Subramanyam Dogiparthi…. చలం నిర్మించి నటించిన సినిమాలలో చక్కటి , వినోదభరిత , మ్యూజికల్ హిట్ 1970 లో వచ్చిన ఈ సంబరాల రాంబాబు సినిమా . తమిళంలో కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఎథీర్ నీచల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో నగేష్ , జయంతి , షావుకారు జానకి , మనోరమ ప్రభృతులు నటించారు . తమిళంలో కూడా బాగా సక్సెస్ అయింది . హిందీలో లాఖోం మే ఏక్ అనే టైటిల్ తో మెహమూద్ తో నిర్మించబడింది . అక్కడా హిట్టయింది .
చలం స్వంత సినిమా కదా ! హాస్య నటులు చాలామంది కనిపిస్తారు . మెరీనా బీచ్ లో బాలకృష్ణ , అల్లు రామలింగయ్యలు హాకర్సుగా కనిపిస్తారు . మిక్కిలినేని , రామచంద్రరావు , ప్రభాకరరెడ్డిలు కూడా ఉన్నారు . .
వి కుమార్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్ . జీవితమంటే అంతులేని ఒక పోరాటం , విన్నారా విన్నారా ఈ చిత్రం కన్నారా , పొరుగింటి మీనాక్షమ్మను చూసారా కన్నులే నవ్వేయి , మామా చందమామా వినరావా నా కధా పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఈ సంగీత దర్శకుడు తమిళ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించేవారు . నాలుగయిదు సినిమాలకు మాత్రమే తెలుగులో సంగీత దర్శకత్వం వహించారు . జి వి ఆర్ శేషగిరిరావు దర్శకుడు . చలం లక్కీ ప్రొడ్యూసర్ . అతను తీసిన మట్టిలో మాణిక్యం వంటి సినిమాలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి .
Ads
Share this Article