.
WW3 అప్డేట్ 4… రష్యా 12 సుఖోయ్ Su – 35 ఫైటర్ జెట్స్ ను ఇరాన్ కి అందచేసింది!
ఇది పెద్ద విషయమే! పోయిన సంవత్సరం ఇరాన్ తనకి Su – 35 ఎయిర్ సూపీరియారిటి ఫైటర్ జెట్స్ కావాలని అడిగింది!
Ads
అఫ్కోర్స్! పుతిన్ కి కూడe ఇరాన్ సురక్షితంగా ఉండడమే కావాలి! కానీ Su -35 లని వీలున్నంత తొందరగా ఇరాన్ కి ఇవ్వడం పుతిన్ కి సాధ్యం కాదని యూరోపు దేశాలు భావించాయి! కానీ పుతిన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు రికార్డ్ సమయంలో 12 Su – 35 లని తయారుచేసి ఇరాన్ కి ఇచ్చేశాడు!
ఇరాన్ విషయంలో Su -35 అనేది గేమ్ చేంజర్ అవుతుందా?
సమాధానం అవును, కాదు అనే వస్తుంది!
అవును అనడానికి కారణాలు:
ఇరాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆధునిక జెట్ ఫైటర్స్ అంటూ ఏవీ లేవు!
24 Mig 29s రష్యన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నట్లుగానే కానీ 20 ఏళ్ళ పాతవి ఇరాన్ దగ్గర ఉన్నవి..
అప్గ్రేడ్ చేయకుండానే నెట్టుకొస్తూ ఉంది ఇరాన్!
23 సుఖోయ్ Su 24 లు ఉన్నాయి కానీ ఇవి కూడా పాతవే!
F – 4 ఫాంటమ్ లు అమెరికా నుండి కొన్నవి ఉన్నాయి కానీ అవి 1960 దశకం నాటివి. వీటిలో వార్ రెడీ ఫిట్నెస్ తో ఎన్ని ఉన్నాయో తెలీదు!
F-14 TomCat ల కూడా 1975 లో అప్పటి ఇరాన్ రాజు షా అమెరికాతో సఖ్యతగా ఉన్నరోజుల్లో కొన్నవి కానీ అమెరికా ఆంక్షలు ఉండడంతో ఇవి కూడా ఎన్ని యుద్ధ సంసిద్ధతతో ఉన్నాయో తెలీదు. 2014 లో అమెరికా తన ఎయిర్ ఫోర్స్ నుండి F-14 లని తీసివేవేసింది ప్రొడక్షన్ కూడా ఆపేసింది!
చైనా తయారీ చెంగ్డు J-7 లు 17 ఉన్నాయి కానీ ఇవి mig 21 లకి లైసెన్స్డ్ కాపీలు. జస్ట్ ఉన్నాయి అంటే ఉన్నాయి!
So! ఇరాన్ ఇన్వెంటరీలో ఉన్న వాటితో పోలిస్తే Su – 35 లు అధునాతనమైనవి అని చెప్పుకోవచ్చు!
SU 35 లు ఎయిర్ సుపిరియారిటీ ఫైటర్ జెట్స్!
1. ఎయిర్ to ఎయిర్, ఎయిర్ to గ్రౌండ్, యాంటి షిప్ మిస్సైల్స్ ప్రయోగించగలదు! డాగ్ ఫైట్ కోసం 30 mm క్యానన్ ఉంది!
2. గగనతల రక్షణ కోసం, అవసరం అయితే భూమి మీద, ఆకాశంలోకూడా దాడి చేయగలదు.
3. Su 35 త్రస్ట్ వెక్టరింగ్ ( Thrust Vectoring) టెక్నాలజీతో పనిచేసే ఇంజిన్లు ఉండడం చేత సెల్ఫ్ ప్రొటెక్షన్ విషయంలో మిగతా వెస్ట్రన్ పోటీదారుల కంటే ముందు ఉంది.
4. స్పీడ్ 2.25 మాక్ తో వేగంగా వెళ్లగలదు. ఒక్క F22 మాత్రమే ఈ వేగంతో వెళ్ళగలదు.
5. రేంజ్ లేదా పరిధి.. 3600 km. ఇది ఆపరేషనల్ రేంజ్.
6. సీలింగ్… 60,000 అడుగులు.
7. సెన్సార్స్ విషయంలో యుద్ధ భూమిలో ఏమీ జరుగుతుందో పైలట్ తెలుసుకునే విధంగా ఉంటుంది.
****
అనుకూలతలు..
Su 35 లు అన్ని విషయాలలో వెస్ట్రన్ దేశాలతో పోటీపడుతుంది కానీ రెండు విషయాలలో వెనకపడి ఉంది.
అవి
రాడార్, మిస్సైల్స్.
Su 35 రాడార్ ఇబ్రిస్ ఇ ( Ibris E) టెక్నాలజీ తో పనిచేస్తుంది. ఇబ్రెస్ ఈ రాడార్ పాసివ్ ఎలక్ట్రానికల్లి స్కాన్డ్ యారే ( Passive Electronically Scanned Array) పీసా ( PESA) అనేది ఔట్ డేటెడ్ టెక్.
అఫ్కోర్స్! PESA అనేది ఇప్పటికీ ప్రభావం చూపగలిగే టెక్నాలజీ అని చెప్పవచ్చు. PESA రాడార్ భూమి మీద ఉండే లక్ష్యాలను, సముద్రం మీద ఉండే లక్ష్యాలను , గాలిలో ఉండే లక్ష్యాలను గుర్తించడంలో బాగా పనిచేస్తుంది కానీ ప్రత్యర్థి ఎలెక్ట్రానిక్ వార్ ఫెర్ తో PESA రాడార్ ను జామ్ చేయగలరు.
వెస్ట్రన్ టెక్నాలజీ AESA (Active Electronically Scanned Array) తో 20 ఏళ్ళ ముందు ఉంది.
మన SU – 30 MKI కి అడ్వాన్స్డ్ వెర్షన్ SU 35 . మన SU 30 MKI లు కూడా PESA రాడార్లు కలిగి ఉన్నాయి కానీ తరంగ్ ( TARANG – AESA) AESA రాడార్లతో అప్గ్రేడ్ చెస్తున్నారు.
ప్రస్తుతం SUPER SUKHOI పేరుతో మన SU 30 MKI లని అప్గ్రేడ్ ( SU 35 ) చేస్తున్నారు.
So! ఇజ్రాయెల్, అమెరికన్ జెట్స్ ను కొద్దిసేపు Su 35 ఆపగలదు. అలాగే ఇజ్రయెల్ విమానాలు నేరుగా ఇరాన్ లోకి వచ్చి దాడి చేసే పరిస్థితి ఉండదు.
మరి మన దగ్గర ఉన్న Su 30 MKI ల సంగతి ఏమిటీ?
మన దగ్గర ఉన్న 274 SU 30 MKI లకి ఫ్రాన్స్ దేశం ఏవియానిక్స్ ను ఇచ్చింది. ఇజ్రాయెల్ ELBIT EW సూట్ ను ఇచ్చింది.
ఇక PESA రాడార్ స్థానంలో మన EASA రాడార్లు అయిన తరంగ్ ను అమరుస్తున్నారు.
*******
పర్షియన్లు సహజంగానే తెలివిగల వాళ్ళు!
ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు అనుభవం ఉండాలి కానీ ప్రత్యర్థిని మట్టి కరిపించగలరు.
ఇప్పుడు Su 35 లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ట్రైనింగ్ ఎన్నాళ్ళు కావాల్సి ఉంటుంది ?
బస్ డ్రైవర్: 4 నుండి 8 వారాల ట్రైనింగ్ కావాలి.
ట్రెయిన్ లోకో పైలట్: 3 నెలల నుండి 12 నెలల ట్రైనింగ్.
జెట్ ఫైటర్స్ పైలట్: కనీసం ఒక సంవత్సరం నుండి 3 ఏళ్ళ ట్రైనింగ్ కావాలి.
యుద్ధ ప్రాతిపదికన రష్యన్ ఇంజినీర్లు, శిక్షణ ఇచ్చే పైలట్లు ఇరాన్ చేరుకున్నారు!
ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లో ఆధునిక విమానాలు లేకపోయినా 37,000 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్ తో పోలిస్తే చాలా ఎక్కువ!
ఇంత సమయం ఇజ్రాయెల్, అమెరికాలు ఇస్తాయా?
మధ్య ప్రాచ్యంలో ఉన్న దేశాలతో పోలిస్తే ఇరాన్ పైలట్లు అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు… కాకపోతే అనుభవం లేదు. సమయం ఇస్తే ఇజ్రాయెల్, అమెరికన్ జెట్స్ కి పోటీ ఇవ్వగలరు.
రష్యా ఇరాన్ కి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నది?
ఇరాన్ కనుక రష్యా చేజారిపోతే నాటోలో చేరిపోతుంది!
ఇరాన్ రాజు షా పహ్లావి తిరిగి ఇరాన్ కి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు! రష్యా చుట్టూ శత్రు దేశాల సంఖ్య పెరిగిపోతుంది!
Contd… WW III అప్డేట్ 5 లో సిరియా రెబెల్స్ చేతిలోకి వెళ్ళిపోయే రోజు దగ్గర్లో ఉంది…… (పొట్లూరి పార్థసారథి)
Share this Article