.
క్లౌడ్ బరస్ట్… క్యుములోనింబస్… కుంభవృష్టి… ఆవర్తన ద్రోణి… భారీ వర్షాలకు చాలా పదాలు వాడుతుంటాం కదా…
అచ్చంగా శాండల్‌వుడ్… అనగా కన్నడ చిత్ర పరిశ్రమకు గత ఏడాది స్వర్ణయుగం… కేజీఎఫ్, కాంతార, చార్లి ఎట్సెట్రా బోలెడు సినిమాలు దుమ్మురేపాయి… పాన్ ఇండియా రేంజులో కూడా…
Ads
కన్నడ ఇండస్ట్రీ దశ మారింది… కొత్త క్రియేటివ్ పీపుల్, దమ్మున్న నిర్మాతలు, ఇండియన్ మార్కెట్‌ను ఒడిసిపట్టిన మార్కెటింగ్ పీపుల్ వచ్చారనీ అనుకున్నారందరూ…
అవును, గత ఏడాది అదే చరిత్ర… చుట్టూ ఉన్న పరిమితమైన గీతల్ని చెరిపేసుకుని, ఇండియన్ సినిమాలో ప్రధాన భాగస్వామి అయ్యిందనే అనుకున్నారందరూ… బాగుంది… కానీ..?
ఏమైంది… ఒక్కసారిగా దఢాలున కూలిపోయింది… ఒక్కటంటే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ కాదు కదా, సూపర్ హిట్ కూడా కాదు, జస్ట్, హిట్ అనిపించుకున్న సినిమా లేకుండా పోయింది ఈ సంవత్సరం…
చూశారు కదా టేబుల్… ఇప్పటివరకూ ఈ ఏడాది ఇండియాలో 1446 సినిమాలు రిలీజైతే 10,842 కోట్ల వసూళ్లు జరిగాయి… ఇండియా థియేటర్లలోేనే 9352 కోట్ల నెట్ కలెక్షన్స్… పోలిక కోసం ఓ ఉదాహరణ చెబుతాను…
మాలీవుడ్‌లో 186 సినిమాలు రిలీజైతే 919 కోట్ల వసూళ్లు సాగాయి… నిజానికి మాలీవుడ్ పరిధి చిన్నది… ఐనాసరే కన్నడ ఇండస్ట్రీ నుంచి 205 సినిమాలు రిలీజైతే వసూళ్లు జస్ట్ 178 కోట్లు… ఎంత తేడా అర్థమైంది కదా… తమిళ ఇండస్ట్రీ నయం 229 సినిమాలు రిలీజైతే 1507 కోట్ల వసూళ్లు… చాలా బెటర్…
తెలుగులో 300 సినిమాలు… 1950 కోట్లు… టాప్ ప్రాఫిటబుల్ అనుకుంటున్నారు కదా… హిందీ చాలా నయం… 212 సినిమాలతోనే 3898 కోట్లను కుమ్మేసింది… అఫ్‌కోర్స్, అందులో ఏడెనిమిది వందల కోట్లు పుష్ప2 కంట్రిబ్యూషనే… హిందీ సినిమాలు ఫ్లాప్… హిందీలోకి డబ్ అయిన సౌత్ సినిమాలు టాప్…
సరే, మరాఠీ, ఇంగ్లిషు పరిధి అంతంతమాత్రమే… ఇదే టాప్ రేటెడ్ వసూళ్ల పుష్ప2 కన్నడంలో అట్టర్ ఫ్లాప్… ఎందుకోగానీ కన్నడనాట సినిమాలు ఆడటం లేదు… దయనీయంగా ఉంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితి… సో, గత ఏడాది శాండల్‌వుడ్‌ది వాపు, బలుపు కాదు…
తమ ఒరిజినల్ సినిమాల్ని జనం చూడటం లేదు… కన్నడంలోకి డబ్ కాబడిన ఇతర భాషల సినిమాలు కూడా జనం చూడటం లేదు… ఓరకమైన నిర్లిప్తత ఆవరించింది శాండల్‌వుడ్‌ను… యశ్ నటించి, నిర్మిస్తున్న రామాయణం వంటివి ఏమైనా పరిస్థితిని మారుస్తాయా…? చూడాలిక..!!
Share this Article