కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్… అంటే రఫ్ అర్థం ఏనుగుల గుంపు వెళ్లి దోమ కుత్తుకలో జొచ్చాయని…! రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరో ఉద్యమ నిర్మాత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ బహుజనసమాజ్ పార్టీలో చేరుతున్నాడనే వార్త చూశాక ఠక్కున గుర్తొచ్చిన పద్యపాదం ఇది..! నిర్ణయం ఆశ్చర్యపరిచింది కూడా..! పైగా పార్టీ కండువాను మాయావతి కప్పబోవడం లేదట… (RSP in BSP)… ఎందుకంటే… ప్రవీణ్‌కుమార్‌కు తన బలం ఏమిటో తనకు తెలియడం లేదు ఎందుకు… తను వెళ్లి బీఎస్పీలో చేరడం ఏమిటి..? అసలు బీఎస్పీకన్నా చాలా బలమైన పార్టీని సొంతంగా నిర్మించగల కుశలత ఉంది, ప్లానింగ్ ఉంది… ఇన్నాళ్లూ అన్ని లెక్కలూ సరిగ్గా వేయగలిగిన ప్రవీణ్‌కుమార్ ఇక్కడ ఈ లెక్కకు ఎలా మొగ్గాడు అసలు..? ఆమధ్య మాయావతిని కలిశాడు, బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాల్సిందిగా ఆమె అడిగింది, ఆ తరువాతే తన కొలువుకు రాజీనామా చేశాడు అనేది వార్త…
‘‘కాదు, సొంతంగా ఒక పార్టీని స్థాపించి, రన్ చేసేందుకు తగిన సాధనసంపత్తి లేదు కదా, అందుకని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, లైక్ మైండెడ్ పార్టీతో కలిసి జర్నీ చేయడం బెటర్ కదా…’’ ఇదీ కొందరు మిత్రుల వాదన… నిజమే, ఒక పొలిటికల్ పార్టీ రన్ చేయాలంటే చాలా డబ్బు కావాలి… కానీ డబ్బు మాత్రమే సరిపోదు, జనాదరణను ప్రోది చేసుకునే ఓ ఎమోషనల్ ఫ్యాక్టర్ కావాలి… ప్రవీణ్ దళితబహుజన అనే ఫ్యాక్టర్‌ను ముందుకు తీసుకెళ్లగలడు కదా… పైగా మాయావతి డబ్బూదస్కం ఏమీ ఇవ్వదు… ఏపీ, తెలంగాణాలో ఆ పార్టీ ఉనికి ఎంత..? పవన్ కళ్యాణ్ వంటి చంచల నేతలకు కూడా ఉపయోగపడింది ఏముంది..? నిజానికి ఆమెకు ఏపీలో గానీ, తెలంగాణలో గానీ పొలిటికల్ ఇంట్రస్టులు ఏమీ లేవు… ఆమె దృష్టి అంతా ఉత్తరభారతం, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్… ఏమైనా అవకాశం చిక్కితే హస్తిన… అంతే… తప్పులేదు కానీ ప్రవీణ్ కోరుకునే ఆశయానికి వచ్చే సపోర్ట్ ఏమిటి..?
Ads
సో, ప్రవీణ్ బీఎస్పీకి బలం తప్ప బీఎస్పీ ప్రవీణ్‌కు బలమేమీ కాదు… సరే, తన లెక్కలు తనకు వేరే ఉండవచ్చుగాక… అన్నీ చూసుకున్నాకే బీఎస్పీలో చేరుతూ ఉండవచ్చుగాక… కానీ సొంత పార్టీ అనే సాహసం చేస్తేనే బాగుండేదని తనను అభిమానించేవాళ్ల అభిప్రాయం… ప్రస్తుతం తెలంగాణలో బీఎస్పీ పరిస్థితి ఏమిటి..? 2014 ఎన్నికల్లో ఆశించిన పార్టీ టికెట్లు దొరక్క ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోణప్ప బీఎస్పీ టికెట్లు తీసుకుని, గెలిచారు… తరువాత వాళ్లు ఏమయ్యారో చూశాం కదా… మొన్నటి 2018 ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన మొత్తం నాలుగున్నర లక్షల లోపు… ఈ వోట్లకు చాలారెట్లు ప్రవీణ్ సొంతంగా, అలవోకగా సాధించగలడు… ప్రతి నియోజకవర్గమూ తిరిగితే…! బలంగా ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకుంటూ పోతే…! ఆ బలమైన ఉనికి అప్పుడే సాధ్యమవుతుంది… అయితే అప్పుడే అందరూ వేరే లెక్కలు వేస్తున్నారు… బీఎస్పీ బలపడితే ఎవరికి నష్టం..? ఇటు షర్మిల వచ్చింది, మరోవైపు కాంగ్రెస్ కాస్త పుంజుకుంటోంది… ఇప్పుడు బీఎస్పీ… దళిత సెక్షన్ వోట్లను ఎవరు సంపాదించగలరు..? అంతిమంగా అది ఎవరికి నష్టం..?! కేసీయార్ వ్యతిరేక వోటు చీలడానికే ఈ పరిణామాలన్నీ దోహదపడతాయా..? వేచి చూడాల్సిందే…!!
Share this Article