Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రుక్మిణి వసంత్ ! ఆమెకు ఓ ఐడెంటిటీ లేదా ? ఇతర హీరోయిన్లకు కూడా !!

August 7, 2026 by M S R

.

థంబ్ నెయిల్ జర్నలిజం తాలూకు పెడపోకడలు, దుర్వాసనల గురించి చాలా చెప్పుకుంటున్నాం… అదేసమయంలో మరో వెబ్ జర్నలిజం తాలూకు అవలక్షణం కూడా మనసును చివుక్కుమనించేలా కనిపిస్తోంది… రాస్తున్నది మన మిత్రులే అయినా, ఓసారి మాట్లాడుకోవాలి…

ఉదాహరణ… ‘చరణ్‌తో ఎన్టీఆర్ బ్యూటీ రొమాన్స్?’… ఇదీ హెడింగ్… ఫోటో చూస్తే ఆమె రుక్మిణి వసంత్ అని కనిపిస్తూనే ఉంది… 1. ఆమె ఎన్టీయార్‌తో ఏం సినిమా చేసింది..? (డ్రాగన్ రావల్సి ఉంది)… 2. ఆమె పాపులర్ అయ్యింది సప్తసాగర ఎల్లో సినిమాతో, అంటే రక్షిత్ శెట్టితో… తరువాత కాంతారా-1 రిషబ్ శెట్టితో చేసి రష్మికను దాటిపోయి తాజా నేషనల్ క్రష్ అనిపించుకుంది…

Ads

నిజానికి రష్మిక కూడా ఫస్ట్ రక్షిత్ శెట్టితోనే కిర్రిక్ పార్టీ సినిమా చేసి పాపులరైంది… ఆమే నేషనల్ క్రష్… అలాగని ఈ ఇద్దరు నేషనల్ క్రష్‌లకు రక్షిత్ శెట్టి హీరోయిన్లు అని ముద్ర వేయగలమా..? అసలు ఒక సినిమా చేయగానే, ఆ తొక్కలో హీరోలకు పదే పదే ట్యాగ్ చేస్తూ, వాడి హీరోయిన్, వీడి హీరోయిన్ అని రాయడం ఏమిటి అసలు..?

వాళ్లకు సొంత ఐడెంటిటీ లేదా…? కర్నాటక నుంచి తొలి అశోకచక్ర తీసుకున్న సైనికుడి బిడ్ద ఆమె… ఆమెకు సొంత ఐడెంటిటీ ఉంది… పుట్టగానే బొడ్డుతాడు కోసి ఆ హీరోల పేర్లు పెట్టినట్టు…? ఏమిటీ భాష..? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం…

మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అని ఓ సినిమా… అందులో నవీన్ పొలిశెట్టి హీరో, అనుష్క శెట్టి హీరోయిన్… ఆ సినిమా నాటికి పోలిశెట్టికి ఏం పేరుందని..? కానీ అనుష్క శెట్టి… తనకు ఓ రేంజ్ పాపులారిటీ ఉంది… మరి పోలిశెట్టి గురించి వార్తలు రాస్తే అనుష్క హీరో అని రాయగలమా..?

కంగనా రనౌత్ ప్రభాస్‌తో ఏక్‌నిరంజన్ అని ఏదో సినిమా తీసినట్టుంది… ఆమె గురించి రాసినప్పుడు ప్రభాస్ హీరోయిన్ అనీ… దీపిక పడుకోన్ గురించి రాసినా ప్రభాష్ హీరోయిన్ అని రాయగలమా..? ఝుమ్మంది నాదం సినిమాలో నటించింది తాప్సీ పన్ను… మంచు మనోజ్ హీరోయిన్ అని రాయగలమా..? ఓసారి జాతీయ మీడియాలో అలా ఎవరైనా రాస్తే, అప్పుడు తెలుస్తుంది ఆ హీరోయిన్ల స్పందన ఏమిటో…

ఇప్పుడు మహేశ్ బాబుతో టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేస్తోంది… ఆమె గురించి మహేశ్ బాబు హీరోయిన్ అని రాయగలమా..? తను రాంచరణ్ సరసన కూడా చేసింది… ఫ్లాప్… చరణ్ హీరోయిన్ అని రాస్తామా…? ఒక పాత సంగతి గుర్తొచ్చింది…

అల్లరి నరేష్… తన రేంజ్ జస్ట్ యావరేజ్… గీతా సింగ్ అనే నటితో కితకితలు సినిమా చేశాడు, ఏదో ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ ‘ఆమె ఎప్పుడూ నరేష్ హీరోయిన్ అని చెప్పుకుంటుంది కదా’ అని ఏదో చెబుతూ పోయాడు… నవ్వొచ్చింది… నరేష్ హీరోయిన్ అనేది ఓ పెద్ద అవార్డా..? పురస్కారమా..? ఆ పేరుతో ఆమెకు ఏమైనా అవకాశాలు వచ్చాయా..? ఆమె కడుపు నింపాయా..?

అంటే మన హీరోల (సారీ, ఈ మాట అన్నందుకు) మనస్తత్వం, వాళ్లు పెరిగిన వాతావరణం అంతే… పక్కా మగాళ్లు… ఆఫ్టరాల్, హీరోయిన్లు ఎంత టాప్ రేంజుకు వెళ్లినా సరే, వాళ్లను హీరోల పేర్లతో మన వెబ్ జర్నలిజం ట్యాగ్ చేస్తూ వార్తలు రాయడం, సంబోధించడం… ప్చ్, అస్సలు బాగా లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రుక్మిణి వసంత్ ! ఆమెకు ఓ ఐడెంటిటీ లేదా ? ఇతర హీరోయిన్లకు కూడా !!
  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!
  • ‘‘భావి తరాలు రీల్స్‌ బందీలు – ‘రిథమ్’ తప్పిన అల్గా‘రిథమ్ బతుకులు’’
  • క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)
  • క్షుద్రోపాసన ! నెత్తురు, మద్యం, ఎముకలు, పుర్రెలు ! (మూడో భాగం)
  • దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions