.
ప్రోలాగ్: వారసత్వపు అడుగులు …. కథ ముంగేర్ జిల్లాలోని లఖన్‌పూర్ గ్రామంలో మొదలవుతుంది. సమ్రాట్ తండ్రి శకుని చౌదరి ఒకప్పుడు ఆర్మీలో పనిచేసి, తర్వాత రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమారుడే మన ఈ కథకు హీరో సమ్రాట్. కానీ, ఆయన రాజకీయ ప్రయాణం పూల బాట కాదు.. అడుగడుగునా సస్పెన్స్! మిస్టరీ… కంట్రవర్సీల పుట్ట…
సీన్ 1- ఆ రక్తం చిందిన రోజు (1995 హత్య కేసు) … 1995 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి. తారాపూర్ ప్రాంతంలో బాంబుల మోత మోగింది. కాంగ్రెస్ అభ్యర్థి సచ్చిదానంద్ సింగ్‌తో సహా ఏడుగురు దారుణంగా హత్యకు గురయ్యారు.
Ads
-
ట్విస్ట్…: ఈ ఘోరకలి వెనుక సమ్రాట్ చౌదరి ఉన్నారనే ఆరోపణలతో ఆయన పేరు ఎఫ్.ఐ.ఆర్ (Case No. 44/1995)లో చేరింది. పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు.
-
క్లైమాక్స్ ఎత్తుగడ..: సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరిగింది. తాను మేజర్ కాదని, 1981లో పుట్టానని ఒక బర్త్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. అంటే అప్పుడు ఆయన వయసు కేవలం 14 ఏళ్లు! చట్టం దృష్టిలో ‘బాలుడు’ (Juvenile) కావడంతో, కఠిన శిక్ష నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు.
సీన్ 2: అతి చిన్న వయసులోనే ‘మంత్రి’ గిరీ! (1999) …. సమయం వేగంగా కదిలింది. 1999లో సమ్రాట్ చౌదరి రాబ్రీ దేవి ప్రభుత్వంలో ఉద్యానవన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో బీహార్ రాజకీయాల్లో ఆయనో సెన్సేషన్.
-
షాకింగ్ ఎలిమెంట్…: మంత్రి కావాలంటే కనీసం 25 ఏళ్లు ఉండాలి. కానీ, నాలుగేళ్ల క్రితం (1995లో) తానో 14 ఏళ్ల పిల్లాడినని చెప్పిన లెక్క ప్రకారం చూస్తే, 1999కి ఆయనకు ఉండాల్సింది 18 ఏళ్లు మాత్రమే!
-
సస్పెన్షన్…: అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇదే బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు. “ఈయన బచ్చా! మంత్రి పదవికి అనర్హుడు” అని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆయన వయసు తక్కువని తేలడంతో, గవర్నర్ సూచన మేరకు ఆయనను పదవి నుంచి డిస్మిస్ చేశారు. అలా దేశ చరిత్రలోనే “అండర్ ఏజ్ మినిస్టర్” గా ఆయన పేరు గెజిట్‌లో నిలిచిపోయింది.
- అప్పుడు తన మంత్రి పదవిని ఊడబీకిన అదే బీజేపీలో ఆయన… ఏకంగా ముఖ్యమంత్రి… ఆహా, ఐరనీ…
- అన్నట్టు 1999లో 14 ఏళ్లు అంటే, ఇప్పుడు 41 ఏళ్లు దాటకూడదు కదా తన వయస్సు… కానీ తన అఫిడవిట్లలో 57 ఏళ్లు… (నవంబరు 16, 1968)
సీన్ 3: ‘డాక్టర్’ పట్టా మిస్టరీ …. రాజకీయాల్లో ఎదిగే కొద్దీ తన పేరు పక్కన ఒక వెయిట్ ఉండాలని ‘డాక్టర్’ అనే బిరుదు తగిలించుకున్నారు.
-
ఇన్వెస్టిగేషన్…: ఈ పట్టా ఎక్కడిది అని ఆరా తీస్తే.. కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ నుంచి వచ్చిందని చెప్పారు. కానీ ప్రశాంత్ కిషోర్ వంటి ప్రత్యర్థులు రంగంలోకి దిగి, “అసలు కాలిఫోర్నియాలో అలాంటి కాలేజీయే లేదు, అది ఒక ఫేక్ వెబ్సైట్” అని సాక్ష్యాలతో సహా బయటపెట్టారు.
-
రీ-ఎంట్రీ…: విమర్శలు ఎక్కువవ్వడంతో, ఇటీవల తన అఫిడవిట్లలో ‘పి.ఎఫ్.సి కామరాజ్ యూనివర్సిటీ’ నుంచి గౌరవ డాక్టరేట్ అని మార్చుకున్నారు. అయినా విమర్శకులు మాత్రం “స్కూల్ చదవకుండానే డాక్టరేట్ ఎలా వస్తుంది?” అని నిలదీస్తూనే ఉన్నారు. తను టెన్త్, ఇంటర్ కూడా చదవలేదట మరి…
సీన్ 4: తలపాగా శపథం! …. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా సమ్రాట్ చౌదరి ఒక భీషణ ప్రతిజ్ఞ చేశారు. “నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి గద్దె దించే వరకు నా తలపాగా (muretha) తీయను” అని శపథం చేశారు.
-
సినిమాటిక్ మూమెంట్…: కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు కదా! 2024లో నితీష్ మళ్ళీ బీజేపీతో చేతులు కలిపినప్పుడు, అదే నితీష్ ప్రభుత్వంలో ఈయన డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడు మీడియా అడిగితే.. “ఈ తలపాగా నా వ్యక్తిగత శపథం కాదు, మా పార్టీ కోసమే” అని సర్దుబాటు చేసుకున్నారు.
క్లైమాక్స్: 2026 – ది అల్టిమేట్ విక్టరీ! … ఏప్రిల్ 15, 2026న కథ ఒక గొప్ప మలుపు తిరిగింది. బీహార్‌లో నితీష్ యుగం ముగిసిందో లేదో తెలియదు కానీ, బీజేపీ తరపున తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు సమ్రాట్ చౌదరి.
-
1995లో ‘మైనర్’ అని తప్పించుకున్న కుర్రాడు…
-
1999లో ‘అండర్ ఏజ్’ అని పదవి కోల్పోయిన మంత్రి…
-
2026 నాటికి రాష్ట్రానికే ‘సుప్రీం’ పవర్ అయి కూర్చున్నారు…
సమ్రాట్ చౌదరి కథలో నీతి ఏమిటంటే… రాజకీయాల్లో గెలవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు, కాలానికి అనుగుణంగా సర్టిఫికేట్లు, శపథాలు మార్చుకోగలిగే సమర్థత కూడా ఉండాలి! నేడు ఆయన బీహార్‌ను పాలిస్తున్న ‘రియల్ హీరో’. ఆయన వయసు పెరిగిన తీరు గురించి ఎవరెన్ని జోకులు వేసినా, పవర్ ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది! తను ఇప్పుడు కొత్త పట్టభద్రులకు డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయగలడు… ఏ కేసునైనా డీల్ చేయగలడు…
Share this Article