Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అర్బన్ రేటింగ్స్‌లో సాక్షి పదకొండో ప్లేసు… మొన్నటి ఎన్నికల్లో సీట్ల సంఖ్యలాగే…

August 8, 2024 by M S R

 

బార్క్ రేటింగ్స్ తాజావి పరిశీలిస్తుంటే… (న్యూస్ చానెల్ రేటింగ్స్) ఆశ్చర్యం కలిగింది… ఆమధ్య నాలుగైదు టాప్ చానెళ్ల జాబితాలోకి కూడా చేరిన సాక్షి చానెల్ ఇప్పుడు ఏకంగా తొమ్మిదో ప్లేసులోకి వెళ్లిపోయింది… అసలు ఆ ప్లేసు అని కాదు, అసలు ఎవరూ పెద్దగా చూడరు అనే అభిప్రాయం, అదే రేంజ్ రేటింగ్స్ ఉంటే ఈటీవీ తెలంగాణ చానెల్ సరసన చేరిపోయింది సాక్షి టీవీ… ఫాఫం, చివరకు మహాన్యూస్ కూడా సాక్షితో పోటీపడే రేంజుకు వచ్చేసింది…

రాజకీయాల్లో వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో చూశాం కదా… అదే రేంజ్ పతనం సాక్షి టీవీ విషయంలోనూ కనిపిస్తోంది… అఫ్‌కోర్స్, అది పార్టీ చానెలే కాబట్టి జగన్ మీద పెరిగిన నెగెటివిటీ ప్రభావం చానెల్ మీద కూడా కనిపించడం సహజం… కానీ మరీ ఈ పతనం ఆశ్చర్యకరం… టెన్ టీవీ, టీన్యూస్ కూడా దాన్ని దాటేశాయి… టాప్ వన్ ప్లేసులో ఉన్న టీవీ9 రేటింగులతో పోలిస్తే, వాటిల్లో సాక్సి రేటింగ్స్ అయిదో వంతు, ఆరో వంతు ఉన్నాయి…

Ads

sakshi

ఒకప్పుడు ఎన్టీవీ, టీవీ9 పోటీపడ్డాయి… ఓ దశలో ఎన్టీవీ టాప్ వన్ ప్లేసులోకి వెళ్లిపోయింది… ఇప్పుడు చూస్తే టీవీ9 రేటింగ్సులో ఎన్టీవీ రేటింగ్స్ దాదాపు సగమే… అంటే, ఇప్పట్లో ఇక టీవీ9 కు పోటీ ఇచ్చే సీన్ లేకుండా పోయినట్టే… ఇదీ ఆశ్చర్యకరమైన పతనమే… ఏదో ఆంధ్రాలో టీవీ9, సాక్షి, ఎన్టీవీ గట్రా చానెళ్ల ప్రసారాలపై ఆంక్షలు, పరిమితులు అన్నారు గానీ… ఆ ప్రభావం రేటింగుల మీద ఏమీ కనిపించడం లేదు…

ఈరోజుకూ టాప్ టు చానెల్స్ టీవీ9, ఎన్టీవీ మాత్రమే… ఒకప్పుడు వీటితో పోటీపడిన ప్యూర్ తెలుగుదేశం చానెల్ ఇప్పుడు ఆ చానెల్ నంబర్‌కు తగినట్టు ఐదో ప్లేసులోకి జారిపోయింది… అనుకోకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నాలుగో ప్లేసులోకి వచ్చింది… కొన్నాళ్లు పోతే అది ఎన్టీవీకి పోటీగా రెండో ప్లేసు కోసం ప్రయత్నిస్తుంది, ఖాయం… ఆల్రెడీ అది హైదరాబాద్ కేటగిరీలో సెకండ్ ప్లేస్…

సరే, సాక్షి గురించి చెప్పుకుంటున్నాం కదా… ఇతర కేటగిరీలు చూసినా ఇదే గతి… హైదరాబాద్ కేటగిరీలో సాక్షి టీవీ మరీ తొమ్మిదో ప్లేసు.,. ఆంధ్రా చానెల్‌గా పరిగణించే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానెల్ హైదరాబాద్ కేటగిరీలో మరీ పదో ప్లేసు ఫాఫం… 75 అర్బన్ కేటగిరీలో కూడా సాక్షి టీవీ తొమ్మిదో ప్లేసు…  రూరల్ కేటగిరీలో ఏడో ప్లేసు… అర్బన్ కేటగిరీలో మరీ పదకొండో ప్లేసు… మొన్న వైసీపీకి ఎన్నికల్లో వచ్చిన సీట్ల సంఖ్యలాగే…! ఈ కేటగిరీలో మహాన్యస్ కూడా సాక్షిని దాటేసింది..! మరి సాక్షి పత్రిక గతేమిటీ అంటారా..? ఏమో, మళ్లీ ఏబీసీ వచ్చేవరకూ ఆగాల్సిందే..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions