Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఛావా, పుష్ప2 బలాదూర్… ‘ధురంధర్’ అన్ని రికార్డులూ పగలగొడుతున్నాడు…

December 20, 2025 by M S R

.

ఛావా, పుష్ప… ఏ ఇతర బ్లాక్ బ్లస్టర్ అయినా సరే… ఆ రికార్డులన్నీ పగిలిపోతున్నాయి… ఇప్పటికే 750 కోట్ల వసూళ్లు… రెండు వారాలు గడిచినా సరే రోజుకు 23- 24 కోట్ల వసూళ్లు…

  • ఇదేమీ పాన్ ఇండియా సినిమా కాదు… కేవలం హిందీ వెర్షన్… ఇక తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసి ఉంటే..? ఇప్పటికే ఈజీగా 1000 కోట్లు దాటి ఉండేది… అవును, నేను చెబుతున్నది దురంధర్ సినిమా గురించే…

మిత్రుడు  డా. మహ్మద్ రఫీ విశ్లేషణలోకి వెళ్దాం పదండి ఓసారి….

Ads



దుమ్మురేపిన దురంధర్…. రణవీర్ కన్నా ముందు అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడుకోవాలి! ఛావాలో ఔరంగజేబు పాత్రలో ఒదిగితే, ధురంధర్ లో రెహమాన్ బలోచి గా జీవించాడు! ఒక్కసారి ఎంక్వయిరీ చేయాలి ఇప్పుడు ఈ సినిమా తరువాత ఎలా వున్నాడో అక్షయ్ అని!

రణవీర్ ఒకవైపు, సంజయ్ దత్ ఒకవైపు తుక్కు రేగ్గొట్టారు! అసలే ఆ మొహం 36 వంకర్లు స్టైలిష్ గా తిప్పిన అక్షయ్ ఖన్నా ఎర్రటి రక్తపు రంగులోకి మారిపోయాడు! ఎన్ని బుల్లెట్లు దింపారో ఆ బక్కటి ప్రాణంపైకి! అంతా షూటింగ్ మాయ అని తెలిసినా అక్షయ్ యాక్షన్ చూస్తే నిజ్జంగా కొట్టారేమో అనిపించేలా నటించాడు! అసలు పాకిస్తాన్ లో రెహమాన్ బలోచి గ్యాంగ్ వుందో లేదో కానీ, ఉండే ఉంటాడనిపించాడు అక్షయ్ ఖన్నా!

dhurandhar

అలనాటి రొమాంటిక్ హీరో వినోద్ ఖన్నాకు ఇద్దరు కొడుకులు. ఒకరు అక్షయ్ ఖన్నా, ఇంకొకరు రాహుల్ ఖన్నా! ఇద్దరూ హీరోలుగా వచ్చారు కానీ సక్సెస్ కాలేకపోయారు! అక్షయ్ ఖన్నా ఇన్నాళ్లకు సూపర్ స్టైలిష్ విలన్ అయి సూపర్ హిట్లు ఇస్తున్నాడు.

అక్షయ్ హీరో గా తాల్ సినిమా సూపర్ హిట్ అయినా అది ఐశ్వర్యరాయ్ మహిమ అన్నారు. కానీ, ఇప్పుడు విలన్ గా యాక్షన్ పరంగా చంపేస్తున్నాడు. పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాడు. ధురంధర్ సినిమా చూసిన వారికి ముందు అక్షయ్ ఖన్నా నచ్చేస్తాడు! అతడి గురించే మాట్లాడుకుంటారు!

  • దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభ అదుర్స్! దర్శకులు కావాలనుకునే వారు, సినిమాల పట్ల ఆసక్తి వున్న వారు ధురంధర్ చూసి తీరాల్సిందే! ఒక జరిగిన కథ నవలగా రాసి దృశ్య కావ్యం చేసినట్లు అనిపించింది. ఇందులో ఎనిమిది చాప్టర్స్… ది ప్రైస్ ఆఫ్ పీస్, స్ట్రెంజర్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ షాడోస్, ది బాస్టర్డ్ కింగ్ ఆఫ్ లియారీ, బుల్లెట్స్ అండ్ రోజెస్, ది జిన్, ది డెవిల్స్ గార్డియన్, ది బటర్ ఫ్లై ఎఫెక్ట్, ఎట్ టు బ్రూటస్!

ఇలా చాప్టర్లు చెప్పి మరీ తీశాడు! శశ్వత్ సచ్ దేవ్ కొట్టిన బిజిఎం వెంటాడుతూనే ఉంటుంది. సినిమా కథకు సరిగ్గా సరిపోయింది! వికాస్ సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది. నిజంగా పాకిస్తాన్ లో ఇంత ఘోరంగా గ్యాంగ్స్ ఉన్నాయో లేదో కానీ, ఉన్నాయని నమ్మించేలా తీశారు. అందుకే ఈ సినిమాను తెగ మెచ్చుకుంటున్నారు! కొందరు కుట్రగా భావించి విమర్శిస్తున్నారు.

ఇలాంటి సినిమాలకు సెన్సార్ ఎలా ఇస్తారో ఇప్పటికీ అర్ధం కాలేదని నా పక్కన కూర్చున్న ఓ పెద్దాయన పెదవి విరిచాడు. ఎందుకంటే అమ్మనా బూతులకు సెన్సార్ లేదు. క్రిమినల్స్ గ్యాంగ్ భాష అది! మూడు గంటల 20 నిముషాల సినిమా… చూడటానికి ఎంత ఓపిక ఉండాలి! కానీ, దర్శకుడు ఆదిత్య కూర్చోబెట్టాడు ఆసక్తికరంగా! ఇది స్పై సస్పెన్స్ క్రైం యాక్షన్ థ్రిల్లర్ జోనర్ మూవీ. గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినా ఇది పూర్తిగా డిఫరెంట్!

మన దేశంలో జరిగిన నాలుగైదు ఉగ్రవాద దాడులు, 1999లో జరిగిన ఫ్లైట్ హైజాక్, 2001లో పార్లమెంట్ పై దాడి, 2008లో జరిగిన ముంబయి దాడులు, అజిత్ దోవల్ రా అధికారిగా పాక్ పై ఎక్కుపెట్టిన సీక్రెట్ ఏజెంట్ సంఘటనలను కథలుగా అల్లి పార్ట్ వన్ తీసి వదిలాడు ఆదిత్య! అజిత్ పాత్రలో మాధవన్ అచ్చం అలాగే కనిపించాడు!

కాందహార్ జైలులో వున్న ఖైదీలను సీక్రెట్ ఎజెంట్లుగా మార్చి పాక్ ఉగ్రవాద గ్యాంగ్స్ లో చేర్చి అక్కడి సీక్రెట్స్ తెలుసుకోవడం, ఒక్కొక్క గ్యాంగ్ స్టర్ ను వరసగా హతమార్చడం, అక్కడి లోకల్ గ్యాంగ్ వార్… ఇదే స్టాల్ వార్ట్ ధురంధర్! అద్దిరిపోయే కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది మూడు వారాలు అయినా! చాలా సినిమాలను ఉఫ్ మని ఊదేసింది! హౌస్ ఫుల్ కలెక్షన్లతో రఫ్ఫాడుతోంది.

కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడుస్తాయి. కొన్ని హింసాత్మక సన్నివేశాలు నేనే చూడలేక కళ్ళు మూసుకున్నాను. ఉగ్రవాద స్థావరాలు, గన్స్ తయారీ, దొంగనోట్లు తయారు చేసి వదిలే మాఫియా… అన్నిటికి రాజకీయం కలబోసి తీసిన ధురంధర్ చూడాల్సిన సినిమా!

పాటలు బావున్నాయి. రీమేక్ సాంగ్స్ బావున్నాయి. దమ్మరొదమ్, రంబాహో లాంటి పాటలు డైరెక్ట్ గా మళ్ళీ ఉపయోగించి కొత్త జోష్ ఇచ్చాడు! రణవీర్ యాక్షన్ ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆ పాత్రలో ఒదిగిపోయాడు! అలాగే చూడాలనిపించే అద్భుతమైన యాక్షన్! దిమ్మ తిరిగే ఫైట్స్! మధ్యలో లవ్ ట్రాక్! సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఎస్సెట్!

నాకు దర్శకుడు ఆదిత్య నచ్చేసాడు! ఉరి, సర్జికల్ స్ట్రైక్స్ తీసిన ఆదిత్య ఒక్కసారిగా ఇంత పెద్ద సినిమాతో బాలీవుడ్ ను ఆడుకున్నాడు. ధురంధర్ పార్ట్ 2 విడుదల తేదీ మార్చి 24 అని ప్రకటించేసాడు...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఛావా, పుష్ప2 బలాదూర్… ‘ధురంధర్’ అన్ని రికార్డులూ పగలగొడుతున్నాడు…
  • Bhavana… ఈ కుళ్లు వ్యవస్థతో పోరాడుతున్నఓ రియల్ స్టార్…
  • మాయాబజార్… మరికొన్ని చెప్పుకునే సంగతులిలా మిగిలిపోయాయ్…
  • పల్లెపై బీసీ బావుటా..! తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న విశేష మార్పు..!!
  • రేవంత్ ఆరోపణకు నో కౌంటర్..! ఎన్డీయేలోకి బీఆర్ఎస్..? సంకేతాలన్నీఅవే..!!
  • * మి లార్డ్… దయచేసి మా కొడుక్కి కారుణ్య మరణాన్ని ప్రసాదించండి… *
  • ఒరిజినల్ ఎడిటర్ కిడ్నాప్… ఆ ప్లేసులోకి ఓ ఫేక్ ఎడిటర్… తర్వాత..?!
  • మరో మెగా ఈవెంట్ చేస్తారు సరే… మరి తెగిన పాత పతంగుల మాటేంటి..?
  • వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • గ్రేట్… కథాకాకరకాయ జానేదేవ్… అదే విజువల్ వండర్… ఇది మరో లోకం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions