Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలీవుడ్ పొగరు vs దక్షిణాది ప్రతిభ … సాయిపల్లవిపై వివక్ష వ్యాఖ్యలు

July 20, 2026 by M S R

.

బాలీవుడ్ పొగరు vs దక్షిణాది ప్రతిభ — ‘సీత’ ఎంపికపై అన్నూ కపూర్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రంగు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గతంలోకన్నా ఇప్పుడు “ప్రాంతీయత” అనే సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ వంటి పలు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ నటుల సత్తాను చాటిచెప్పాయి. సౌత్ మీద నార్త్ వివక్షను బ్రేక్ చేస్తూ, సౌత్ డామినేట్ చేస్తోంది…

Ads

సినిమాలే కాదు, నటులు కూడా… కమలహాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ సహా చాలామంది నటీనటులు జాతీయ స్థాయి ఉత్తమ నట అవార్డులు పొందారు, పొందుతున్నారు కూడా..! రేఖ, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి వంటి ఎందరో తారలు హిందీ ఇండస్ట్రీని ఏలారు… రష్మిక వంటి తాజా తారలు కూడా..!

ఐనా సరే, అన్నూకపూర్ వంటి నటులు మాత్రం ఇంకా మారడం లేదు… అహం, వివక్ష… ఇదోరకం జాతి వివక్ష! తను తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి దీన్నే… నిజానికి ఈయన ఎప్పుడూ ఏవో పిచ్చి వ్యాఖ్యలతో వివాదాల్లోకి వస్తుంటాడు… ఈసారి సాయిపల్లవి టార్గెట్…

‘ఈమె సీతా..? రామాయణం వంటి పవిత్ర ఇతిహాసాన్ని తెరకెక్కించేటప్పుడు నటీనటుల ఎంపిక చాలా ముఖ్యం… భారతీయులు సీతామాతను తల్లిగా, శ్రీరాముడిని దైవస్వరూపుడిగా భావిస్తారు… ఈమె ఎలాంటి సీత?” అంటూ సాయి పల్లవి ఎంపికపై నోరు పారేసుకున్నాడు… (ఆమె సీతగా ఎందుకు కనిపించడం లేదు తనకు?)

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలుసు కదా… అలాగే దర్శకుడు నితేష్ తివారీ గురించి తనకు పెద్దగా తెలియదని, తాను సినిమాలు ఎక్కువగా చూడనని కూడా వ్యాఖ్యానించాడు…

భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో రెండు భాగాలుగా రూపొందుతున్న ‘రామాయణం’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి… నిజానికి  తన వ్యాఖ్యలు కేవలం ఒక నటిపై చేసిన వ్యాఖ్యలు కావు; ఇది బాలీవుడ్‌లో దశాబ్దాలుగా పాతుకుపోయిన ‘సౌత్ నటులపై చిన్నచూపు’కు నిదర్శనం…

“నితేష్ తివారీ ఎవరో నాకు తెలియదు” అనడం అంటే అది మూర్ఖత్వమే… కావాలని నెగెటివ్ వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఉద్దేశమేమో బహుశా… సాయి పల్లవి నటన, ఆమె ఎంచుకునే వైవిధ్యమైన పాత్రలు, ఆమెకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం సౌత్ నటి అన్న కారణంతోనే ఆమెను ప్రశ్నించడం, బాలీవుడ్ మేధావుల సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది…

సినిమా అంటే భావోద్వేగాల కలయిక. నటులకు భాష, ప్రాంతం కంటే పాత్రలోని లోతు ముఖ్యం… ప్రాంతీయ అహంకారాలను పక్కన పెట్టి, కళను కళలా చూసే రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions