Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొంపదీసి సీతమ్మ కిడ్నాప్ లోకకల్యాణం కోసమేనని చెబుతారా ఏం?!

October 29, 2026 by M S R

.

సాయిపల్లవి… ఖచ్చితంగా ఈమెకు నోటి దూల… ఏదో పద్దతి కలిగిన అమ్మాయి కదాని ఎవరైనా అభిమానిస్తే, ఆమెను సమర్థిస్తే వాళ్లు కూడా తలలు వంచుకునే పిచ్చి కూతలు, మూర్ఖపు పోకడలు కనిపిస్తున్నాయి… ఎందుకో ఓసారి చెప్పుకుందాం…

తనకు కలలో కూడా ఊహించలేనంత మంచి పాత్ర రామాయణం సినిమాలో దక్కింది… ఆ రెండు భాగాలు విజయవంతమైతే ఆమె బతుక్కి అవి చాలు… కానీ ఏం చేస్తోంది..? లాస్ ఏంజిల్స్‌లో జరిగిన స్పెషల్ ప్రీమియర్‌కు హాజరైన సాయిపల్లవి ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధితో చేసిన కామెంట్స్… ఏమిటంటే..?

Ads

  • ‘‘రావణుడు పూర్తి చెడ్డవాడు కాదు.., మనలోనూ ఒక రావణుడు ఉంటాడు… సందర్భానికి తగ్గట్టు బయటికి రావడం, మారిపోవడం జరుగుతూ ఉంటుంది… మనందరిలోనూ ఉన్న రావణుడిని (తప్పులు/ లోపాలను) గుర్తించి, కాలక్రమేణా ఆ లోపాలను సరిదిద్దుకుని మారడం చాలా ముఖ్యం”…

ramayan

ప్రతి మనిషిలోనూ నెగెటివ్ లక్షణాలు ఉంటాయి, వాటిని దిద్దుకోవడమే ముఖ్యం అని చెప్పాలనేది ఆమె ఉద్దేశం కావచ్చు… కానీ పిచ్చిది… మైండులో ఏదో తిరుగుతూ ఉంటుంది, బయటికి చెప్పేది ఎవరికీ సరిగ్గా అర్థం కాదు… అంటే సరిగ్గా కన్వే కాదు… ఒకటి) తెలిసీతెలియని భాషలో ధర్మాధర్మ మీమాంసకు దిగడం… రెండు) లోతైన విషయాలపై బహిరంగ వ్యాఖ్యాలు చేసే స్థాయి ఆమెకు లేదు, ఐనా సరే ఏదో ఓ పిచ్చి కూత…

ఎందుకు ఇది చెప్పాలంటే… గతంలో రెండు సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాల్ని రేకెత్తించాయి… చెప్పాలనుకున్నది సరైనదే కావచ్చుగాక, కానీ సున్నితమైన విషయాల్ని, తన అభిప్రాయాల్ని సరిగ్గా చెప్పలేనప్పుడు ఊరుకోవడం మేలు… కానీ తన అరకొర పాండిత్యం ప్రదర్శిస్తుంది, అదీ ఆమె వ్యాధిలక్షణం…

ramayan

ఆ పాత వివాదాల నేపథ్యంలోనే ఆమె మీద, సీత పాత్రకు ఆమె ఎంపిక మీద ఒక సెక్షన్ నెట్‌లో ఫుల్లు నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు… ఈ స్థితిలో నోరు మూసుకుని, సంయమనం పాటించొచ్చు కదా… అసలు ఆమె ఏదిపడితే అది మాట్లాడటానికి రామాయణ మేకర్స్ ఎందుకు అనుమతిస్తున్నారు..? రావణాసురుడి లక్షణాల్ని విశ్లేషించడానికి, పొగడటానికి లేదా తిట్టడానికి పెద్ద పెద్ద ప్రవచనకారులే తడబడుతుంటారు, జాగ్రత్తగా మాట్లాడతారు… మరి సాయిపల్లవికి ఎందుకు ఈ దూల..?

అసలే యశ్ పోషిస్తున్నాడు కాబట్టి రావణుడి పాత్రను రాముడికి దీటుగా పాజిటివ్‌గా, హీరోయిక్‌గా చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది… నటుడి ఇమేజ్‌కు తగినట్టు పౌరాణికాన్ని వక్రీకరిస్తే దాని ఫలితం సినిమా మీద చాలా నెగెటివ్‌గా ఉంటుంది… దీనికితోడు రావణుడు పూర్తి చెడ్డవాడు కాదు అని సాయిపల్లవి (రావణుడు ఎత్తుకుపోయిన సీత పాత్ర పోషించే నటి) వ్యాఖ్యానించడాన్ని సమాజం ఎలా స్వీకరించాలి..?

ram

ఏమో, చూడబోతే, రావణుడు సీతను ఎత్తుకురావడం వెనుక కూడా ఏదో ధార్మిక, మార్మిక, లోకకల్యాణ కారణం ఉందని సమర్థిస్తారేమో… సాయిపల్లవి మాటలు అలాగే ఉన్నాయి… ఐనాసరే, దర్శకుడో, స్క్రీన్ ప్లే రచయితో తమ కథలో రావణుడిని ఎలా చూపించారో చెబితే అర్థం చేసుకోవచ్చు… ఈమెకు ఎందుకు..? రామాయణ కథాకాలం నాటి పరిస్థితులను బట్టి రావణుడి ప్రవర్తనకు ఏమైనా కొత్త బాష్యాలు చెబితే హిందూ సమాజం మాత్రం అంగీకరించదు, ఆల్రెడీ నెగెటివ్ ప్రచారం జరుగుతోంది…

ఎందరో దర్శకులు రామాయణ కథను సినిమాలుగా తీశారు, రావణుడిని పూర్తి విలన్‌గా గాకుండా ధీరుడిగా, జ్ఞానిగా, శివభక్తుడిగా, సమర్థపాలకుడిగా చూపించారు… అదేసమయంలో సీతను ఎత్తుకురావడాన్ని ప్రతినాయక లక్షణంగా నెగెటివ్‌గానే చూపించారు… అలాంటప్పుడు రావణుడు పూర్తి చెడ్డవాడు కాదు అంటూ బహిరంగ వేదికల మీద, అదీ సినిమా రిలీజుకు ముందే ఓపెన్ వ్యాఖ్యానాలు పాస్ చేయడం మూర్ఖత్వమే…

రామాయణ్

సినిమా మేకర్స్ చెప్పేది చెప్పండి, తీర్పు ప్రేక్షకులకు వదిలేయండి… కల్కిలో కర్ణుడిని గొప్పగా చూపినా… ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి ఇద్దరు ప్రముఖుల చరిత్రను దిక్కుమాలిన రీతిలో చూపించినా… చాలా వివాదాలు వచ్చాయి… చర్చోపచర్చలు నడిచాయి… గతంలో ఎన్టీయార్ మహాభారతంలో విలన్లను కూడా హీరోలుగా చూపే ప్రయత్నం చేశాడు… ఆ వివాదాలూ ఉన్నాయి…

కానీ ఆల్రెడీ సాయిపల్లవి నెటిజనానికి టార్గెట్ ఇప్పుడు… అందులో ఇంకాస్త పెట్రోల్ పోసినట్టు మాట్లాడటం, మాటలు తూలడాన్ని నోటి దూల అంటారు… ఐనా పౌరాణిక పాత్రల తత్వాలను విశ్లేషించే స్థాయా..? బోలెడు డబ్బు పెట్టుబడి పెట్టి, కర్నాటక డిస్ట్రిబ్యూషన్ కూడా తనే తీసుకున్న యశ్ కూడా తన ప్రసంగాల్లో జాగ్రత్త పడుతున్నాడు… మరి ఈమెకు ఎందుకు ఈ తీట…!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొంపదీసి సీతమ్మ కిడ్నాప్ లోకకల్యాణం కోసమేనని చెబుతారా ఏం?!
  • అమెరికాలో ‘హ్యూమన్ కంపోస్టింగ్’… గుర్తొస్తున్న వీరశైవుల అంత్యక్రియలు!
  • టైమ్ లూప్‌లో చిక్కుకున్న కథనం… నవ్వించాలని నీరసపరిచే కామెడీ !
  • హాలోవీన్ కోలాహలం… అమెరికా మొత్తాన్ని ఆత్మలు ఆవహిస్తాయి!
  • గురువులు, విజ్ఞులు దయచేసి ఈ ధర్మసందేహాలు తీర్చగలరు…
  • సుమో దీదీ… అసాధారణ క్రీడాకారిణి కథకు శ్రియమ్ భగ్నానీ ప్రాణం!! 
  • నెహ్రూ కుటుంబానికి మళ్లీ మహర్దశ ! ప్రియాంక శకం ఆరంభం !!
  • ఓ జాతీయ సర్వే నిర్వహించి- ఆర్టిస్టులను ఎంపిక చేయాల్సిందేమో !!
  • KCR – సొంత బిడ్డనే కాదన్నాడు – ఈ ‘బిడ్డ’నూ గాలికి వదిలేశాడు !!
  • పులివెందుల కంచుకోట బద్ధలు – వై నాట్ సిరిసిల్ల? వై నాట్ సిద్దిపేట?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions