ఆల్‌రెడీ హైదరాబాద్ బార్క్ మార్కెట్‌లో ఎన్టీటీవీ ఫాఫం నాలుగో ప్లేసుకు పడిపోయింది… పేరుకు అది తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్… కానీ కీలకమైన ఫైనాన్షియల్ మార్కెట్ హైదరాబాద్‌లో మాత్రం దాని ప్రగతి ఇదీ…! ఇంకో విశేషం తెలుసా..? మేం టీవీ9 చానెల్‌నే కొట్టేశాం అంటున్నారు కదా… ఇప్పుడు ఆ ఎన్టీవీని ఫస్ట్ ప్లేసు నుంచి పడగొట్టేయడానికి టీవీ9 జస్ట్, ఒకే అడుగు దూరంలో ఉంది… అంటే రెండు చానెళ్ల నడుమ తేడా కేవలం ఒక జీఆర్పీ మాత్రమే…
గత వారం జీఆర్పీలతో పోలిస్తే ఎన్టీవీ ఆరు శాతం రేటింగ్స్ కోల్పోగా, టీవీ9 రెండు శాతం రేటింగులే కోల్పోయింది… సో, ఇప్పటికీ ఆ రెండు చానెళ్ల నడుమ ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది… ప్రస్తుతం ఎన్టీవీ రేటింగ్స్ (ఏపీ ప్లస్ తెలంగాణ ఓవరాల్) 61.7 కాగా టీవీ9 రేటింగ్స్ 60.7…
Ads
ఈసారి హైదరాబాద్ బార్క్ మార్కెట్‌లో మరో విశేషం ఉంది… కేటీయార్ బ్యాన్ చేస్తాం అని హెచ్చరిస్తున్న వీ6 చానెల్ అయిదో ప్లేసుకు పడిపోయింది… కాగా కేటీయార్ సొంత చానెల్ టీన్యూస్ నిన్నటివారం, ఈవారం రెండో ప్లేసులో ఫిక్సయిపోయింది… చానెళ్లన్నీ మైనస్ ట్రెండ్‌లో ఎంతోకొంత రేటింగ్స్ కోల్పోగా, టీన్యూస్ మూడు శాతం గెయిన్‌లో ఉండటం కూడా ఓ విశేషమే… ఒకప్పుడు టీన్యూస్‌ను ఎవడూ పెద్దగా దేకినవాడు లేడు… ఇప్పుడు ఆ ప్లేసులోకి వీ6 వెళ్తూ, టీన్యూస్ బెటర్ ప్లేసులోకి వస్తోంది…
నానాటికీ దిగదుడుపు అన్నట్టుగా సాక్షి టీవీ దిగజారిపోతోంది… ఓవరాల్ మార్కెట్‌లో ఏకంగా ఏడో ప్లేసుకు పడిపోగా… హైదరాబాద్ మార్కెట్‌లో మరీ ఘోరం దాని పరిస్థితి… చివరకు ఈటీవీ తెలంగాణ, హెచ్‌ఎంటీవీ, టెన్‌టీవీలకన్నా దిగువకు… పదో ప్లేసుకు పడిపోయింది… అంటే హైదరాబాదులో ఎవడూ ఆ చానెల్‌ను దేకడం లేదని అర్థం…
సరే, హైదరాబాద్ మార్కెట్ వదిలేసి, టోటల్ రెండు రాష్ట్రాల ఓవరాల్ రేటింగ్స్ చూస్తే… పదిలోపు రేటింగ్స్ ఉన్న టెన్ టీవీ, ఈటీవీ తెలంగాణ, హెచ్ఎంటీవీ, మహాన్యూస్, ఐన్యూస్, రాజ్ న్యూస్ ఎట్సెట్రా ‘‘ఉండీ లేని’’ కేటగిరీలో చేరిపోగా… 10 నుంచి 20 రేటింగ్స్ మధ్యలో ఉన్న ఈటీవీ ఆంధ్రప్రదేశ్, సాక్షిటీవీ ‘‘ఉనికి కనిపించే’’ కేటగిరీలో ఉన్నాయి… 20 నుంచి 35 రేటింగ్స్ కలిగిన టీన్యూస్, ఏబీఎన్, వీ6, టీవీ5 చానెళ్లు ‘పర్లేదు’ కేటగిరీలో ఉన్నయ్… ఎన్టీవీ, టీవీ9 మాత్రమే 60 పైచిలుకు రేటింగ్స్‌తో తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న ‘ప్రథమ’ కేటగిరీలో పోటీపడుతున్నయ్..!!
Share this Article