొంత పార్టీకే చెందిన మహిళా ఉపసర్పంచ్ తో చెప్పించిండు… తను మాజీ ఉపముఖ్యమంత్రి…
ఇవన్నీ తప్పులు కావట… (అంతకుముందూ ఎన్నో ఆరోపణలు సదరు ఎమ్మెల్యే మీద… ఓ బర్త్ డే పార్టీలో ఎన్నిచిలిపిచేష్టలో… అయినా చర్యల్లేవ్… పాపం, తాజా బాధితురాలి గోసను పట్టించుకున్న దిక్కులేదు) ‘అరెస్ట్ చేయకుంటే ముద్దుపెట్టుకుంటర’ అని ఓ పార్టీ రాష్ట్ర చీఫ్ అనడంలో తప్పేముంది..?
కంటెంటు ఎంత పరుషంగా ఉన్నా సరే, మాట మర్యాదగా రావాలి రాజకీయాల్లో… బండి సంజయ్ అందులో పూర్… బడబడా తనకు తోచింది ఏదో అనేస్తాడు… తను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, రాష్ట్రంలో అధికారం కావాలని కొట్లాడే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడనే సోయి పెద్దగా తన మాటల్లో కనిపించదు… తప్పులు మాట్లాడుతున్నాడని కాదు, ఎక్కడా ఎదుటివాళ్లకు తిరిగి కౌంటర్లు ఇచ్చే సీన్ ఉండకూడదు…
ఇప్పుడు చూడండి, ఆ మాటను బీఆర్ఎస్ శ్రేణులు ఎలా డైవర్షన్ కోసం ఉపయోగించుకున్నాయో… నిజానికి కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకల్లోతు మునిగిపోయింది… బీఆర్ఎస్ మీద నెగెటివ్ ప్రభావం ఉండబోతోంది… ఎప్పటికప్పుడు ఢిల్లీ దీక్ష, బీజేపీ కక్షసాధింపు అంటూ అవినీతి, అక్రమాల ఊసులు జనంలో చర్చకు రాకుండా చూడటానికి బీఆర్ఎస్ విశ్వప్రయత్నం చేస్తోంది… ఇలాంటప్పుడు బీజేపీకి ఎంత స్ట్రాటజీ కావాలి…? మాటల్లో కాస్త సంస్కారం, పరిణతి కనిపించాలి కదా..? ప్చ్… కేసీయార్ బలాలు వేరే ఏమీ లేవు… ప్రత్యర్థి పార్టీల్లో బండి సంజయ్‌లు ఉండటమే తన బలం..!!
Share this Article