.
బీజేపీ విధానాలతో విసిగిపోయి, మోడీ పాలనతో విముఖత పెంచుకున్నవారెవరైనా సరే…. మేం కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతాం, వోట్లేస్తాం అని ముందుకొస్తే….. నో, ఎవడ్రా మీరు కాంగ్రెస్‌కు వోట్లేస్తారా..? నథింగ్ డూయింగ్ అని ఈవీఎం మీద కాలు పెట్టి మరీ అడ్డుతగిలే కేరక్టర్లు కొన్ని కాంగ్రెస్‌లోనే కొన్ని ఉంటాయి…
దీనికి పర్‌ఫెక్ట్ ఉదాహరణ… కాంగ్రెస్ ఇంటర్నేషనల్ విభాగం చీఫ్ అని చెప్పబడే శామ్ అంకుల్… అలియాస్ అసలు పేరు సత్నారాయణ్ గంగారామ్ పిట్రోడా… అనగా అమెరికన్ శామ్ అంకుల్ కాదు… అమెరికాలోనే ఉండే శామ్ పిట్రోడా అనబడే ఓ వయోవృద్ధ పర్వర్టెడ్ కాంగ్రెస్ హరాకిరీ బ్యాచ్ అన్నమాట…
Ads
తన మైండ్ మ్యూజియంలో ఉండాల్సిన కేటగిరీ… నోరు విప్పితే చాలు వివాదాల కంపు… ఫాఫం, తనను మోస్తూ మోస్తూ కాంగ్రెస్ ఆ బరువుకు కుంగిపోతూ ఉంటుంది… ప్రతి కామెంటూ దుర్వాసనభరితం… గతంలో చాలా ఉన్నయ్, ఇక్కడ అవన్నీ ఏకరువు పెడితే స్పేస్ వేస్ట్, ఆ కంపు భరించలేం గానీ… తాజాగా ఏమంటాడు అంటే..?
‘‘ఏమయ్యా మోడీ, మన విదేశాంగ విధానం బాగా లేదోయ్, సవరించుకో, ప్రత్యేకించి మన పొరుగుదేశాలతో, మరీ ప్రత్యేకించి పాకిస్థాన్‌తో మనం వ్యవహరించే విధానం ఏమాత్రం బాగోలేదు… అసలు ఇరుగూపొరుగుతో ఎలా ఉండాలో నీకు తెలుసా..? నేను ఆమధ్య పాకిస్థాన్ వెళ్లాను, నిజం చెప్పాలా..? సొంత కంట్రీలో ఉన్నట్టే అనిపించింది సుమా..,
అదే కాదు, బంగ్లాదేశ్ వెళ్లాను, నేపాల్ వెళ్లాను… సేమ్, మన దేశంలో ఉన్నట్టే అనిపించింది తెలుసా..?’’ ఇలా సాగిపోయింది సారు గారి వ్యాఖ్యానం… అసలే మొన్నటికిమొన్న మోడీ అన్నాడు, కాంగ్రెస్ మరీ పాకిస్థాన్ మద్దతుదారు అయిపోతోందని… అందులో పెట్రోల్ పోసినట్టుగా ఇప్పుడు ఈ శామ్ పిట్రోడా… అఫ్‌కోర్స్, ఇదో శకుని పాత్ర… ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను డిఫెన్సులో పడేసే పాత్ర…
ఇది మొదలూ కాదు, చివరిదీ కాదు… అసలే పహల్గాం పైశాచికం తరువాత దేశవ్యాప్తంగా పాకిస్థాన్ మీద ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయిరా బాబూ అంటే… ఇప్పుడు ఈ ముసలి పైత్యకారుడు ‘పాకిస్థాన్ లో ఉంటే అచ్చం స్వదేశంలోనే ఉన్నట్టుంది సుమా’ అని కామెంటుతున్నాడు…
నిజానికి మోడీ అండ్ కో కాంగ్రెస్ మీద రాజకీయ వ్యాఖ్యానాలు, విమర్శలు చేయాల్సిన పనీ లేదు… కాగల కార్యం శామ్ పిట్రోడా వంటి హరాకిరీ బ్యాచ్ చేసేస్తుంది… చైనా మన శత్రువు కాదంటాడు… ఇండియన్ జాతులన్నీ ఆదిమజాతుల ఆనవాళ్లు అంటాడు… రాహుల్ గాంధీ అర్జెంటుగా తన నోటికి మొక్కాలి…
ఇంకా నయం, శామ్ పిట్రోడా ఇండియాలో తిరుగుతూ ఉంటే ఏదో విదేశంలో తిరుగుతున్నట్టుంది, దీనికన్నా పాకిస్థానే నయం అనలేదు… శామ్ పిట్రోడా వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న బీజేపీ నేతలు ఆన్‌లైన్‌లో ఎక్కీ దిగుతున్నారు…
నువ్వెక్కడ దొరికావురా బాబూ… ఆమధ్య ఏవో పిచ్చి కూతల తరువాత ఎఐసీసీ తనను సస్పెండ్ చేసి, నాలుగు రోజులకే మళ్లీ తనను అక్కున చేర్చుకుని, అదే ఇంటర్నేషనల్ కాంగ్రెస్ విభాగానికి చీఫ్‌గా కంటిన్యూ చేస్తోంది… ఈయనకు ఎందుకింత ప్రాధాన్యం కాంగ్రెస్‌లో..?!
Share this Article