Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాగరసంగమం పెను తుపానులో ఆ చిరంజీవి సినిమా గల్లంతు…!!

May 6, 2025 by M S R

.

ఎప్పుడో 1983 నాటి మాట… అప్పటికి ఈ ఫ్యానిజం మన్నూమశానం తెలియదు… కాకపోతే చిరంజీవి అంటే అభిమానం… వీపుకి బద్దలు కట్టుకుని, విగ్గులు పెట్టుకుని, మెడ చుట్టూ మఫ్లర్లు కట్టుకుని, ముసలితనంలోనూ హీరోయిన్ల మీద చరుపులతో, పిచ్చి స్టెప్పులతో వెగటు హీరోయిజం కనిపిస్తున్న కాలం అది…

చిరంజీవి దూసుకొచ్చాడు… ఈజ్… జనానికి బాగా పట్టింది… ప్రత్యేకించి ఖైదీ తరువాత చిరంజీవి యూత్ హీరో అయిపోయాడు… అటు కమలహాసన్ సరేసరి… అప్పటికే సౌత్ ఇండియా పాపులర్ హీరో… తన సినిమా సాగరసంగమం రిలీజైంది… ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆ పక్క థియేటర్‌లోనే శివుడు శివుడు శివుడు అనే సినిమా రిలీజైంది…

Ads

చిరంజీవి అంటే అభిమానం కదా… శివుడు శివుడు శివుడు సినిమాకు వెళ్లాను… నా పక్కనే ఒకాయన కూర్చున్నాడు… సినిమా చూస్తున్నంతసేపూ విసుక్కుంటున్నాడు… నాలుగైదుసార్లు బయటికి వెళ్లొచ్చాడు… ఇంటర్వెల్‌లో అడిగాను…

ఏం బ్రదర్, సినిమా బాగాలేదా..?

ఏం..? నీకు బాగుందా..?

పర్లేదు, చిరంజీవి డాన్సులు బాగా చేస్తున్నాడు కదా… నాకు నచ్చింది… నేను చిరంజీవి అభిమానిని…

నేను అందరికన్నా చిరంజీవికి అతి పెద్ద ఫ్యాన్… నాకే చిరాకెత్తుతోంది… మామూలు ప్రేక్షకుల మాటేమిటి..?

అభిమానిని అంటున్నావు, సినిమా బాగాలేదు అంటున్నావు, అర్థం కావడం లేదు…

అభిమానం వేరు, సినిమా బాగాలేకపోతే చూడాల్సిన ఖర్మ నాకేమిటి..? బుక్కయిపోయాను… ఇది మ్యాట్నీ, సాగరసంగమం మార్నింగ్ షో చూసొచ్చాను… సినిమా అంటే అదీ… నువ్వు చూశావా అది..?

ఇంకా చూడలేదు, చూడాలి వచ్చేవారం…

శివుడు శివుడు శివుడు ఫ్లాప్ గ్యారంటీ… ఓ అభిమానిగా చెబుతున్నా… చెత్త… సాగరసంగమంతో పోలిస్తే అది దేనికీ పనికిరాదు… చిరంజీవి రాంగ్ స్టెప్… ఈ సినిమా విడుదల రాంగ్ టైమింగ్…

ఎందుకలా..? అర్థం కాలేదు…

బ్రదర్, మీరెవరో నాకు తెలియదు, అయినా చెబుతున్నాను విను… అక్కడ కమలహాసన్, శాస్త్రీయ నృత్యం మీద ఫుల్ అవగాహన, పైగా విశ్వనాథ్ డైరెక్షన్… సినిమా అంతా ఫుల్ ఎమోషన్స్, డాన్స్ అంటే అదీ…

అవును, ఇక్కడా చిరంజీవి డాన్స్ ఉందిగా…

అదే తేడా… చిరంజీవి ట్రెయిన్డ్ డాన్సర్ కాదు, కృతకం… మామూలు స్టెప్పులు వోకే, లేదంటే చిన్న చిన్న బిట్స్ శుభలేఖలో మాదిరిగా చేయించుకోవాలి, అదీ విశ్వనాథ్ చేయించుకున్నదే… కానీ సాగరసంగమం ఫుల్ లెన్త్ డాన్స్ మూవీ… స్టెప్పుల మూవీ కాదు…

ప్రేక్షకులు అంత తేడా చూస్తారంటారా..? మన స్టార్ హీరోలందరూ పిచ్చి స్టెప్పుల స్టార్లే కదా… ఎవడు చూడొచ్చాడు…?

చూస్తాడు… సాగరసంగమం చూశాక ఖచ్చితంగా పోల్చుకుంటాడు… అక్కడ జయప్రద, అల్టిమేట్ డాన్సర్, అందగత్తె, వితవుట్ మేకప్ కూడా ఎంత అందంగా ఉందో… ఇక్కడ రాధిక… ఇక్కడ డబ్బా రేకుల చక్రవర్తి, అక్కడ ఇళయరాజా… అర్థమైంది కదా…

హీరోయిన్లందరూ అందంగానే ఉంటారు కదా బ్రదర్…

కాదు, అందంగా చూపించబడతారు… ఏదో రాజరికం కథ… వాడెవడో గ్రాంథికం మాట్లాడుతున్నాడు, చీప్‌గా లేదూ… చిరంజీవి ఫ్యాన్‌గా ఈ నాసిరకం సినిమాను ఊహించలేదు… వాడు గేటు తీయడం లేదు, లేకపోతే పారిపోయేవాడినే…

అదేమిటి బ్రదర్, పాటలు బాగున్నయ్, తెర మీద చిరంజీవి రకరకాల షేడ్స్ చేస్తున్నాడు…

సాగరసంగమం రిలీజ్ సమయంలో గాకుండా దీన్ని వేరే టైములో రిలీజ్ చేస్తే ఏమైనా చూసేవాళ్లేమో, ఏమో బ్రదర్, నాకు నచ్చలేదు, అదుగో గేటు తీస్తున్నారు, నేను జంప్… నీకు నచ్చితే మిగిలిన సినిమాను ఎంజాయ్ చేయి… నాకు ఓపిక లేదు… రేపు సాగరసంగమం మళ్లీ మార్నింగ్ షో వెళ్తున్నాను…  (ఇది నిజంగా జరిగిన సంభాషణే… తను చెప్పినట్టే జనం ఆ చిరంజీవి సినిమాను అడ్డంగా తిరస్కరించారు…)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజా సాబ్‌కు మరో అప్రతిష్ట… నాచే నాచే ట్యూన్ పక్కా చోరీ అట..!!
  • నాటో భవిష్యత్తు అటో ఇటో..! ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులు..!!
  • సంక్రాంతి కంబాలా పోటీలో మరో హీరో ‘మునిగిపోయాడు’… సెకండ్ వికెట్..!!
  • ఎనర్జీ డిప్లొమసీ..! ఇండియా మౌనం వెనుక ‘చమురు వ్యూహాలు’..!!
  • కొన్ని సినిమా ప్రయోగాల్ని రామోజీరావే చేయగలిగాడు… కానీ..?
  • అస్తవ్యస్తత..! సినిమాలపై తెలంగాణ ప్రభుత్వ విధానరాహిత్యం..!!
  • ఇక్కడ అత్యంత భారీ విగ్రహం… అక్కడ ఓ జ్ఞాపకం తెగనమ్మకం…
  • బెంగాల్ ‘శివగామి’ స్ట్రీట్ ఫైట్… ఆ ఆకుపచ్చ ఫైలులో అసలు మర్మమేంటి..!?
  • రానున్న 48 గంటలు అత్యంత కీలకం – మధ్యప్రాచ్యం మండిపోతోంది
  • టాక్సిస్ పారడాక్స్..! ఓ అశ్లీల వ్యతిరేకి దాన్నే ఆశ్రయించడం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions