.
ఎవరు ఈమె… పేరు రుక్మిణి వసంత్… కాంతార చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్‌తో బాగా పాపులర్ సెర్చింగు, ట్రెండింగులోకి వచ్చేసింది… మరీ ఒక్కసారిగా కొత్త నేషనల్ న్యూ క్రష్ అని ప్రచారం సాగుతోంది కానీ… ఎవరీమె..?
బెంగుళూరులోని ఓ కన్నడ కుటుంబం… తన తండ్రి, తల్లి గురించి మాత్రం ఓసారి చెప్పుకోవాలి… తండ్రి పేరు కల్నల్ వసంత్ వేణుగోపాల్…, భారతదేశపు అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రాన్ని పొందిన జాను… అది పొందిన మొదటి కర్ణాటక వ్యక్తి…
Ads
ఎంతటి వారసత్వం… ఆయన 2007లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి వద్ద భారీగా ఆయుధాలు ధరించిన చొరబాటుదారులను సరిహద్దు దాటకుండా నిరోధించేటప్పుడు ఆయన అమరుడయ్యాడు… అప్పటికి రుక్మిణి వసంత్ వయస్సు ఏడేళ్లు మాత్రమే…
ఆమె తల్లి, సుభాషిణి వసంత్, కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన నిష్ణాతులైన భరతనాట్య నృత్యకారిణి … దాదాపు 120 మంది పిల్లల చదువులకు ఈ ఫౌండేషన్ బాసటగా నిలుస్తోంది… ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం…
సప్తసాగరాలు దాటి… రెండు భాగాల ఈ సినిమాతో రుక్మిణి పాపులరైంది… తరువాత మదరాసి… ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్… అంతే… ఐనా ఒక్కసారిగా నేషనల్ క్రష్ ముద్ర పొందింది జాతీయ మీడియాలో కూడా… కొన్నిసార్లు అంతే, మీడియా హఠాత్తుగా పైకి లేపుతుంది… అదే మీడియా అకస్మాత్తుగా కిందపడేయగలదు కూడా… ఇది తెలుసు కాబట్టే నేషనల్ క్రష్ వంటి ముద్రలు నాకిష్టం లేదని కుండబద్దలు కొట్టేసింది… తెలివైంది…
ఇప్పటిదాకా నేషనల్ క్రష్ అనే ముద్ర కొనసాగించబడిన రష్మిక మందాన కూడా సేమ్ కన్నడ అమ్మాయే… ఇప్పుడు తెలుగింటి కోడలు… 9 ఏళ్ల క్రితం కిరిక్ పార్టీ సినిమా తరువాత, గీతగోవిందంతో మొదలైన ఆమె హవా యానిమల్, పుష్ప, ఛావా, కుబేర వంటి సినిమాలతో పీక్స్‌కు చేరింది…
కొన్ని వేల కోట్ల రూపాయల వసూళ్ల సినిమాల్లో ఆమె ప్రధాన కథానాయిక… ఆమె హద్దులు కూడా ఏమీ పెట్టుకోలేదు… పుష్ప, యానిమల్ వంటి సినిమాల్లో పిచ్చి సీన్లలో కాస్త బోల్డ్ హొయలు కూడా పోయింది… కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మీద ఆమె ఫ్యాన్స్‌లోనే భిన్నాభిప్రాయాలున్నాయి…
ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుంటే ఇక కెరీర్ ముగింపు మొదలైనట్టే అనే భావన ప్రబలంగా ఉంది… అందుకని ఎలాగూ డేటింగులో ఉన్నారు కదా, ఇంకొన్నాళ్లు విజయ్ దేవరకొండతో పెళ్లిని వాయిదా వేసుకుంటే ఆమెకు మంచి జరిగేదనే అభిప్రాయం అది… ఎలాగూ విజయ్ కెరీర్ కూడా ఏమీ బాగాలేదు…
అఫ్‌కోర్స్, కరిష్మా కపూర్, దీపిక పడుకోన్, ప్రియాంక చోప్రా వంటి తారల్ని పెళ్లి ఏమీ ఆపలేదు కదా… రష్మికకూ ఢోకా లేదులే అనుకునేవాళ్లూ ఉంటారు… ఐతే నేషనల్ క్రష్ స్టాంప్‌ను మాత్రం రుక్మిణి వసంత్‌కు కోల్పోయింది… ఎప్పటికప్పుడు సినిమా మీడియాకు కొత్త కొత్త క్రష్‌లు కావాలి… ప్రస్తుత పేరు మాత్రం రుక్మిణి..!!
ఈమె గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే… 1) కాంతార చాప్టర్1 … 2) కల్కి-2 సినిమాలో తొలగించిన దీపిక పదుకొన్ ప్లేసులో ఈమెను తీసుకోవాలని దర్శకుడి ఆలోచన…!! 3) NTR నీల్ మూవీలో కూడా చేస్తోంది…
Share this Article