Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు హీరోలు రోజూ అమృతం సేవిస్తారు- ఎవర్ యంగ్, ఎవర్ ఎనర్జిటిక్…

May 19, 2024 by M S R

Subramanyam Dogiparthi….  అంజలీదేవి తల్లి అయిపోయింది , జగ్గయ్య తండ్రి అయిపోయాడు ANR కి … హీరోలు అమృతం తాగినట్లు హీరోలుగానే లాగిస్తుంటారు … ఎవర్ యంగ్, ఎవర్ ఎనర్జిటిక్… ఆ హీరోతో పాటు నటించిన సైడ్ ఏక్టర్లు , హీరోయిన్లు , కేరెక్టర్ ఆర్టిస్టులు అమ్మలు , అమ్మమ్మలు , వదినలు అయిపోతుంటారు . ఈ పరిణామాలు మనకు గమ్మత్తుగా ఉంటాయి … సినిమా హీరో అంటే అంతే…


కాలేజీ రోజుల్లో ఈ సినిమా మాకు భలే నచ్చింది . కాలేజి కుర్రాడిగా ANR చాలా హుషారుగా కనిపిస్తాడు . ANR బ్లేజర్లు భలే ఉంటాయి . అలాంటి బ్లేజర్లు ప్రేమనగర్ , సెక్రటరీ సినిమాల్లో కూడా వేసారు. (అప్పట్లో అక్కినేని డ్రెస్ లన్నీ Zeenart మద్రాస్ వాళ్ళు తయారు చేసే వాళ్ళు, మద్రాస్ చైనా బజారు దగ్గర ఉండేది అది, ఆయన మకాం హైదరాబాద్ కు మారినా డ్రెస్లు మాత్రం Zenaart దగ్గర నుండే వచ్చేవి…)

బాగానే ఆడినట్లు గుర్తు . స్టోరీ లైన్ బాగుంటుంది . తాతినేని రామారావు దర్శకత్వంలో 1971 లో వచ్చిన ఈ సుపుత్రుడు సినిమాలో ANR , జగ్గయ్య , గుమ్మడి , పెరుమాళ్ళు , ధూళిపాళ , పద్మనాభం , విజయచందర్ , రాజనాల , మిక్కిలినేని , అంజలీదేవి , లక్ష్మి ప్రభృతులు నటించారు . తన తల్లిని మోసం చేసిన తండ్రికి గుణపాఠం చెప్పటం ఈ సినిమా కదాంశం . పెంచిన తండ్రిగా గుమ్మడిది చక్కటి పాత్ర .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్ . ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను (సినారె), వయ్యారి వగలమారి కుమారి వై ఆర్ యు సారీ (ఆత్రేయ) , చిలకమ్మ పిలిచింది (ఆత్రేయ) , అయ్యిందయ్యో అయ్యిందయ్యో (కొసరాజు) పాటలు బాగా హిట్టయ్యాయి .

మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఆడింది . రెండు సార్లు చూసినట్లు గుర్తు . యూట్యూబులో ఉంది కానీ , క్లియర్ గా లేదు . బ్లరింగుగా ఉంది . టి విలో వచ్చినప్పుడు చూడాల్సిందే . చూడబులే . Routine entertaining movie . 
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు 

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions