Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిచ్చు పెట్టిన ఆ పాత్రే సమంతకు అవార్డునూ తెచ్చిపెట్టింది..!

December 10, 2021 by M S R

కొన్ని అంతే… ఐరనీ అనిపిస్తయ్… మరి లైఫ్ అంటే అంతే కదా… చైతూ సమంతల నడుమ చిచ్చు రాజుకోవడానికి కారణమైన ఓ పాత్ర ఆమెకు ఓ మంచి అవార్డును తెచ్చిపెట్టింది ఇప్పుడు… అదేనండీ, ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరిస్ తెలుసు కదా… అందులో డీగ్లామరస్‌గా, ఓ నల్ల విప్లవకారిణి పాత్ర పోషించింది కదా… అప్పటికే మనస్పర్థలు మొదలైన చైతూ సమంతల సంసారంలో ఆ పాత్ర, ఆ సీరిస్ షూటింగు కాస్త పెట్రోల్ పోసిందని అప్పట్లో వార్తలొచ్చినయ్… ఆమె మరీ పాత్ర పరిధిని మించి, స్వేచ్ఛగా, విశృంఖలంగా నటించేసిందనీ, అది నాగార్జున ఫ్యామిలీకి నచ్చలేదని ఆ వార్తల సారాంశం… చివరకు ఆ పెళ్లి పెటాకుల దాకా, విడాకుల దాకా దారితీసింది… అదంతా ఓ కథ… ఎవరూ ధ్రువీకరించలేని స్పష్టాస్పష్ట కథనం… ఇప్పుడు ఆ పాత్రకు గాను సమంతకు ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది… ఇదంతా సరే, ఇంతకీ… అసలు ఈ ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డులేమిటి..?

samantha

సినిమాలకు అవార్డుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే గాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు కూడా ప్రకటిస్తుంటయ్… వాటిల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులకు కాస్త క్రెడిబులిటీ ఉంది… గతంలో నాటకాలకూ అవార్డులు ఇచ్చేవాళ్లు… టీవీ కేటగిరీలోనూ అవార్డులు ఇచ్చేవాళ్లు… ఇప్పుడు ప్రతి టీవీ చానెల్ తమ సీరియళ్లకు గాను తామే అవార్డులు ప్రకటించుకుంటున్నయ్… మరి ఇది ఓటీటీ యుగం కదా… సినిమాలు ఓటీటీల్లో ప్రసారం చేయడమే కాదు, ఓటీటీ సంస్థలు సొంతంగా సినిమాలు నిర్మించి ప్రసారం చేస్తున్నయ్… వెబ్ సీరీస్‌లతో దున్నేస్తున్నయ్… అశ్లీలం, హింస గట్రా ఎక్కువ అనే విమర్శలు ఉన్నా సరే, కావల్సినంత స్పేస్ ఉండటంతో క్రియేటివిటీ కూడా కనిపిస్తోంది… సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తున్నయ్… నిజానికి థియేటర్ రిలీజ్ అయితే చాలా సమీకరణాలు, లెక్కలు చూసుకోవాలి… ఓటీటీ అయితే కొన్నిసార్లు కమర్షియల్ కోణాల్ని దాటి బయటికి వచ్చి కూడా క్రియేటివ్ ప్రొడక్ట్ వైపు ఆలోచించవచ్చు…

Ads

samantha

తాజాగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డులను ప్రకటించింది… స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్-2 సీరీస్‌లు ఎక్కువ అవార్డులను కొట్టేశాయి… టైమ్స్ పబ్లిష్ చేసిన అవార్డుల జాబితా ఇది… మీకు పరిచయమున్న వెబ్ సీరీస్, వాటికొచ్చిన అవార్డులు ఓసారి చూసుకోవచ్చు…

Best Original Soundtrack: Scam 1992

Best Costume Design: Scam 1992
Best Production Design: Scam 1992
Best Background Music: Scam 1992
Best Editing: Scam 1992

Best VFX: Scam 1992

Best Cinematographer: Scam 1992

Best Original Story: Family Man

Best Dialogue: Scam 1992

Best Original Screenplay: Family Man 2

Best Adaptive Screenplay: Scam 1992

Best Non Fiction Original: Bad Boy Billionaires

Best Supporting Actor, Series ( Male ): Vaibhav Raj Gupta – Gullak

Best Supporting Actor, Series ( Female ) ( Comedy ): Sunita Rajwar – Gullak

Best Actor Comedy Male ( Critics ):  Sunil Grover – Sunflower

Best Actor Comedy, Female ( Critics ): Kani Kasruti – Ok Computer

Best Actor in a Comedy Series ( Male ): Jameel Khan – Gullak

Best Actor in a Comedy Series ( Female ): Geetanjali Kulkarni – Gullak

Best Comedy Series / Special: Gullak

Best Supporting Actor in Drama Series ( female ): Amruta Subash, Bombay Begums

Best Supporting Actor in Drama Series ( Male ): Sharib Hashmi, Family Man

Best supporting actor, web original Female: Radhika Madan ( Ray )

Best Actor web original, Male: Nawazuddin Siddiqui, Serious Men

Best Series, Critics: Mirzapur, Season 2

Best Director, Series ( Critics ): Suparn Verma, Family Man

Best Actor Drama series, Female: Huma Qureshi, Maharani

Best Actor, Critics: Manoj Bajpayee

Best Actor Drama Series ( Female ): Samantha, Family Man

Best Actor Series ( Male ): Pratik Gandhi, Scam 1992

Best Director Series: Hansal Mehta, Scam 1992

Thankyou @filmfare 🙏 https://t.co/ix7g7eyeDQ

— Samantha (@Samanthaprabhu2) December 9, 2021

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions