Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!

July 18, 2025 by M S R

.

రష్యన్ మహిళ… పేరు నీనా కుటినా అలియాస్ మోహి (40) కర్నాటక, గోకర్ణంలోని ఓ గుహలో తన ఇద్దరు కూతుళ్లతో కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది కదా… అసలు ఆమె ఆ గుహలో ఎందుకు బతుకుతోంది..?

  • వస్తున్న వార్తలు అనేకం… ఆమె వెర్షన్, భర్త వెర్షన్, పోలీస్ వెర్షన్ రకరకాలు… మొత్తం క్రోడీకరించుకుని విశ్లేషిస్తే ఏదీ స్ట్రెయిట్‌గా లేదు, ఏదో పెద్ద తేడా కొడుతోంది… ఆమె మనస్థితి మీద… ఆమెను ఆ కోణంలోనే ట్రీట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది…

భర్త ఇజ్రాయిలీ… బట్టల వ్యాపారం అట… అప్పుడప్పుడూ ఇండియాకు వస్తుండేవాడు… గోవాలో ఈమె కనిపించింది, ప్రేమించుకున్నారు… కలిసి ఉన్నారు, ఇద్దరు పిల్లలు… ఆమె రష్యన్… గోవాకు ఎందుకొచ్చినట్టు..? బిజినెస్ వీసా మీద వచ్చింది… ఆమె ఏం చేసేదో తెలియదు…

Ads

భర్త డ్రోర్‌ గోల్డ్‌స్టీన్‌ కూడా అదేమీ చెప్పడం లేదు… కొన్నాళ్లు ఉక్రెయిన్‌లో ఉన్నామంటాడు… ఉక్రెయిన్‌కు ఎందుకు పోయినట్టు..? మళ్లీ ఆమె ఇండియాకు ఎందుకు వచ్చేసింది..? అంతా బాగానే ఉన్నప్పుడు ఆమె గోవాలోని ఓ గుహలో బిడ్డకు జన్మనివ్వడం ఏమిటి..? రష్యా, ఇజ్రాయిల్, ఇండియా, ఉక్రెయిన్ చుట్టూ తిరుగుతోంది కథ…

cave life

గడిచిన నాలుగేళ్లలో తన కుమార్తెలను చూడటం కోసం ఇండియాకు తరచూ వస్తున్నానని భర్త చెబుతున్నాడు… తనకు చెప్పకుండానే ఆమె కొద్ది నెలల క్రితం పిల్లలిద్దరినీ తీసుకుని గోవా నుంచి వెళ్లిందనీ అంటున్నాడు… తరువాత గోకర్ణంలో ఉన్నారని తెలిసి, అక్కడికీ వెళ్లినా పిల్లలతో ఎక్కువసేపు గడిపేందుకు అవకాశం ఇవ్వలేదని తన వాదన…

  • మరి తను ఆమెను విడిచి ఎక్కడ ఉంటున్నాడు..? ఆమెను ఎందుకు విడిచిపెట్టాడు..? కేవలం పిల్లల్ని చూడటం కోసమే ఇండియాకు వస్తున్నాడంటే, ఇద్దరూ విడిపోయినట్టా..? మరి ప్రతి నెలా తనకు 3.5 లక్షలు సొమ్ము పంపిస్తున్నట్టు కూడా చెబుతున్నాడు… ఎక్కడికి, ఏ అడ్రస్‌కు..? ఏ రూపంలో..? అంతా గందరగోళపు వాదన… ఇంతకీ ఆ డబ్బు ఏమైంది..?

ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆమెను రష్యాకు డిపోర్ట్ చేయవద్దని, ఆమె పిల్లలను తీసుకుని వెళ్లిపోతే తనకు బాధగా ఉంటుందనీ మరో కోరిక… సో వాట్..? ఇండియాకు వచ్చి చూసి వెళ్తున్నట్టే రష్యాకు కూడా వెళ్లి రావచ్చు కదా…  ఆమె చెప్పేది కూడా అలాగే ఉంది… దొందూ దొందే… ఎవరి వెర్షనూ ఫెయిర్‌గా లేదు…

కర్నాటకలోని ఉత్తర కన్నడ, రామతీర్థ అడవిలో ఇటీవల కొండచరియ విరిగిపడటంతో రొటీన్‌ గస్తీలో భాగంగా పోలీసులు ఈ నెల 11న గుహ వద్దకు వెళ్లారు… అక్కడ చీరలు, ఇతర బట్టలను గమనించారు… వెంటనే మరింత ముందుకు వెళ్లి చూసేసరికి నీనా, ఆమె ఇద్దరు కుమార్తెలు గుహలో కనిపించారు…

ఆమెను ప్రశ్నించినపుడు తన పాస్‌పోర్టు, వీసా పోయాయని చెప్పిందట… కానీ వాటిని గుహ సమీపంలోనే పోలీసులు గుర్తించారు… ఆమె బిజినెస్‌ వీసాపై 2016లో భారత్‌కు వచ్చినట్లు వెల్లడైంది… ఆమె వీసా గడువు 2017 ఏప్రిల్‌ 17న ముగిసింది…

గోవా, గోకర్ణలలో ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడిన తర్వాత తిరిగి రష్యాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని చెప్పింది… సరే, ఇక్కడే ఉండి ఆధ్యాత్మక జీవనం గడపాలని అనుకుంటే వోకే… కానీ పిల్లలతో గుహలో బతకడం ఏమిటి..? హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు వెళ్తే అధికారులు గుర్తిస్తారనే భయంతో, గుహలు, మారుమూల ప్రాంతాలు, అడవుల్లో గడుపుతున్నట్టు ఓ కథ చెబుతోంది…

అవునూ, గుహలో ఎలా బతికేది… చలి నుంచి ఆ పిల్లలకు రక్షణ.,.? జంతువులు, పాములు… అబ్బే, అవేమీ చేయవు అంటోంది… కానీ తిండి..? లోకల్స్ సాయం అంటోంది… మరి వాళ్లు ఈ అనుమానాస్పద తల్లీపిల్లల గురించి పోలీసులకు చెప్పలేదా..? కేవలం అనుకోకుండా కొండచరియలు విరిగిపడితే పోలీసులు పెట్రోలింగుకు వెళ్లారా..? అడవుల్లో కొండచరియలు విరిగిపడితే కూడా పోలీసులు పెట్రోలింగుకు వెళ్తారా..?  అన్నీ అనుమానాస్పద వెర్షన్లే…

ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటివి తిని బతికేవాళ్లమని చెబుతున్నదట… ఎక్కడ కొనుక్కొచ్చేది వాటిని..? బేసిక్ యుటెన్సిల్స్ కావాలి కదా, అవి ఉన్నాయా, కనిపించాయా గుహలో… పోలీసులు అదీ చెప్పరు… అసలు భర్త పంపించిన డబ్బు ఎలా అందుతోంది ఆమెకు..? అవసరమైన సరుకుల్ని కొనుక్కోవడానికి సమీపంలోని ఆవాసాలకు వెళ్లినా ఎవరో గుర్తించి పోలీసులకో, అధికారులకో చెబుతారు కదా… మరి ఆ అవకాశం ఉన్నప్పుడు గుహలో దాక్కుని జీవనం దేనికి..?

గుహలో ఏమీ ఉండవు, ప్లాస్టిక్ షీట్ల మీద పడుకునేవాళ్లట… రెండుమూడు నెలలకు సరిపడా సరుకుల్ని ఒకేసారి తెచ్చుకుని స్టోర్ చేసుకునేవాళ్లమని మరో వెర్షన్… అదీ డౌట్ ఫుల్లే… అడవుల్లో జంతువుల్లాగే పిల్లల్ని పెంచడం అంటేనే ఆమె మనస్థితిలో తేడా ఉన్నట్టు గమనించాలి… హిందూై దేవుళ్ల ఫోటోలు పెట్టుకుని పూజించేదట…

అన్నీ బాగున్నప్పుడు గోవాలో గుహలో బిడ్డకు జన్మనిచ్చే సిట్యుయేషన్ ఎందుకొచ్చింది..? అక్కడా అడవిలో జంతువులాగే ప్రసవించి, అక్కడ కొన్నాళ్లుండి, గోకర్ణం వచ్చిందా..? గోకర్ణంలో ప్రత్యేకత ఏముందని వచ్చింది..? ఆధ్యాత్మిక ఏకాంతం అంటే గుహలో బతుకుతూ, జనానికి దూరంగా పూజలు చేసుకుంటూ బతకడమా..? ఖచ్చితంగా ఆమె ఏదో దాస్తోంది..? లేదా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు…

రెండు నెలలుగా గోకర్ణం గుహలో ఉంటున్నట్టు చెబుతోంది, మరి అంతకుముందు..? గోెవాను చాన్నాళ్ల క్రితమే వదిలేసిందని భర్త చెబుతున్నాడు… ప్రస్తుతం ఆమెను, ఇద్దరు బిడ్డలను డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు… వీసా గడువు ఏనాడో కాలం చెల్లింది కాబట్టి రష్యాకు డిపోర్ట్ చేస్తారు… ఆ ప్రయాణ ఖర్చులు కేంద్రం భరించకపోతే ఇక ఆ నిర్బంధ కేంద్రంలోనే ఆమె బతుకు…

నిజానికి ఆమెకు కావల్సింది చికిత్స… మానసిక చికిత్స… ఉంచాల్సింది డిటెన్షన్ సెంటర్‌లో కాదు… మెంటల్ హాస్పిటల్‌లో… ఆ భర్త చెబుతున్నదీ నమ్మశక్యంగా లేదు, తను పోలీసులకు కూడా అందుబాటులో ఉన్నట్టు లేదు… మొత్తానికి ఈ కథలన్నీ అనుమానాస్పదాలే… తనను ప్రశ్నిస్తేనే అసలు కథలు బయటపడతాయి… ఆ వైపు పోలీసులు ఎందుకు ఆలోచించడం లేదు..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
  • మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
  • ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!
  • అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
  • చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
  • నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!
  • మోడీ, పాడి రైతు పొట్టగొట్టకు… ఆ ట్రంపుడు అలా బెదిరిస్తాడు, బెదరకు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions