Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

SPETSNAZ… హమాస్ కమాండో ట్రైనింగ్ వెనుక రష్యన్ ప్రత్యేక దళం…

October 10, 2023 by M S R

ఇజ్రాయిల్ మీద హమాస్ దాడి కి సంవత్సరం క్రితమే పథక రచన జరిగింది!

సూత్రధారులు రష్యా, ఇరాన్, టర్కీ!

రష్యా, ఇరాన్, టర్కీ దేశాలలో హమాస్ తీవ్రవాదులకు కమెండో ఆపరేషన్ లో శిక్షణ ఇచ్చాయి మూడు దేశాలు!

Ads

మొత్తం 1000 మంది హమాస్ ఉగ్రవాదులు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు!

కమాండో ట్రైనింగ్ కోసం 20 నుండి 25 ఏళ్ల యువకులని ఎంపిక చేశారు!

***************************

రష్యా : SPETSNAZ ఇది రష్యన్ స్పెషల్ ఫోర్స్ పేరు.

కౌంటర్ ఇన్సర్జన్సీ, పవర్ ప్రొజెక్షన్ మిషన్స్ ని నిర్వహిస్తుంది! రష్యన్ లైట్ ఇంఫాన్ట్రీ ఫోర్సెస్( Light Infantry Forces) డివిజన్ లో భాగంగా ఉంటుంది ఈ Spetsnaz. యుద్ధం జరుగుతున్నప్పుడు లైట్ ఇన్ ఫాన్ట్రీ ముందు వెళుతుంటే దాని వెనుకగా Spetsnaz కమండోలు ఉంటారు. ఒకవేళ శత్రు సైన్యపు బంకర్లు నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నపుడు Spetsnaz కమాండోలకి మిషన్ అప్పచెప్తారు. Spetsnaz కమాండోలు ముందుకి వెళ్లి ఒక్కసారిగా బంకర్ల మీద దాడి చేసి అందులో ఉన్న వాళ్ళని చంపేస్తారు!

మెరుపు వేగంగా కదులుతూ శత్రువు బంకర్ల మీద దాడి చేస్తారు. వీళ్ళు ఫెన్సింగ్ కట్టర్లతో పాటు హాండ్ గ్రనేడ్స్, రివాల్వర్, మిలటరీ గ్రేడ్ డాగర్ ని వాడతారు. పని పూర్తవగానే తిరిగి వెనక్కి వచ్చేస్తారు. ముఖ్యంగా పక్క బంకర్లలో ఉండేవాళ్ళకి తెలియకుండా పని కానిచ్చేస్తారు.

Spetsnaz చేత 200 మంది హమాస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది రష్యా!

సంవత్సరం నుండి మూడు బాచ్ లుగా విడదీసి ట్రైనింగ్ ఇచ్చింది రష్యా! అయితే ఇరాన్ లో ఇదంతా జరిగింది!

Spetsnaz దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లే దక్షిణ ఇజ్రాయెల్ లో ఉన్న IDF చెక్ పోస్ట్ ల మీద దాడి చేసి సరిహద్దు పట్టణాలలోకి ప్రవేశించారు.

******************

ఇరాన్: సముద్రంపై, సముద్రం నీటి అడుగున ఎలా వేగంగా, నిశ్శబ్దంగా ప్రయాణించాలో శిక్షణ ఇచ్చింది.

చిన్న చిన్న స్పీడ్ బోట్లతో శత్రువు మీద దాడి చేసే సామర్ధ్యం ఇరాన్ కి ఉంది.

గత దశాబ్ద కాలంగా అమెరికా విమాన వాహక నౌకలని చిన్న స్పీడ్ బోట్లలో RDX ని నింపి ఎలా ధ్వంసం చేయవచ్చు అనే ప్రయోగాల కోసం నమూనా విమాన వాహక నౌకల మీద దాడి చేసి వాటి ఫలితాలని విశ్లేషిస్తూ వస్తున్నది.

అలాగే స్కూబా డైవింగ్ సూట్లని ధరించి సముద్రం లోపల 3 నాటికల్ మైళ్ళు ఎలా ఈదాలో హమాస్ కి శిక్షణ ఇచ్చింది!

100 మంది హమాస్ ఉగ్రవాదులకి AK47 లని మోసుకుంటూ ఈదగలిగేలా శిక్షణ ఇచ్చింది!

చిన్న చిన్న బోట్లలో మధ్యధరా సముద్రంలోకి వచ్చి ఇజ్రాయెల్ తీరానికి 3 నాటికల్ మైళ్ళ దూరంలోనే సముద్రంలో ఈదుకుంటూ తీర ప్రాంతానికి చేరుకొని దాడి చేశారు!

****************

టర్కీ: పారా గ్లైడింగ్ కి టర్కీ ప్రసిద్ధి!

100 మంది హమాస్ ఉగ్రవాదులు టూరిస్ట్ వీసాతో టర్కీకి వచ్చి పారా గ్లైడింగ్ లో శిక్షణ పొందారు.

అఫ్కోర్స్, ప్రెసిషన్ & కంట్రోల్డ్ గ్లైడింగ్ లో శిక్షణ ఇచ్చింది టర్కీ!

ఈ శిక్షణ తక్కువ దూరంలో గాలిలోకి ఎగిరి కంట్రోల్ గా దిగవలసిన చోట 100 మీటర్లు అటూ ఇటుగా ఎలా గ్లైడ్ చేయాలో శిక్షణ ఇచ్చింది. టర్కీ సైన్యంలో ప్రత్యేక విభాగం ఉంది గ్లైడింగ్ కోసం!

ఇక గ్లైడర్స్ విషయానికి వస్తే కేవలం గాలి ఆధారంగా కాకుండా వెనక ప్రొపెల్లర్ తో ముందుకు నెట్టే గ్లైడర్స్ ని వాడారు హమాస్ తీవ్రవాదులు. అలాగే గాల్లో ఉండగానే కింద ఎవరన్నా IDF సైనికులు ఉంటే కింద ఉన్న టార్గెట్ ని షూట్ చేయడం కూడా ప్రాక్టీస్ చేశారు.

*********************

ట్రైనింగ్ పూర్తయ్యాక దాడి కోసం మాక్ డ్రిల్ నిర్వహించారు… అదెలా అంటే…

1.సముద్ర మార్గం ద్వారా ఇజ్రాయెల్ లోకి రావాలంటే ముందు ఎక్కడ దాకా బోట్లలో వచ్చి ఈదుకుంటూ వస్తే ఎంత సమయం పడుతుంది? దానికోసం ఎంత ముందుగా సిద్ధం అవ్వాలి? ఇలాంటి లెక్కలు కేవలం మిలటరీ మాత్రమే ఇవ్వగలదు.

2.లేబనాన్ నుండి గ్లైడర్స్ ద్వారా ఇజ్రెయేల్ లోకి ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయలు దేరితే ఎప్పుడు లాండ్ అవుతారు?

3.ఇక గాజా నుండి సొరంగం ద్వారా బయటికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ భూభాగంలో ఎవరు ఎక్కడ రక్షణగా ఉండాలి ?

4.గాజా నుండి ఇజ్రాయెల్ చెక్ పోస్టుల దగ్గర ఎంతమంది IDF సైనికులు కాపలాగా ఉంటున్నారు?

5.రాకెట్ దాడి జరిగినప్పుడు IDF తోపాటు పౌరులు ఎలా స్పందిస్తున్నారు? ఈ డేటాని జాగ్రత్తగా సమకూర్చుకున్నారు!

6.IDF బేస్ ల దగ్గర ఉన్న సైనికులు సైరన్ మోగగానే అందరూ అండర్ గ్రౌండ్ బంకర్ లోకి వెళ్లిపోతున్నారా? లేక బేస్ పైన ఎవరన్నా కాపలాగా ఉంటున్నారా? ఈ డేటాని కూడా సేకరించారు!

************************

పైన పేర్కొన్న అంశాలని సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి కమాండ్ సెంటర్ ఎక్కడ ఉండాలి? కమాండ్ & కంట్రోల్ సెంటర్ ని పక్కనే ఉన్న జోర్డాన్ లో ఏర్పాటు చేశారు. జోర్డాన్ నుండి హమాస్ ముఖ్య నాయకులు శాటిలైట్ ఫోన్ ద్వారా సమన్వయం చేశారు.

దాడికి ముందు… అంటే ఉదయం 6 గంటలకి ఇజ్రాయెల్ సరిహద్దు కంచె మీద ఏర్పాటు చేసిన నిఘా కెమెరా వ్యవస్థని రష్యా, ఇరాన్ కి చెందిన హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకొని, ఆ నెట్వర్క్ లో డూప్ వీడియోని ప్రవేశ పెట్టారు. అంటే ప్రతి కెమెరా నుండి వెళ్లే వీడియో ఒకేరకంగా అంతా బాగున్నట్లే చూపిస్తాయి.

ఇటీవలే హ్యాకింగ్ చేయడానికి వీలు లేని విధంగా సెక్యూరిటీ నెట్వర్క్ ని AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో అప్గ్రేడ్ చేసింది ఇజ్రాయెల్. ఎవరన్నా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కమాండ్ సెంటర్ లో సైరన్ మొగుతుంది కానీ అలా జరగలేదు అంటే ఎంత పకడ్బందీగా హ్యాక్ చేశారో రష్యన్, ఇరాన్ హ్యాకర్లు!

***********************

ఎప్పుడయితే సరిహద్దు కంచె మీద ఉన్న నిఘా వ్యవస్థని హ్యాక్ చేశారో ఆ విషయం జోర్డాన్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తెలపగానే దాడి మొదలు పెట్టమని జోర్డాన్ నుండి ఆదేశాలు వెళ్లాయి మూడు చోట్లకి. సముద్రం ద్వారా దాడి చేయడానికి నియమించిన వాళ్ళని ముందు రోజు రాత్రి మధ్యధరా సముద్రంలోని అంతర్జాతీయ జలాలలో చేపలు పట్టే ట్రాలర్స్ లో వేచి ఉన్నారు.

**********************

మొదట 6.30 కి రాకెట్ దాడి మొదలుపెట్టగానే గాజా నుండి వివిధ ప్రాంతాలలో సిద్ధంగా ఉన్నవాళ్లు 10 నిముషాలలో ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం గ్రూపులుగా విడిపోయి ఫెన్సింగ్ చెక్ పాయింట్ల మీద దాడిచేశారు. తమతో పాటు ప్రతి చెక్ పాయింట్ కి దగ్గరలో ఒకటికి రెండు బుల్డోజర్లని సిద్ధంగా ఉంచారు.

ఫార్వార్డ్ దళాలు చెక్ పాయింట్ మీద మెరుపు దాడి చేసి అక్కడ ఉన్న IDF కి చెందిన ఇద్దరు సైనికులని చంపి విజిల్ వేయగానే దూరంగా ఉన్న బుల్డోజర్ ని తీసుకొచ్చి కంచెని తొలిగించడం వెంటనే ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి చొరపడడం అన్ని చోట్లా ఒకేసారి చేశారు.

ఇజ్రాయెల్ భూభాగంలో ప్రవేశించిన వాళ్లలో కొంతమంది ముందే మార్కింగ్ చేసిన చోటికి వెళ్లి సొరంగ మార్గం ఔట్ పాయింట్ దగ్గర కాపలా కాయడం, సొరంగం నుండి పైకి వచ్చిన వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఇచ్చారు.

**********************

TIME & DISTANCE !

దాడి మొత్తం మిలటరీ వ్యూహంతో చాల యాక్యురేట్ గా, ప్రెసిషన్ గా జరిగింది అంటే అది రష్యా, ఇరాన్, టర్కీ మిలటరీ వ్యూహకర్తలు కలిసి డిజైన్ చేశారు కాబట్టి విజయవంతం అయ్యింది!

ఆపరేషన్ అల్-ఆక్సా ఫ్లడ్ అని పేరు పెట్టడం అనేది ఇరాన్ పని! ఇలాంటి పేర్లు కేవలం మిలటరీ మాత్రమే పెడుతుంది!

ఇక దాడి చేస్తున్న హమాస్ కి సలహాలు, సూచనలు జోర్డాన్ నుండి హమాస్ ముఖ్య నాయకులు చేయగా ఇరాన్, టర్కీ కి చెందిన మిలటరీ వ్యూహకర్తలు పక్కనే ఉండి సమీక్షించారు.

దాడి సక్సెస్ అవుతున్న వేళ మధ్యాహ్న సమయానికి ఇరాన్, టర్కీ మిలటరీ అధికారులు ప్రయివేట్ బిజినెస్ జెట్ లో అంకారా వెళ్లిపోయారు!

లేబనాన్ నుండి హాంగ్ గ్లైడేర్స్ ద్వారా ఇజ్రాయిల్ లోకి హమాస్ చొరబడింది అంటే లేబనాన్ కూడా ఇందులో పాల్గొంది!

**********************

దాడి చేసే రోజుని సెలెక్ట్ చేయడంలో కూడా వ్యూహం ఉంది!

యెమ్ కిప్పుర్ (Yom Kippur) యుద్ధం (1973 అక్టోబర్ 6 నుండి 25) జరిగి అందులో అరబ్ లీగ్ ని ఓడించి విజయం సాధించి 50 ఏళ్ళు అయిన సందర్భంగా, మరియు ఈజిప్టు నుండి యూదులు ఇజ్రాయెల్ కి తిరిగి వచ్చిన సందర్భంగా, మన సంక్రాంతిలాగా వ్యవసాయ పండుగ సందర్భంగా మొత్తం 7 రోజులు సెలవలు ప్రకటించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.

ప్రజలు,ఉద్యోగులు 7 రోజుల సెలవుల మత్తులో ఉన్నారు.

ఇది ప్రతి సంవత్సరం జరిగేదే కానీ ఈసారి సెలవులు ఎక్కువ వచ్చాయి!

టార్గెట్ డేట్ ని సమర్ధవంతంగా వాడుకున్నారు .

ఇంకా ఉంది…  పార్ధసారధి పోట్లూరి …. 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions