భారతీయ సినిమాలు ప్రధానంగా హీరోస్వామికం… హీరోలే సర్వస్వం… హీరోయిన్లు కేవలం హీరోలకు సపోర్టివ్ పాత్రలు మాత్రమే అనే భ్రమలు, భావనలు కొన్నిసార్లు పటాపంచలైపోతాయి… హీరోయిన్లే హీరోలపై గెలుస్తుంటారు… హీరోయిన్ సెంట్రిక్ సినిమాల ముందు హీరో బిల్డప్పుల సినిమాలు బోరుమంటాయి…
యశోద అనే సినిమాకు బలమైన ఆధారం సమంత… కథానాయిక… ఓ వ్యాధితో బాధపడుతూనే షూటింగ్ పూర్తి చేసింది… ఆ బాధతోనే ఉండి, సరైన ప్రమోషన్స్ కూడా చేసుకోలేకపోయింది… అయితేనేం, మంచి వసూళ్లను సాధించింది… సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్… సోలో హీరోయిన్‌గా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్… సరోగసీ బ్యాక్‌డ్రాప్ కథను ప్రేక్షకులు కూడా ఆదరించారు…
ఓటీటీ, శాటిలైట్ టీవీ రైట్స్ ఆదాయం గాకుండా… థియేటరికల్ రన్ ద్వారానే యశోద సినిమా 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది… పర్లేదు… ఓ చిన్న హీరోయిన్ సెంట్రిక్ సినిమా ఆ వసూళ్లు సాధించిందీ అంటే విశేషమే… ఆల్‌రెడీ దీనికి సీక్వెల్ వర్క్ స్టార్టయిపోయింది… ఇప్పుడు ఆమె దృష్టి శాకుంతలం మీద ఉంది… అదీ పాన్ ఇండియా సినిమా… ఓ మోస్తరుగా బాగున్నా సరే ఇదీ బాగానే వసూళ్లు సాధించగలదు…
Ads
ఇంకోవైపు పాపులర్ హీరో విశాల్… తమిళంతోపాటు తెలుగులో కూడా కాస్త పాపులర్ హీరోయే… కానీ రొటీన్ మూస కథలతో సాగుతున్న తన సినిమాల్ని ప్రేక్షకులు తిరస్కరిస్తున్నా, ఇంకా ఇంకా అదేబాటలో నడుస్తున్నాడు… ఒకవైపు తమిళంలో ఇతర హీరోలు భిన్నమైన కథలతో ప్రయోగాలకు కూడా సిద్ధపడుతున్న రోజుల్లో కూడా విశాల్ తనదైన ఓ మూసను మాత్రం వదలడం లేదు…
ఈమధ్య లాఠీ అనే సినిమా వచ్చింది… కాస్త ఫ్యాన్ బేస్ ఉన్న తమిళంలో కాస్త నయమేమో గానీ తెలుగులో ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా ఎవరికీ గుర్తులేదు… అంత అనామకం… ఓవరాల్‌గా ఈ సినిమాకు 35 కోట్ల బిజినెస్ జరిగింది… కానీ కేవలం 18 కోట్ల మేరకు మాత్రమే గ్రాస్ వసూళ్లు సాధించగలిగింది… తమిళనాడులో సినిమా సరిగ్గా నడవకపోయినా కొన్నిచోట్ల నడిపించారు… రెండోవారం తరువాత ఈ సినిమా మరీ 9 లక్షలు, 10 లక్షలకు రోజువారీ కలెక్షన్లు పడిపోవడంతో ఇక తీసిపారేశారు…
గత వారం రెండూ టీవీల్లో ప్రసారమయ్యాయి… అసలే టీవీల్లో ప్రేక్షకులు సినిమాల్ని చూడటం మానేస్తున్నారు… ఓటీటీ దెబ్బ టీవీలపై బాగానే పడింది… తెలుగులో రేటింగ్ విషయానికొస్తే ఈటీవీలో వచ్చిన యశోద సినిమా 4.88 జీఆర్పీలు సాధించగా, జెమినిలో వచ్చిన విశాల్ లాఠీ సినిమా 3.72 రేటింగ్స్ సాధించింది… అంటే ఓ హీరోయిక్ సినిమాకన్నా ఓ హీరోయిన్ సెంట్రిక్ సినిమాను టీవీ ప్రేక్షకులు ఎక్కువగా చూశారన్నమాట… ఇది విశాల్, సమంత నడుమ పోటీ కాదు, కానీ గత వారం టీవీల్లో ఆ ఇద్దరివే సినిమాలు ప్రసారమయ్యాయి కాబట్టి ఓ తులనాత్మక పరిశీలన…!
Share this Article