.
ఏమాటకామాట… నోటి దూలతో నెటిజనం తిట్లు తింటూ, బోలెడంత నెగెటివిటీని మూటగట్టుకుంటున్నా సరే… సాయిపల్లవికి శుక్రమహర్దశ నడుస్తున్నట్టుంది… రామాయణం రెండు పార్టులు సరే… మణిరత్నం సినిమాలో పాత్ర ఆమెకు ఓ వరం…
జస్ట్, మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేశాడు మణిరత్నం… ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తానన్నాడుట, అయిదే నెలల్లో రిలీజు చేయబోతున్నాడు… జూలై నెలాఖరున చిత్రీకరణ ఆరంభించి, అక్టోబరు నెలాఖరుకల్లా… చిత్రాన్ని ముగించడం విశేషం… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Ads
కలకత్తా, చెన్నైలలో షూటింగ్… సినిమా పేరు ఇంజి వెల్లం… అంటే, అల్లం బెల్లం… ఇద్దరు ప్రేమికుల తత్వాలు కూడా అల్లం బెల్లం టైపులో భిన్నం అన్నమాట… ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా బాగుంది… రెయిన్లో విజయ్ సేతుపతి, సాయిపల్లవి…
వర్షం, ఎ.ఆర్. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సహజసిద్ధమైన లొకేషన్ బ్యాక్‌డ్రాప్… మణిరత్నం పూర్వపు క్లాసిక్స్ ‘రోజా’, ‘సఖి’, ‘బాంబే’ చిత్రాల ఫీల్‌ను గుర్తుచేసేలా రూపుదిద్దుకుంది…

కలకత్తా నేపథ్యంలో సాగే మణిరత్నం మార్క్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు… ప్రేమమ్ తరువాత సాయిపల్లవికి ఇది మరో మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ కావచ్చు బహుశా… 83 తరువాత విజయ్ సేతుపతికి… ఈ ఇద్దరూ మంచి పర్ఫార్మర్సే కదా… పైగా మణిరత్నం దర్శకత్వం… మంచి కాంబో, అందుకే దీనిపై ఆసక్తి పెరుగుతోంది…
అంతేకాదు… ఏఆర్ రెహమాన్ సంగీతం… మణిరత్నంతో తన కాంబో గురించి చెప్పేదేముంది..? లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ వారి సినిమా కదా, నిర్మాణ విలువలకు ఢోకా లేదు… మౌనరాగం, సఖి, ఓకే బంగారం తరువాత మణిరత్నం మార్క్ లవ్ స్టోరీ రాలేదు…
ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ మూడ్ ఆధారంగా ఈ సినిమా కథ గురించి తెలుస్తున్న విషయాలు… భిన్న ధృవాలు ఆకర్షించబడతాయి కదా… అలాగే రెండు భిన్నమైన వ్యక్తుత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య ఏర్పడే గాఢమైన ప్రేమ, అనుబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది…
అల్లంలో ఉండే ఘాటు, బెల్లంలో ఉండే తీపి ఎంత భిన్నమైనవో… కథలోని హీరో, హీరోయిన్ పాత్రల స్వభావాలు కూడా అంతే భిన్నంగా ఉంటాయని, కానీ వారద్దరూ కలిసినప్పుడు ఏర్పడే ఒక క్యూట్ లవ్ స్టోరీయే ఈ చిత్రం అని టైటిల్ సూచిస్తోంది… కేవలం సరదా ప్రేమకథ మాత్రమే కాకుండా, మణిరత్నం శైలికి తగ్గట్టుగా వారి జీవితాల్లోకి వచ్చే సంఘర్షణలు, సంక్లిష్ట భావోద్వేగాల చుట్టూ కథ నడుస్తుంది…

సాయి పల్లవి ‘నిత్యా రెడ్డి IPS’ (Nithya Reddy IPS) అనే శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా పేరు “ఓం – చాప్టర్ 1: ఉధిరమ్” (OM – Chapter 1: Udhiram)… ఇందులో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు… (‘అమరన్’ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం…)
అంతేకాదు, ఈ సినిమాలో మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు… ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రచందనం (Red Wood) స్మగ్లింగ్ నేపథ్యంలో, అటవీ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా ‘ఆపరేషన్ ఓం’ (OM) చుట్టూ ఈ కథ సాగుతుంది…
ఎర్ర చందనం స్మగ్లర్లకు బలైన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ సాయిపల్లవి తండ్రి… తరువాత ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఐపీఎస్ అధికారిణి సాయిపల్లవి చేపట్టే ఆపరేషన్ ఈ సినిమా కథ… కాకపోతే ఆ ఫస్ట్ లుక్ డ్రెసులో ఆమెకు ఓ విజిల్ ఎందుకు పెట్టారో దర్శకుడే చెప్పాలి…
చివరగా... ఒకటి తగ్గింది పుష్పా అని రాజీపడే పుష్ప మార్క్ షెకావత్ పాత్ర కాదు... స్మగ్లర్లను వేటాడే పాత్ర...
Share this Article