ఈటీవీ వాడి జబర్దస్త్ షో నాణ్యత, కేరక్టర్, పోకడ దరిద్రాలు అందరికీ తెలిసిందే… మల్లెమాల యూనిట్ వారి క్రియేటివిటీ లెవల్స్, టేస్ట్ రేంజ్ ఎక్కడో పది కిలోమీటర్ల దిగువన పాతాళంలో దేకుతూ ఉంటుందని కూడా తెలిసిందే… అంతేకాదు, నటుడు ఆలీ వేదికల మీద, తన షోలలో చేసే వెకిలి వ్యాఖ్యలు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిగా అది తన లెవల్… అయితే కొత్తగా వచ్చిన డౌట్ ఏమిటంటే..? జబర్దస్త్ అనే వెగటు కామెడీ షోలో స్కిట్లు చేసీ చేసీ ఆ కమెడియన్లు అందరికీ ఓ వెకిలి కేరక్టర్లుగా కనిపిస్తున్నారా..? అలా మారిపోయారా..? మారిపోవాల్సి వచ్చిందా..? చివరకు వాళ్లతో ఓ చిట్‌చాట్ షో చేస్తే, అదే జబర్దస్త్ భాషలో, అదే జబర్దస్త్ టేస్టుతోనే సాగాలా..? థూ, వీబచె… అనిపించింది ‘ఆలీతో సరదాగా’ తాజా ప్రొమో చూస్తే…! అసలే ఈటీవీ, అందులో ఆలీ, ఎదురుగా జబర్దస్త్ కమెడియన్లు… ఇంకేముంది..?
నిజానికి జబర్దస్త్ కమెడియన్లలో అదిరె అభికి కాస్త మంచి పేరే ఉంది… చాలా సీనియర్… సెన్సిబుల్… చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లో కూడా కాలు పెట్టినా కాలం కలిసి రాలేదు, క్లిక్ కాలేదు… మంచి నటుడే… హీరో ప్రభాస్ సినిమా కెరీర్‌లో ఫస్ట్ ఫిలిమ్, ఫస్ట్ షాట్‌లో అదిరె అభి ప్లస్ ప్రభాస్ ఉంటారు… క్లాప్ పడిందే వాళ్లిద్దరి మీద… కానీ ఈ గొంగళి ఇంకా ఇక్కడే ఈటీవీ స్టూడియోలోనే పిచ్చి స్కిట్లకు పరిమితం అయిపోయింది… డెస్టినీ… టీవీ కామెడీ షోలలో ఇప్పుడు టాప్‌లో ఉన్న హైపర్ ఆది వంటి సీనియర్లు కూడా అదిరె అభితో కలిసి పనిచేసినవాళ్లే… ఆటో రాంప్రసాద్ స్వతహాగా రైటర్… కష్టపడతాడు… కానీ వాళ్లతో షో చేస్తున్నప్పుడు ఆలీకి తనలోని సహజమైన వెలికితనం ప్లస్ జబర్దస్త్ షోలోని వెలికితనమే ప్రధానంగా గుర్తొచ్చాయి… అదే కోణంలో సాగినట్టుంది…
Ads
షోలో… ఓ ఫోటో చూపిస్తాడు ఆలీ… దీని కథేమిటి అనడుగుతాడు… ఎవరో మిత్రుడు పూణె వెళ్లినప్పుడు, గుడి నుంచి బయటికి వచ్చాక ఎక్కడో ఈ ఫోటో చూశాడు, అరె, మా అభిలాగే ఉన్నాడు అనుకుని, ఫోటో తీసి నాకు పంపించాడు అని చెబుతూ పోయాడు అభి… ఆలీ మధ్యలోనే అందుకుని… మీ నాన్నగారు అప్పట్లో ఎక్కువగా పూణె వెళ్లేవారా..? అని ఓ వెకిలి జోక్ సంధించాడు… జీవితమంతా ఇలాంటి స్కిట్లతోనే సాగుతున్న అభికి కూడా కాస్త ఆలస్యంగా అర్థమైంది… సేమ్, ఆటో రాంప్రసాద్ స్కూల్ ఫోటో ఏదో చూపించాడు… అందరూ రాంప్రసాద్‌లాగే కనిపిస్తున్నారు అంటాడు ఆలీ… ఇంకేదో వెకిలి వ్యాఖ్య చేయకుండా వెంటనే రాంప్రసాద్ అందుకుని… అయ్ బాబోయ్, మా నాన్న గారికి ఏ పాపమూ తెలియదు సార్ అనేశాడు… దాంతో ఫుల్ స్టాప్ పెట్టాడు… అసలు షో ప్రోమోయే ఇంత ఘాటు వెకిలితనంతో ఉంటే… ఇక మొత్తం షో ఎలా నడిచిందో… సో, ఆలీ మారడు, ఈటీవీ మారదు… జబర్దస్త్ అసలే మారదు… కానీ ఆ కమెడియన్లను కూడా అలాగే చూడాలా..? వాళ్ల పర్సనాలిటీలు, జీవితాలు కూడా అలాంటివే అనుకోవాలా..?! సరికాదు, ఇలాంటివి ఆలీకి అర్థం కావు…!!
Share this Article