Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వైభవ్ సూర్యవంశీలో పరివర్తన..! ఈలోపే పాపం *నిష్క్రమణ…!

May 30, 2026 by M S R

.

గుజరాత్ క్వాలిఫయర్-2 లో గెలిచి… ఇక వచ్చే ఆదివాారం ‘తమ అహ్మదాబాదు’లో బెంగళూరుతో ఫైనల్ ఆడబోతోంది… వోకే… గుజరాత్ గెలిస్తే గెలవనీ… నిన్నటి మ్యాచులో రాజస్థాన్ ఓడిపోతే పోనీ… మనకు ఎవరు ఫైనల్‌లోకి వెళ్లినా ఒకటే… కాకపోతే నిన్నటి మ్యాచులో ఒక విశేషం స్పష్టంగా కనిపించింది… అది కూడా చెప్పుకుందాం…

నో, నో, సాయి సుదర్శన్ హిట్ వికెట్ గురించి కాదు… గుజరాత్ పర్‌ఫెక్ట్ వ్యూహంతో రాజస్థాన్‌ను ఇంటికి పంపించడం గురించి కాదు… రాజస్థాన్ బౌలర్లు ఘోరంగా విఫలమై, గుజరాత్ బౌలర్లు భటే కట్టడి చేయడం గురించి కూడా కాదు… శుభమన్ గిల్ సెంచరీ గురించి కూడా కాదు…

Ads

ఓడిపోయినా సరే… రాజస్థాన్ జట్టులో మళ్లీ మెరిసిన వైభవ్ సూర్యవంశీ గురించి..! పదే పదే ఎన్నిసార్లు పొగుడుతాంలే అంటారా..? కాదు, తను మునుపటి వైభవ్ కాదు… పరివర్తన చెందాడు, కాస్త మెచ్యూరిటీ వచ్చింది… వచ్చిన ప్రతి బంతినీ బాదుదాం అనే పోకడ కనిపించలేదు మ్యాచ్ మొదటి నుంచీ..!

గుజరాత్ బౌలర్లు సంధిస్తున్న మంచి బాల్స్ వదిలేశాడు… సింగిల్స్ తీశాడు… ఎదుటి బ్యాటర్‌కు స్ట్రయికింగ్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చాడు… ఒకవైపు టపటపా వికెట్లు పడిపోతున్నా సరే… జడేజాతో కలిసి మంచి పార్టనర్‌షిప్ నిర్మించి… నడుమ నడుమ బ్యాడ్ బాల్ వస్తే బౌండరీలు దాటించాడు… అదీ ఆటగాడిలో ఉండాల్సిన లక్షణం…

అది మెల్లిమెల్లిగానైనా అలవడుతోంది బుడ్డోడికి..! అదీ చెప్పాలనుకున్న విశేషం… రాజస్థాన్ జట్టు వితవుట్ వైభవ్ సూర్యవంశీ ఈజ్ నథింగ్ అన్నట్టుగా మారిపోయింది… పాపం, వన్ షాట్ దూరంలో సెంచరీ మిస్సయ్యాడు… అలా ఇది మూడోసారి… ఇక ఛాన్స్ ఏముంది..? ఈ పరాజయంతో ఇంటికే కదా… ఈ ఐపీఎల్‌లో పవర్ ప్లేలో 500 దాటి రన్స్ చేసి, ఇలా చేసిన మొదటి ఆటగాడయ్యాడు, సిక్సుల్లో క్రిస్ గేల్‌ వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు… తరచి చూస్తే చాలా రికార్డులు బ్రేకయి ఉంటాయి…

అది కాదు, తనలోని సుగుణం ప్రతి జట్టు ఫ్యాన్స్‌ను తన ఫ్యాన్స్‌గా మార్చింది… అది నిర్భయంగా ఆడటం… బాల్ వేసేది ఎవడైతేనేం, ఎంత తోపయితేనేం అన్నట్టుగా బాల్ చూశాడు తప్ప, బౌలర్ మొహం చూడలేదు… ఈ గుణం చాన్నాళ్లు ఉంటుందో లేదో తెలియదు గానీ… ఇదొక యూనిక్ కేరక్టర్… అంతే…

ఇక ఆదివారం గుజరాత్- బెంగళూరు నడుమ ఫైనల్… బహుళ ప్రచారంలో ఉన్నట్టు గుజరాత్ విజేతగా ఆల్రెడీ ఫిక్సయిపోయిందా..? చూడాలిక..! అసలే ఐపీఎల్… ఏదైనా ముందస్తుగా జరిగిపోయి ఉండొచ్చు… చూద్దాం..!

  • చివరగా… ఆ టైమ్‌లో మెట్రోలో వస్తున్నాను… రష్ తక్కువే ఉంది… అలా తేరిపార చూస్తే సీట్లలో కూర్చున్న ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్… ఆల్మోస్ట్ అందరూ వైభవ్ ఆటనే చూస్తున్నారు (నాతో సహా)… విచిత్రం ఏమిటంటే… తను ఔట్ కాగానే సగం మంది రీల్స్ వైపు వెళ్లిపోయారు..! (ఆసక్తిగా కాస్త దూరం వెళ్లి మరీ గమనించిన అంశం)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions