నిజానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు… కాకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి నాగచైతన్య-సమంతల విడాకుల వ్యవహారం జనం నోళ్లలో నానుతోంది… అసలు సినిమా, టీవీ, మోడలింగ్ తదితర ప్రలోభాల, విలాసాల రంగుల రంగాల్లోనే కాదు… విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి… కాకపోతే సెలబ్రిటీల విడాకుల మీద కాస్త ఎక్కువ చర్చ సాగుతూ ఉంటుంది… ఆమెతో చైతన్య బంధం తెగిపోయినట్టే… మ్యుచువల్ కాన్సెంట్‌తో డైవోర్స్‌కు అప్లయ్ చేసుకుని, ఓ దఫా కౌన్సిలింగ్ కూడా జరిగిందట… నాగార్జున కాస్త చక్కబెట్టే ప్రయత్నం చేసినా, ఇక అది మళ్లీ అతుక్కునే దశ దాటిపోయింది… అంతేకాదు, ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు కదా… సమంత వచ్చే నెల మొదటి వారం నుంచి ఇక ముంబైలో ఉండబోతోంది… అంటే తను బాలీవుడ్ మీద కాన్సంట్రేట్ చేయబోతోంది అని అర్థం… ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సీరీస్ సక్సెస్ ఆమె మెదడుకు బాగా ఎక్కేసిందనీ, ఈ విడాకుల యవ్వారం తరువాత ఇక టాలీవుడ్ ఆఫర్లు వచ్చినా సరే చేయడం ఇబ్బందికరంగా ఉంటుందనీ భావిస్తున్నదట… పైగా బాలీవుడ్ లింక్స్ బాగా బలపడ్డాయట ఈమధ్యలో… వాస్తవానికి ఆమెకు ఇప్పుడు చేతిలో శాకుంతలం తప్ప వేరే సినిమాలేవీ లేవు…
నాగచైతన్య సిన్సియర్ లవర్ అనీ.., సమంతే తన చుట్టూ చేరిన ఓ పిచ్చి సర్కిల్ కారణంగా లేనిపోని కొత్త భ్రమల్ని పెంచుకుని, బంధాల్ని ఎంచుకుని, ఇంకా ఏవేవో మాయల్లో పడి, చైతన్యతో తెగదెంపులు చేసుకుంటోందనే అభిప్రాయం ఫిలింనగర్ సర్కిళ్లలో ఉంది… తన పర్సనల్ మేకప్ మ్యాన్ వొడిలో తలపెట్టి పడుకుని, ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టినప్పటి నుంచే ఆమె *దారి* మారిపోయిందని సూచన… Exposing pics కూడా..! కానీ, అక్కినేని ఫ్యామిలీ అనే ట్యాగ్ కారణంగా… ఆమె ఏది పడితే ఆ పాత్ర చేయకుండా కట్టిపడేసినట్టుగా ఉండి, ఉక్కిరిబిక్కిరవుతోందనీ, అందుకే బంధాలు తెంచుకుని, రెక్కలు కట్టుకుని వెళ్లిపోతోందని మరో అభిప్రాయం… సర్లెండి, ఇవన్నీ ఇండస్ట్రీలో కామనే… నాటి మహానటి నుంచి ఈ నటి దాకా బోలెడుమంది జీవితాల్ని చదివాం, చూశాం… సీన్ కట్ చేస్తే…
Ads
అవునూ… మరో రెండుమూడు ప్రముఖ జంటల వైవాహిక జీవితాలూ అటోఇటో అంటున్నారు నిజమేనా..? పోనీలెండి, ఏవేవో రూమర్స్ వస్తూనే ఉంటయ్ గానీ… ఒక్కసారి నాగార్జున పరిస్థితి చూస్తే మాత్రం ఒక కోణంలో ఆశ్చర్యం వేస్తుంది… (బిగ్‌బాస్ వీకెండ్ షోలో నాగార్జున మరీ డల్లుగా కనిపించాడని మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం కదా… బహుశా ఈ ఫ్రస్ట్రేషన్లే కారణం కావచ్చు…) నిజానికి సమంతతో చైతన్య పెళ్లి నాగార్జునకు మొదట్లో ఇష్టం లేదు, తనకు సమంత తత్వం గురించి కొంత తెలుసు, అందుకే వద్దన్నాడు, కానీ చైతన్య ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను, కానీ సమంత కావల్సిందే అనేసరికి అంగీకరించకతప్పలేదు… తీరా చూస్తే అదిప్పుడు పెటాకులైపోయింది… విడిపోవడానికి ఆమె ఎంత డిమాండ్ చేస్తున్నదనే అంశంలోనూ బోలెడు భారీ అంకెలు వినిపిస్తున్నయ్… లవ్‌స్టోరీ హిట్టయితే సరే, లేకపోతే చైతు సినిమా కెరీర్ కూడా ఒడిదొడుకుల్లో పడొచ్చు…
అఖిల్ అంతే, హీరోగా ఎస్టాబ్లిష్ కావడం లేదు… తన పెళ్లి కూడా అప్పట్లో నిశ్చితార్థం జరిగీ బ్రేక్ అయినట్టుందిగా… అసలు నాగార్జున మొదటి వివాహమే ఓ ఫెయిల్యూర్, తరువాతే కదా అమల వచ్చింది తన జీవితంలోకి… ఇక హీరోగా తన కెరీర్ ముగింపుకి వచ్చేసినట్టే కనిపిస్తోంది… బిగ్‌బాస్ తప్ప జనం ముందుకు వచ్చే ప్రాజెక్టులేమీ చేతిలో ఉన్నట్టు లేదు… కరోనా దెబ్బకు స్టూడియో ఆర్థికస్థితి ఆగమాగం… మరిక ఫ్రస్ట్రేషన్ ఉండక ఇంకేముంటుంది..? ఎంత చెట్టుకు అంత గాలి… బయటికి కనిపించిన సౌఖ్యమేమీ ఉండదు చాలా సెలబ్రిటీల కుటుంబాల్లో…! అసలు తనే కాదు, ముఖ్యమైన తెలుగు సినిమా సెలబ్రిటీల ఫ్యామిలీల్లో ‘కుటుంబ జీవనాలు’ కుదురుగా ఉండటం లేదు… ఆ కారణాల చర్చలోకి వెళ్తే ఇక అది తెగదు, ఒడవదు… డబ్బు, పాపులారిటీ, రంగుల ప్రపంచం, విలాసాలు, విచ్చలవిడితనం… వాట్ నాట్..? నడమంత్రపు సిరి తగిలిన నాయకులు, వాళ్ల వారసులు కూడా అంతేకదా… కొన్ని మాత్రమే బయటికొస్తున్నయ్, కొన్ని బయటికిరావు… అంతే తేడా..!!
Share this Article