హిట్ కాబోయే సినిమాకు ముందస్తు బజ్, హైప్ విపరీతంగా ఉండనక్కర్లేదు… కాస్త వినోదాన్ని, కొత్తదనాన్ని ఇచ్చేలా ఉంటే సరి… మౌత్ టాక్ సినిమా భవిష్యత్తును తేలుస్తుంది… కాంతార సినిమా సంగతి తెలుసు కదా… సూపర్ హిట్… రోజూ ప్రేక్షకులు ఫుల్లు… ఆ టాక్ వచ్చాకే ఇతర భాషల్లోకి డబ్బయింది… పాన్ ఇండియా హిట్టయింది… ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయగల సినిమాలే రావడం లేదు కాబట్టి థియేటర్లకు పెద్దగా జనం వెళ్లడం లేదు…
కార్తికేయ-2 సూపర్ హిట్ తరువాత నిఖిల్ ఇమేజీ పెరిగింది… పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు… తన తాజా సినిమా స్పై మీద తన ఒరిజినల్ రేంజ్‌ను మించి కాస్త హైప్ వచ్చింది… తీరా చూస్తే సినిమా యావరేజ్… కాదు, బోర్… ఈ సినిమాతోనే విడుదలైన సామజవరగమన సినిమా మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది… చూస్తేనేమో చిన్న సినిమా… వరుస ఫ్లాపుల హీరో శ్రీవిష్ణు… ఐతేనేం, పరీక్షలో పాసైంది… అది మామూలు పాసా, హిట్టా అనేది వచ్చే వారం తేలిపోతుంది…
ఈ సినిమాలో పండిన కామెడీకి తోడు పాటలు కూడా కాస్త బాగుంటే బాగుండు… పోనీ, మొత్తమే లేపేసినా ఇంకా బాగుండు… కథ కాస్త వెరయిటీ… తండ్రి నరేష్ 20 ఏళ్లుగా డిగ్రీ పాస్ కాలేకపోతుంటాడు… అది పాస్ కానిదే ఆస్తి తగ్గదు… అలా రాసిపోయాడు హీరో తాత… అదేమో వందల కోట్ల ఆస్తి… అదీ నరేష్ డిగ్రీ చదువు నేపథ్యం… తండ్రికి ట్యూషన్లు పెట్టిస్తాడు… ఈలోగా హీరోయిన్ పేయింగ్ గెస్టుగా వస్తుంది… హీరోతో లవ్వు… కానీ ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెలుగా చూపించి పెళ్లి జరగకుండా అడ్డుపడతాడు దర్శకుడు…
Ads
నిజానికి సినిమాలో ఓ ప్రాథమిక సూత్రం… కథ కొత్తగా ఉండాలి లేదా పాత కథనే ఇంట్రస్టింగుగా చెప్పాలి… సామజవరగమన కథలో కాస్త కొత్తదనం ఉంది… దాన్ని ప్రేక్షకులు బోర్ కాకుండా కాస్త రక్తికట్టించాడు దర్శకుడు… కాస్త వెరయిటీ కథకు, వెరయిటీ కథనానికి తగినట్టు సీన్లు, ప్రజెంటేషన్ ప్లస్ పంచ్ డైలాగ్స్ తోడయితే సినిమాకు మరింత బలం… సామజవరగమన సినిమాలో డైలాగులే ప్రధానబలం… ఎలాగూ నరేష్, శ్రీవిష్ణులే మెయిన్ పాత్రలు కాబట్టి, వాళ్లకు నటన తెలుసు కాబట్టి కుమ్మేశారు…
ఈమధ్య వెన్నెల కిషోర్ నవ్వించలేకపోతున్నాడు… మొనాటనీ వచ్చేసింది పాత్రలకు… తన నటన కూడా అలాగే మారిపోయింది… ప్రతి సినిమాలో ఈ నటుడు ఉంటాడు… చాన్నాళ్ల తరువాత మళ్లీ సామజవరగమనలో కాస్త బెటర్ పాత్ర దొరికింది… నవ్వించాడు కూడా… తన రీసెంటు పాత్రలతో పోలిస్తే కాస్త బెటర్… అవునూ, ఇంతకూ ఈ సినిమాకు సామజవరగమన అనే టైటిల్ ఎందుకు పెట్టినట్టు..? ఏదో ఒకటిలే, క్యాచీగా ఉంది కదా అని పెట్టేసినట్టున్నారు… పోనీలే, ఏదో ఒక పేరు, దిక్కుమాలిన పేర్లతో వచ్చే తమిళ డబ్బింగ్ సినిమాలకన్నా బెటరే కదా… ఐనా నేములోనేముంది..? అరె, చెప్పనేలేదు కదూ… హీరోయిన్ రెబ్బ మోనిక జాన్ కూడా బాగుంది…
Share this Article