Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

100 % గరం మసాలా సినిమాలో జయమాలినికి సంసారి పాత్ర..!!

December 4, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. 100% గరం మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ రౌడీ నంబర్ 1 సినిమా… కృష్ణ మార్క్ సినిమా . కృష్ణ ఇమేజికి సరిపడే లెవెల్లో ఉంటుంది . అలాగే వ్రాయబడింది కధ కూడా .

కధను వ్రాసింది యస్ లక్ష్మీ శాంతి . ఆమె గురించి వివరాలు తెలియవు నాకు . కృష్ణ పాత్రతో పాటు ధీటుగా ఉంటుంది SP శారద పాత్ర .‌ శారద పాత్ర అనగానే డైలాగులను అదరగొట్టేస్తారు కదా పరుచూరి బ్రదర్స్ . ఇందులోనూ అంతే.

Ads

ఓ ముగ్గురు విలన్ల చేత పతిత బిడ్డ అని చేతి మీద వ్రాయించుకోబడ్డ పసివాడు అనాధాశ్రమంలో పెరిగి , బోస్టల్ స్కూల్లో చదువుకుని , నిజ జీవితంలో రాబిన్ హుడ్ అవుతాడు . ఆర్తులు దేవుడా అనగానే ప్రత్యక్షం అయి రక్షిస్తూ ఉంటాడు .

హీరో అన్నాక తన్నులు తింటానికి విలన్లతో పాటు డ్యూయెట్లు పాడటానికి ఓ అందమైన హీరోయిన్ కూడా ఉండాలి కదా ! ఆ హీరోయినే రాధ . అందరూ కలిసి సంఘ విద్రోహులయిన విలన్లను పోలీసులకు అప్పచెప్పి నంబర్ వన్ మంచోడు అయిపోవటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

రొటీన్ పగ సాధింపు ఏక్షన్ సినిమాయే అయినా రాధ పోకిరి , గడసరితనం , అల్లరి సినిమాను హుషారు హుషారుగా నడిపిస్తుంది . సీరియస్ ట్రాక్ అంతా కృష్ణ , శారదలది అయితే సరదా ట్రాక్ అంతా రాధదే .
రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా హుషారుగా ఉంటాయి . కృష్ణ , రాధల మీద నాలుగు డ్యూయెట్లు ఉంటాయి .

జై బోలో శివశంకర్ నేనే యమ కింకర్ , అందమైన ఆడపిల్ల కళ్ళు చూస్తే లేడి పిల్ల , ఎందుకో చీమ కుట్టినట్లు ఉన్నది , ఏందయ్యో అంటూ సాగుతాయి ఆ నాలుగు డ్యూయెట్లు . (రాజ్ కోటి వీరు మొదట ఎక్కువగా కృష్ణ చిత్రాలకే సంగీత దర్శకత్వం చేసేవారు, వీరిద్దరి పట్టుదల- వేటూరి మధ్యవర్తిత్వం కారణంగానే కృష్ణ, బాలు కలయిక సాధ్యం అయింది)

జయమాలిని ఉంది కానీ సంసారి పాత్ర . అప్పుడప్పుడు దర్శకులు ఆమెకు ఆటవిడుపుగా సంసారి పాత్రలను ఇస్తూ ఉంటారు . ఆ అవకాశం ఆమెకు ఈ సినిమాలో కలిగింది . ఆమె హాట్ & మాస్ డాన్స్ మరో నటికి లభించింది . సరదా సొగసు ఉన్నదాన్ని అంటూ పాడుతుంది .

పాటలన్నీ వేటూరి వారే వ్రాసారు .‌బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర గాత్రించారు . సినిమాలో కృష్ణ ఎంట్రీ అదిరిపోతుంది . కృష్ణ అభిమానులకు పూనకమే . మరో అగ్ని సినిమాయే కృష్ణకు . ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , గొల్లపూడి , నూతన్ ప్రసాద్ , త్యాగరాజు , సాక్షి రంగారావు , సుత్తి వీరభద్రరావు , జయమాలిని , నర్రా తదితరులు నటించారు .

కె వి వి సత్యనారాయణ నిర్మాత . యస్ యస్ రవిచంద్ర దర్శకుడు . చాలా బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకోవడమే కాకుండా దర్శకత్వాన్ని కూడా అదే స్పీడ్ & స్పిరిట్లో లాగించాడు . 1988 జూన్లో రిలీజయిన ఈ రౌడీ నంబర్ 1 సినిమా యూట్యూబులో ఉంది . 100% వినోదం , కాలక్షేపం గ్యారంటీ . పైగా రాధ . చూడబులే .

నేను పరిచయం చేస్తున్న 1184 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!
  • గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!
  • “చచ్చావా… బతికావా?”…. చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కొత్త యాప్…!
  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…
  • పండుగ స్పెషల్ షో అయినా సరే… అదే జబర్దస్త్ మార్క్ బూతు స్కిట్…
  • రాహుల్ ద్వంద్వ పౌరసత్వం… కోర్టులో ప్రస్తుత స్థితి… ఫ్యాక్ట్ చెక్…
  • ఈసారి నిజంగానే చంద్రుడిపై కాలు పెడతారట అమెరికన్లు..!!
  • అమెరికా చుట్టూ అసాధారణ లక్ష్మణరేఖ… 75 దేశాలకు వీసాల నిలిపివేత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions