.
ఐపీఎల్ మాత్రమే కాదు, క్రికెట్ ఏ ఫార్మాట్‌లోనైనా సరే… హిట్ వికెట్ అసాధారణం ఏమీ కాదు, పైగా ఐపీఎల్ ప్రస్తుతం దంచితేనే గెలుపు అనే ధోరణిలో సాగుతున్నప్పుడు… 200 ప్లస్ రన్స్ కూడా పెద్ద టార్గెట్లు గాకుండా చిన్నబోతున్నప్పుడు… బ్యాటర్లు తెగించి అసాధారణమైన షాట్లకు వెళ్తున్నప్పుడు… హిట్ వికెట్ పెద్ద విస్మయకరం కూడా ఏమీ కాదు…
నిన్నటి కీలకమైన బెంగుళూరు- గుజరాత్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు… షాట్ కొట్టాక, ఆ కొట్టిన వేగం, ఊపుతో బ్యాట్ కూడా చేతుల నుంచి వెనక్కి జారిపోయి, స్టంప్స్‌ను తగిలింది, బెయిల్స్ కింద పడ్డాయి… ఐపీఎల్‌లో రెండుసార్లు హిట్ వికెట్‌గా ఔటైంది సాయి సుదర్శనే… మంచి ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ ఔటయ్యాక మరి మిగతావాళ్లు..?
Ads
ఏమాత్రం నిలబడలేకపోయారు… టపటపా వికెట్లు పడిపోయాయి… రాహుల్ తెవాతియా 68 రన్స్ చేశాడు కాబట్టి 162 రన్స్ స్కోర్ చేయగలిగారు, ఒక దశలో వంద లోపే ప్యాకప్ అనే సిట్యుయేషన్… మొత్తానికి 92 రన్స్ భారీ తేడాతో ఓడిపోయి గుజరాత్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది… ఒకవైపు బెంగుళూరుకు 254 పరుగులు (కెప్టెన్ పటీదార్ 93) ఇచ్చారు గుజరాత్ బౌలర్లు… మరోవైపు ఏమాత్రం కనీస పోటీ ఇవ్వకుండా 162 పరుగులకే బెంగుళూరు బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేశారు…
ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డర్ల ప్లేస్‌మెంట్, బౌలర్ల స్పెల్స్ మార్పులు… వేటిలోనూ గుజరాత్ సరైన పోటీతత్వాన్ని ప్రదర్శించలేదు… ఈ జట్టేనా వరుస విజయాలతో ఇక్కడిదాకా వచ్చింది అనిపించింది… సరే, దీంతోనే గుజరాత్ ఇంటికి వెళ్లిపోదు… తనకు మరో చాన్స్ ఉంది… రాజస్థాన్, హైదరాబాద్ జట్ల నడుమ ఈరోజు జరిగే మ్యాచులో ఎవరైతే గెలుస్తారో, వాళ్లతో గుజరాత్ ఆడాల్సి ఉంటుంది… ఇక అందులో తేల్చుకోవాల్సిందే…
ఒకవైపు ఈసారి గుజరాత్ విజేత కావడం తథ్యం, అందుకే ఫైనల్ పోటీని అహ్మదాబాద్‌కు మార్చారు అనేే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… మరీ గుజరాత్ ఇంత పేలవంగా ఆడటం మాత్రం ఆ జట్టు ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది..!!
Share this Article