.
సామాన్లు… ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది… ఏదో వేదిక మీద శివాజీ హితకూతలు… తరువాత చిన్మయి, అనసూయ ఎంట్రీ… ఆ ఇద్దరి మీద ఎదురుదాడి, తరువాత నాగబాబు… ప్రకాష్ రాజ్… ఎవరెవరో ఎంటర్ అవుతున్నారు…
చివరకు ఓ దరిద్రపు యూట్యూబర్ అన్వేష్ గాడు (గాడు అనే అంటున్నా) ఎంటరై… ద్రౌపది, సీతల మీద… హిందువుల మీద, హిందూమతం మీద రోత కూతల దాకా వెళ్లిపోయాడు… ఇప్పుడు పోలీస్ కేసు, ఇది ఇంకా ఎక్కడి దాకా పోతుందో తెలియదు…
Ads
ఐతే ఈ సామాన్ల భాష శివాజీ సొంత క్రియేషన్ కాదు… బహుశా రీల్స్, షార్ట్స్ బాగా చూస్తాడేమో… ఆరు నెలల క్రితం నాటి కొన్ని షార్ట్స్, రీల్స్, వీడియో బిట్స్ బాగా మైండులో ఫిక్సయినట్టున్నాయి… అనుకోకుండా అదే భాష వచ్చేసింది…
బహుశా… ఇదుగో ఇదీ దీనికి ఆరంభం అనుకుంటా…
ఎవరో ఓ ఆంటీ అనబడే మహిళ ఏవో వీడియోలు చేస్తూ, ఎవరూ లైకులు కొట్టడం లేదు అంటూ బాధపడింది… దాన్ని బేస్ చేసుకుని ఇంకెవడో లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని వెక్కిరంపు కూతలకు దిగాడు…
- ఎవడ్రా నువ్వు, చెప్పుతో కొడతాను అని ఆమె… చెప్పుతో కొట్టాలన్నా సామాన్లు బాగుండాలి అని రెట్టిస్తూ వీడు… పోలీసు కేసు పెడతాను అని ఆమె… ఐనా సామాన్లు బాగుండాలి అని వీడు… ఇక దీన్ని బేస్ చేసుకుని, కుర్చీ మడతబెట్టే తరహాలో… బోలెడు రీమిక్సులు, డీజేలు మోత మోగిపోతున్నాయి…
వేలల్లో కాదు, లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి వాటికి… అంటే, మనమే ఆ భాషకు, ఆ ధోరణికి ఆమోదం తెలుపుతూ, ప్రోత్సహిస్తున్నామన్నమాట… బోలెడు కామెంట్లు, ఎంకరేజ్‌మెంట్లు, ఇక ఎవడు ఆగుతాడు..? శివాజీ అసందర్భంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ సినిమా ఈవెంటు వేదిక మీద…
దాంతో ఇతరులు అందుకున్నారు… చివరికి అది పెరిగీ పెరిగీ ఓ రోత వీడియోల వెధవ దాకా వెళ్లి… మరింత కంపు కంపు అయిపోయింది… ఇదీ సంగతి… గ్రోక్‌లో బరిబాతల ఎఐ ఫోటోల దుర్మార్గం మీద నిరసన వెల్లువెత్తుతోంది కదా… ఏకంగా భారత ప్రభుత్వమే రంగంలోకి దిగుతోంది కదా ఓ బీజేపీ లేడీ ఎంపీ చొరవతో…! మరి యూట్యూబ్, ఫేస్‌బుక్ వీడియో కంటెంటులకు నియంత్రణ అవసరం లేదా..?
ఎస్, ఆన్‌లైన్ కంటెంటుకు చెక్ పెట్టే యంత్రాంగం ఎందుకు ఉండకూడదు..? అదిప్పుడు సమాజావసరం… క్రియేటివ్ ఫ్రీడమ్, భావప్రకటన మన్నూమశానం అనే మనోభావుకులు ఎలాగూ మొత్తుకుంటారు… పర్లేదు..! ఓ కఠిన వ్యవస్థ తక్షణావసరం..!!
Share this Article