Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… సాయిపల్లవి వార్ మెమోరియల్ హఠాత్ సందర్శన ఇందుకా..?

October 28, 2024 by M S R

.

సినిమావాళ్లు ఏం చేసినా దాని వెనుక ఓ ప్లాన్ ఉంటుంది… ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది… అది సాయిపల్లవి ఐనా సరే… నిత్యా మేనన్ ఐనా సరే… మినహాయింపు కాదు…

ఆమె రాజధానిలోని నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించింది… ఉగ్రవాదుల ఏరివేతలో ప్రాణాలను పణంగా పెట్టి నేలకొరిగిన అశోకచక్ర మేజర్ ముకుంద వరదరాజన్‌కు,  సిపాయి విక్రమ్ సింగ్‌కు నివాళ్లు అర్పించింది… వాళ్లను తలుచుకుంటుంటే భావోద్వేగానికి గురవుతున్నానని ఇన్‌స్టాలో పోస్టు, ఫోటోలు పెట్టింది…

Ads

తనతోపాటు అమరన్ దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి కూడా ఉన్నాడు… ‘ప్రమోషన్లకు ముందే సందర్శించాలనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను’ అని చెప్పుకుంది ఆమె… ముకుంద వరదరాజన్ భార్య ఇందూ రెబెకా వర్గీస్‌ను కలిసినట్టు ఆమె గతంలో చెప్పుకుంది… షూటింగుకు ముందే వార్ మెమోరియల్ సందర్శించొచ్చు కదా, అంతగా నివాళ్లు అర్పించాలనుకుంటే… కానీ వెళ్లలేదు… ఇప్పుడు వెళ్లింది… ఎందుకు..?

ఎందుకంటే..? ఆమె అప్పట్లో విరాటపర్వం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు వైరల్ చేస్తున్నారు… ఆమెకు అసలు ఇండియన్ ఆర్మీ మీద అస్సలు సదభిప్రాయం లేదనే వార్తలు కనిపిస్తున్నాయి… ఒకవైపు ప్రమోషన్స్ చేసుకుంటుంటే ఈ వార్తలు, ఈ ప్రచారం సినిమాకు నెగెటివ్ అవుతుందనేది సినిమా నిర్మాతల ఆందోళన… (దీన్ని కమలహాసన్ నిర్మించాడు…)

సో, వెంటనే సాయిపల్లవికి ఇండియన్ ఆర్మీ మీద అమితమైన అభిమానం ఉందనీ, అపారమైన గౌరవం ఉందనీ చెప్పుకుని తాజా ప్రచారాల్ని కౌంటర్ చేయాలి… ఇదీ ఆ సినిమా అవసరం… అందుకని ఢిల్లీ వార్ మెమోరియల్ టూర్ ప్లాన్ చేశారు… వెంట దర్శకుడు కూడా ఉన్నాడు… అదీ కథ… ఆ ఇన్‌స్టా పోస్టుకు దాదాపు 15 లక్షల లైకులు, వేల కామెంట్లు… ప్రశంసలు… సినిమా నిర్మాతల ఉద్దేశం నెరవేరింది…

ఇంతకీ ఆమె అప్పట్లో ఏమన్నది..? మనకు పాక్ ఆర్మీ టెర్రరిస్టుల్లా కనిపిస్తే, మన ఆర్మీ వాళ్లకూ అలాగే కనిపిస్తుంది… అది మనం చూసే కోణంలోనే ఉంటుందని..! నిజానికి ఒక కోణంలో కరెక్టే… వాళ్ల ఐఎస్ఐ మనకు టెర్రరిస్టు సంస్థలా… మన ‘రా’ వాళ్లకు టెర్రరిస్టు సంస్థలా కనిపిస్తుంది… కానీ సాయిపల్లవి ఎక్స్‌ప్రెస్ చేయడమే సరైన రీతిలో లేదు… మన జనానికి ఆ నిజమూ నచ్చదు…

పైగా ఆమె గోహంతకుల హత్యల్నీ, కశ్మీర్‌లో హిందువుల ఊచకోతనూ ఒకేగాటన కట్టి వ్యాఖ్యలు చేయడం జాతీయవాదులను హర్ట్ చేసింది… అప్పట్లో హైదరాబాదులో ఓ కేసు కూడా ఆమెపై నమోదైనట్టు గుర్తు… అదేమైందో తెలియదు… కానీ ఆమె ఇష్యూస్ చూసే విధానంలోనే ఏదో తేడా ఉందనే విమర్శలు వ్యక్తమయ్యాయి… అప్పటిదాకా సాయిపల్లవిని తెలంగాణ ఆడపడుచుగా చూసిన చాలామంది ఈ వ్యాఖ్యలు, కేసు తరువాత ఆమెను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు… ఆ సినిమా ప్లస్ తరువాత వచ్చిన గార్గి కూడా ఫ్లాప్…

హఠాత్తుగా ఆమెపై సోషల్ మీడియాలో పాత వీడియో వైరల్ చేస్తూ బాయ్‌కాట్ సాయిపల్లవి అనే హాష్‌ట్యాగ్‌తో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఎవరో… ఓ అమర జవాన్ భార్య పాత్ర మన ఆర్మీని కించపరిచే సాయిపల్లవి పోషించడం కరెక్టు కాదని… అసలు ఆమె సీత పాత్ర కూడా పోషించకూడదని..! ఇన్నిరోజులూ కిక్కుమనకుండా ఇప్పుడు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారంటే దాని వెనుక ఏదో వ్యూహం, తమిళ ఇండస్ట్రీ రాజకీయాలు కారణమై ఉండవచ్చు కూడా…!

ఇప్పుడు సినిమా మీద, సాయిపల్లవి మీద ఆ వ్యతిరేకతను బ్రేక్ చేయాల్సిన అవసరం అమరన్ నిర్మాతల మీద పడింది… నాకు పీఆర్ టీమ్ అక్కర్లేదని క్లియర్‌గా చెప్పాను… ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను కత్తిరించడమో, కుదించడమో చేయకూడదని లిఖితపూర్వకంగా రాయించుకున్నాను… వంటి వ్యాఖ్యలు వేరు… కానీ ఆర్మీపై వ్యాఖ్యలు యాంటీ సెంటిమెంట్ అవుతాయి… ఆ సోయి ఆమెకు లేకపోవచ్చు కానీ ఈ సినిమా పాన్ ఇండియా వసూళ్ల మీద చాలా ఆశలు పెట్టుకున్నవాళ్లు ఊరుకోరు కదా… అందుకే నేషనల్ వార్ మెమోరియల్ సందర్శన, నివాళ్లు…!

పోనీ, ఇందు రెబెకాతో మాట్లాడినప్పుడో, ఈ సినిమా కథ మొత్తం చదివినప్పుడో… ఉగ్రవాదుల వేటలో ప్రాణాలొదిలిన అమరుల కథల్ని చదివినప్పుడో… ఆమెకు కశ్మీర్ పరిస్థితి, పాకిస్థాన్ ఆర్మీ ఉగ్రవాదం గురించిన నిజాలు మైండ్‌కు ఎక్కి ఉంటాయనీ, ఆమె నిజంగానే కావాలనే వార్ మెమోరియల్ సందర్శించి, నివాళ్లు అర్పించి ఉంటుంది అంటారా..? గుడ్, ఆ కోణం నిజమే అయితే…!!


View this post on Instagram

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)


#amaran, #saipallavi, #sivakartikeyan, #rajkamalpictures, #indurebekavarghis, #majormukundvaradarajan

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions