సాయిపల్లవి… మంచి నటి… నటనలో మెరిట్‌కన్నా తన ప్రవర్తనలో మెచ్చదగిన నటి… ఆ చర్చలోకి ఇక్కడ వెళ్లాల్సిన పనిలేదు గానీ… అది ఒడవని ముచ్చట గానీ… చాన్నాళ్లుగా వార్తల్లో లేదు… అయిపోయింది, గార్గి, విరాటపర్వం ఫెయిల్యూర్ల దెబ్బకు ఇక ఆమెకు చాన్సులు లేవు, ఎక్స్‌పోజ్ చేయదు, ఎదవ్వేషాలు వేయదు, అందులో ఏ నిర్మాతా పిలవడం లేదు, చేతిలో పనిలేదు, దాంతో ఇక తన డాక్టరీ పనితో ఓ పెద్ద హాస్పిటల్ కట్టాలని ప్లాన్ చేస్తుంది అనే వార్తలు కోకొల్లలు ఈమధ్య…
తప్పేముంది..? ఆమె వందలసార్లు చెప్పింది… ఈ ఫీల్డ్‌కు నేను పనికిరాకపోతే, నాకు ఈ ఫీల్డ్ సరిపడకపోతే డాక్టర్ ప్రాక్టీసు చేసుకుంటాను తప్ప నాకు కంఫర్ట్‌గా లేని వాతావరణాన్ని ఆమోదించలేను ఆస్వాదించలేను అని…! అందరూ అభిమానించారు, కాకపోతే మధ్యలో ఏవో వివాదాస్పద కామెంట్స్ చేసి ట్రోలింగ్ పాలైంది… ఆ చర్చ జోలికి కూడా ఇక్కడ పోవడం లేదు…
ఎస్, ఆమె మంచి నటి, పాత్రలో జీవిస్తుంది… తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది… నిజానికి ఆమెను ఫుల్లుగా ఎక్స్‌ప్లాయిట్ చేయగల మంచి చాలెంజింగ్ పాత్ర ఆమెకు దొరకలేదు… ఈ శ్యామ్‌సింగరాయ్‌లు, ఈ ఫిదాలు, ఈ గార్గిలు ఆమె ఉత్త జుజుబీ… విరాటపర్వం కూడా…!! ఆమెలోని నిజమైన నటిని తెరపై సంపూర్ణంగా ఆవిష్కరించే పాత్ర ఆమెకు దొరకలేదు… స్టామినాకు తగిన చాలెంజ్ అనేదీ అదృష్టమే…
Ads
ఇప్పుడు తాజా వార్తలు ఏమిటంటే… రణబీర్‌కపూర్ రాముడిగా, హృతిక్ రోషన్ రావణుడిగా చేసే ఓ భారీ రామాయణం ప్రాజెక్టులో ఆమె సీతగా నటించబోతోంది అని… కన్‌ఫరమ్ కాదట, నటించే అవకాశాలున్నాయట… గుడ్, నిజమే అయితే సూపర్… బాలీవుడ్, పైగా రణబీర్, హృతిక్‌లకు దీటైన పాత్ర… క్లిక్కయినా కాకపోయినా జాతీయ స్థాయిలో ఫేమ్, రీచ్… ఆమె అర్హురాలా కాదా అనేది మళ్లీ వేరే చర్చ… దాన్ని కూడా వదిలేస్తే ఇక్కడ కొన్ని సందేహాలు…
- పౌరాణిక కథలు ప్రజెంట్ ట్రెండ్… కానీ బాలీవుడ్ అర మెదళ్లకు వాటిని తీయడం చేతకాదు… ఆదిపురుష్ చూశాం కదా… అదొక దరిద్రం, చెప్పుకోవడం వేస్ట్… అదీ రామాయణ కథే… కానీ అంతటి ప్రభాసే తలపట్టుకున్నాడు… మరి సాయిపల్లవికి ఆఫర్ చేస్తున్న ఆ ప్రాజెక్టు ఎవరిదో, ఏం ఉద్దరిస్తారో తెలియదు…
- పౌరాణిక, ఫాంటసీ కథల్ని తెరకెక్కించాలంటే మన సౌతిండియన్లే చాంపియన్లు… ఆఫ్టరాల్ కార్తికేయ2 కూడా కోట్లకుకోట్లు కుమ్మేసింది… కానీ 400 కోట్ల దాకా ఖర్చు పెట్టామని గప్పాలు కొట్టిన బ్రహ్మాస్త్ర, 500 కోట్లు వసూలు చేసినట్టు ఫేక్ ఫిగర్స్ ప్రచారంలోకి తెచ్చిన బ్రహ్మాస్త్ర అట్టర్ ఫ్లాప్… రామసేతు కూడా అంతే… మరి సాయిపల్లవిని నటించబోయే సినిమా ఎవరిది..?
- ఎస్, రణబీర్‌కపూర్, హృతిక్ రోషన్‌కు దీటైన పాత్ర అంటే విశేషమే… కానీ అది జస్ట్, ఆలోచనల్లోనే ఉంది తప్ప, కనీసం ప్రిషూట్, ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా జరగడం లేదు, సో, అన్‌సర్టెయిన్…
- రణబీర్‌కపూర్ అనగానే సీత పాత్ర నేనే చేస్తానంటూ ఆలియాభట్ ముందుకొస్తుంది… ఆటోమేటిక్‌గా అప్పుడు సాయిపల్లవి తెర వెనక్కి వెళ్లిపోవాల్సిందే… ఆలియాకు బాలీవుడ్ సిండికేట్ సపోర్ట్ ఫుల్లు కదా… ఈ సాయిలు, ఈ పల్లవులు ఎవడిక్కావాలి..?
- ఏమాటకామాట… రామాయణ గాథ సినిమా తీస్తే అందులో సీత పాత్రకు నటనలో స్కోప్ ఏముంటుంది..? సాయిపల్లవే కావాలా దానికి..? ఏ పూజా హెగ్డే అయినా సరిపోతుంది కదా… ఐనా మనకెందుకులెండి…!!
Share this Article