Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

RRR … కష్టాల్లో ఒకరికొకరు… ఇప్పుడు ఈ ముగ్గురిదీ విజయబావుటా…

October 5, 2025 by M S R

.

2012… తుగ్లక్ సినిమా… రక్షిత్ శెట్టి హీరో… (అవును, రష్మికతో పెళ్లి రద్దయిన కన్నడ హీరో)… దీనికి సహాయ దర్శకుడు రిషబ్ శెట్టి… మొదటిరోజే మార్నింగ్ షోలు రద్దయ్యాయి… తరువాత షోకు కేవలం పది మంది వచ్చారు…

ఒరేయ్, ఈ సినిమాలు మనకు అచ్చిరావేమో, నువ్వు ఇంకో సాఫ్ట్ వేర్ కొలువు వెతుక్కో, నా వాటర్ క్యాన్ల సప్లయ్ నేను చూసుకుంటాను అన్నాడు రిషబ్ రక్షిత్ తో… వెయిట్ చేద్దాం అన్నాడు రక్షిత్ శెట్టి…

Ads

2016… సినిమా పేరు రికీ… దర్శకుడు ప్లస్ నటుడు రిషబ్ థియేటర్ల యాజమాన్యాలను బతిమిలాడాడు, ప్లీజ్ ఒక్క ఈవెనింగ్ షో వేయండని… అట్టర్ ఫ్లాప్ సినిమా… ఇందులో కూడా హీరో రక్షిత్ శెట్టి…

తరువాత 2018… కిరిక్ పార్టీ… దర్శకుడు రిషబ్, హీరో రక్షిత్, హీరోయిన్ రష్మిక మందాన… సూపర్ హిట్… ఇక వాళ్లు వెనక్కి తిరిగి చూసుకోలేదు… (ఈ సినిమాతో రక్షిత్, రష్మిక ప్రేమ, నిశ్చితార్థం, తరువాత బ్రేకప్ వేరే కథ… రిషబ్, రక్షిత్ స్నేహితులకు అప్పట్నుంచే రష్మిక అంటే పడదు)…

తరువాత కాంతార… ఇప్పుడు కాంతార చాప్టర్ 1… 5000 థియేటర్లలో హౌస్ ఫుల్… రక్షిత్ కూడా చార్లి, సప్తసాగర దాచే (ఇందులో ప్రజెంట్ ట్రెండింగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిమేల్ లీడ్ రోల్)… ఇప్పుడు నిర్మాత కూడా…

రిషబ్ శెట్టి గానీ, రక్షిత్ శెట్టి గానీ వెంట వెంటనే పెద్ద పెద్ద కలలు కనలేదు. చిన్న సినిమాలు చేస్తూ నెమ్మదిగా నేర్చుకుంటూ, తమకంటూ ఒక పంథాను నిర్మించుకుంటూ ముందుకు సాగారు… కన్నడ పరిశ్రమ దృష్టి అంతా హీరో రక్షిత్ శెట్టిపై ఉన్నప్పటికీ, రిషబ్ శెట్టి నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ పోయాడు…

కాంతార వంటి బ్లాక్ బస్టర్‌ను ప్రిక్వెల్ (కాంతార చాప్టర్ 1) తో రిపీట్ చేయడం ఓ ఘన విశేషమే… ఇక్కడిదాకా చేరుకోవడానికి రిషబ్ శెట్టికి 12 ఏళ్లకు పైగా సమయం పట్టింది… ఈ ప్రయాణంలో నేర్చుకోవడం, పాత పద్ధతులను వదిలేయడం, నెట్‌వర్కింగ్, ఆత్మవిశ్వాసం, వైఫల్యాలు అన్నీ ఉన్నాయి…

తుది సందేశం చాలా విలువైనది… “ఎందుకంత తొందర? తొందర వినాశనానికి దారి తీస్తుంది. లో-కీగా ఉండు… నిలదొక్కుకో… లెజెండ్‌ గిరీని నిర్మించుకుంటూ పో…”

ఆర్ఆర్ఆర్… కన్నడం ఇండస్ట్రీలో ఈ పదం పాపులర్… ఒకరు రిషబ్ శెట్టి, మరొకరు రక్షిత్ శెట్టి, ఇంకొక పేరు రాజ్ బి శెట్టి… ముగ్గురూ మంచి స్నేహితులు… ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ విజయత్రయంగా నిలిచారు… వీరు ముగ్గురూ తరచుగా ఒకరి సినిమాలకు మరొకరు సహకరిస్తారు… ఉదాహరణకు…

  • రాజ్ బి. శెట్టి, ‘కాంతార’ (రిషబ్ శెట్టి) సినిమాలో కీలకమైన భూత కోల (కోలెం) సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశాడు…
  • రాజ్ బి. శెట్టి, ‘777 చార్లీ’ (రక్షిత్ శెట్టి) సినిమాకు డైలాగ్స్‌లో కొంత భాగం రాశాడు, ఓ పాత్ర కూడా చేశాడు…
  • రక్షిత్ శెట్టి, రాజ్ బి. శెట్టి  ‘గరుడ గమన వృషభ వాహన’ సినిమాను సమర్పించారు…
  • రిషబ్ శెట్టి, రాజ్ బి. శెట్టి ‘గరుడ గమన వృషభ వాహన’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు…

గరుడ గమన వృషభ వాహన’ (Garuda Gamana Vrishabha Vahana) (2021) – ఈ సినిమాకు దర్శకుడిగా, నటుడిగా విమర్శకుల ప్రశంసలు, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు (కన్నడ) గెలుచుకున్నాడు రాజ్ బి శెట్టి…

ఈ ముగ్గురూ ఒకరి కష్ట సమయాల్లో ఒకరు తోడుగా కదులుతూ… మొత్తానికి ముగ్గురూ కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు పాతుకుపోయారు… ఇదీ ఈ ముగ్గురి ఉమ్మడి సక్సెస్ స్టోరీ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions