.
ఒక వార్త… రష్యా నుంచి S-500 ఎయిడ్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేయాలని ఇండియా ఆలోచిస్తోంది… రష్యా కూడా ఎప్పుడో ఆఫర్ ఇచ్చింది… నిజమేనా..?
ఇక్కడ ఓ నేపథ్యం చెప్పాలి… శత్రుదేశం నుంచి వచ్చే విమానం, డ్రోన్, క్షిపణి నుంచి చిన్న పురుగునైనా సరే కనిపెట్టాలి, బ్లాస్ట్ చేయాలి, నేలకూల్చాలి… ఇదీ ఎయిర్ డిఫెన్స్ సిస్టం… ఫుల్లీ ఆటోమేటెడ్… ఒకసారి సిస్టం ఆన్ చేస్తే చాలు, మన సరిహద్దుల నుంచి ఏమొచ్చినా కూల్చేస్తుంది, కాల్చేస్తుంది…
Ads
ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ కూడా మొన్నటి హమాస్- ఇజ్రాయిలీ ఘర్షణల్లో మొత్తం డ్రోన్లు, మిసైళ్లను అడ్డుకోలేకపోయింది… దాని సక్సెస్ రేటు దాదాపు 80 శాతం… అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ సామర్థ్యం కూడా అంతే…
మరి రష్యా డెవలప్ చేసిన ఎస్-400 మాత్రం నిన్నామొన్నటి ఇండియా- పాకిస్థాన్ ఘర్షణల్లో తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించింది… కొన్ని డ్రోన్లు తప్పించుకున్నట్టు చెబుతున్నారు గానీ ఇప్పుడున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇది నంబర్ వన్…
కానీ అమెరికాను, పాకిస్థాన్‌ను ఎప్పుడూ నమ్మలేం… ఇదొక రోగ్ కంట్రీ… అమెరికా అంతకుమించిన నక్కతనం… కానీ ఇజ్రాయిల్, రష్యాలు మాత్రమే ఇండియాకు కాలపరీక్షలో నిలిచిన దోస్తులు… నిజమే… రష్యా ఎస్-400ను మించి, అంటే, మరింత ఆధునిక టెక్నాలజీని కూడా జతచేసి ఎస్-500 డెవలప్ చేసింది…
పరీక్షించింది కూడా… దాన్ని రష్యా ఇండియాకు ఆఫర్ చేసిన మాట కూడా నిజమే… ఇండియా దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉంది… ఐతే ఇప్పటికే ఆర్డర్ చేసిన ఎస్-400 సప్లయ్ అయ్యాక కొంటారా..? లేక ఇంకా సప్లయ్ జరగని ఎస్-400 స్థానంలో ఎస్-500 తీసుకుంటారా తెలియదు, అది మిలిటరీ రహస్యం…
అదే కాదు, రష్యా ఎస్-550 కూడా డెవలప్ చేసింది… అదే గనుక ఇండియా కొనుగోలు చేస్తే… దానికి మన ఆకాశ్ మిసైల్ సిస్టం కూడా తోడయితే మన గగనతలం సేఫ్… పాకిస్థాన్ కాదు కదా, వాడి తాత పోరాటానికి వచ్చినా ఢోకా లేదు… ఇప్పుడు ఎస్-400కు సుదర్శన అని పేరు పెట్టుకున్నాం కదా, అప్పుడిక పాశుపతం అనే పేరు పెడదాం…
నిన్నా మొన్న అనుభవాలు చూశాం కదా… వాడికి చైనా వాడు సప్లయ్ చేసిన ఎయిర్ డిఫెన్స్ మెకానిజం, మిసైళ్లు ఎట్సెట్రా మొత్తం దీపావళి టపాసుల్లా పేలిపోయాయి… ఎస్, చైనా సరుకు ఎప్పుడైనా చైనా సరుకే…
ఈ అమెరికా మనకు కార్గిల్ యుద్ధ సమయంలో శాటిలైట్ సాయం కావాలని అడిగితే కాదు పొమ్మంది… వాడు పాకిస్థాన్ కన్నా దూర్తుడు…
మైక్రోవేవ్, లేజర్ టెక్నాలజీతో శాటిలైట్ల నుంచి శత్రు విమానాలను కూల్చేసే, క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ డెవలప్ చేసుకోలేమా మనమే..? ష్… సీక్రెట్..!! దేఖ్‌తే రహో..!!
Share this Article