Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో వాట్…! సంఘీ ముద్ర వేస్తే ఆ కన్నీళ్లేమిటి..? ఆ బహిరంగ వివరణలేమిటి..?

January 28, 2024 by M S R

రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ మాజీ భార్య… బాగా బాధపడిపోయింది నిన్న… తను స్వయంగా దర్శకత్వం వహించిన లాల్‌సలామ్ అనే సినిమా ఆడియో లాంచ్‌లో బాగా ఎమోషనల్ అయిపోయిందట… ‘‘అందరూ మా నాన్నను బాగా ట్రోల్ చేస్తున్నారు, సంఘీ అంటున్నారు, ఆయన అలాంటివాడు కాదు, తను సంఘి అయి ఉంటే లాల్‌సలామ్ సినిమాలో నటించేవాడే కాదు… మామూలుగానే ఈ నెగెటివిటీని తప్పించుకోవడానికి మేం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండం, ఐనా సరే ఈ నెగెటివిటీ తప్పడం లేదు… మా మీద పోస్టులను మా టీం చూపిస్తుంది… నాన్నపై సంఘీగా ముద్రవేసే పోస్టుల మీద కోపం వస్తుంటుంది…’’ అని ఆవేదన వ్యక్తం చేసింది…

‘‘అసలు సంఘీ అంటే ఏమిటి అనడిగాను మా టీంను… ఒక పార్టీకి చెందినవారిని సంఘీ అంటారట, బాధేసింది, మేమూ మనుషులమే కదా…’’ అంటుంటే, ఆమె మాటలు వింటూ రజినీకాంత్ కూడా ఎమోషనల్ అయిపోయాడు… కంటతడి పెట్టుకున్నాడు… (ఈ సినిమాలో రజినీకాంత్ మొయిదీన్ భాయ్ అనే పాత్ర చేస్తున్నాడు…) మేం నాన్నను అడగలేదు, కథ విని ఈ పాత్ర చేస్తానని తనే ముందుకొచ్చాడు, నాన్న అలాంటివాడు’ అని ఆమె వివరణ ఇచ్చింది…

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? సంఘీ అనేది ఆమెకు తిట్టులాగా ఎందుకు అనిపించింది… సాధారణంగా ఆర్ఎస్ఎస్ మనుషుల్ని సంఘీలు అంటారు… లేదా హిందుత్వ భావజాలం అధికంగా ఉన్నవాళ్లను, కాషాయ శిబిరంలోని వాళ్లను అలా పిలుస్తుంటారు… కమ్యూనిస్టులు, నాస్తికులు, హిందూ ద్వేషులు బీజేపీ వాళ్ల పట్ల కూడా దాన్ని ఓ నెగెటివ్ పదంగా వాడుతుంటారు… సోషల్ మీడియాలో బత్తాయిలు అనే పదం కూడా పాపులరే కదా, సేమ్, సంఘీ…

Ads

(ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్లిన అనుభవాలు, ఆ సంస్థతో సంబంధాలు ఉన్నవాళ్లు అలా పిలిపించుకోవడాన్ని అవమానంగా భావించరు… కొందరైతే అలా పిలిపించుకోవడాన్ని ఇష్టపడతారు కూడా…) ఐతే తమిళనాడు సంగతి ఇంకాస్త ఎక్స్‌ట్రీమ్… ఆ రాష్ట్రంలో హిందూ, ఆధ్యాత్మిక వ్యతిరేకత ఎక్కువ… దానికి అనేక కారణాలుండవచ్చు… కానీ నాన్న సంఘీ కాదు అనే వివరణ ఇచ్చుకునేంత సీన్ ఏముంది..? దాన్ని ఓ తిట్టులా భావించి ఏడ్వాల్సిన పనేముంది..? అలాంటోడు కాదు అనే వివరణ దేనికి..?

73 ఏళ్ల రజినీకాంత్ ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లి ఉండకపోవచ్చు, అధికారికంగా బీజేపీలో పనిచేసి ఉండకపోవచ్చు, కానీ బీజేపీ క్యాంపుతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయి… ఒక దశలో బీజేపీలో చేర్చుకోవాలని, తనను ముఖ్యమంత్రిగా ఫోకస్ చేస్తూ పార్టీని విస్తరించుకోవాలనీ బీజేపీ అనుకోలేదా..? కాదంటే నువ్వే ఒక పార్టీ సొంతంగా పెట్టుకో, బీజేపీకి మిత్రపక్షంగా ఉండు అనే సలహాలూ ఇచ్చారు ఆయనకు… రజినీకాంత్ పిరికి… ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు కలర్ ఇవ్వడమే తప్ప అడుగు వేసింది లేదు, ధైర్యంగా కదిలిందీ లేదు… చివరకు అనారోగ్యాన్ని సాకుగా చూపి ఇక అస్సలు రాజకీయాల్లోకి రాను అని ప్రకటించాడు…

కానీ ఈ వయస్సులో కూడా ఆ కమర్షియల్ కుర్రవేషాలు… తనకు అసలు ప్రజాజీవితమే లేదు… అపారమైన సంపద, వైభోగం ఇచ్చిన జనానికి తాను ఏమైనా తిరిగి ఇవ్వాలనే ధ్యాస కూడా లేదు… కాకపోతే అప్పుడప్పుడూ తన నిరాడంబరత్వం మీద, హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక చింతనలో గడపడం మీద ఫోటోలు, వార్తలు వస్తుంటాయి… ఐతే ఇన్నేళ్లూ తన మీద ఈ సంఘీ అనే ట్రోలింగ్ లేదు… కానీ ఓసారి జైలర్ సినిమా ఫంక్షన్‌లో డేగ, కాకి కథ చెబుతూ చివరలో ‘అర్థమైందా రాజా’ అని వ్యంగ్యంగా ఓ మాట అన్నాడు…

అది మరో పాపులర్ స్టార్ విజయ్‌ను ఉద్దేశించే అన్నాడు అని విజయ్ ఫ్యాన్స్ భావన… అప్పటి నుంచీ ఆ ఫ్యాన్స్ రజినీపై ట్రోల్ చేయడం, దానికి ప్రతిగా రజినీ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడి చేయడం జరుగుతోంది… వ్యక్తి ఆరాధన మరీ ఎక్కువ మోతాదులో ఉండే తమిళనాడులో ఈ ఫ్యానిజం చాలా ఎక్కువ… ఈ ఫ్యాన్స్ పోరాటాలు కూడా చాలా సాధారణం… నిన్నటి ఫంక్షన్‌లో రజినీకాంత్ మాట్లాడుతూ ‘నేను ఆ మాటన్నది విజయ్ గురించి కాదు, విజయ్ నా కళ్ల ముందు పెరిగి, ఎదిగిన అబ్బాయి’ అని క్లారిటీ ఇచ్చుకున్నాడు… (మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఎవరికీ తెలియదు…)

సరే, సెలబ్రిటీలు… మరీ రజినీకాంత్ వంటి సూపర్ సెలబ్రిటీ మీద మెచ్చుకోళ్లు ఉంటాయి, ఆక్షేపణలు, తిట్లు కూడా ఉంటాయి సోషల్ మీడియాలో… జనం నానారకాలుగా అనుకుంటారు, వాటిని లైట్ తీసుకోవడమే సెలబ్రిటీల ప్రథమ కర్తవ్యం… అన్నింటికీ మించి సంఘీ అనే పదాన్ని తిట్టుగా భావించడం ఆశ్చర్యం… తను అయోధ్య కార్యక్రమానికి వెళ్లాడు, తనే కాదు, టాలీవుడ్ నుంచి పవన్ కల్యాణ్, రాంచరణ్, చిరంజీవి కూడా వెళ్లారు… సో వాట్… ఇక వాళ్లనూ సంఘీలు అనాలా..? అంటే మాత్రం అందులో సిగ్గుపడేది ఏముంది..? మరి ఈ లెక్కన మోడీకి 300 పైచిలుకు ఎంపీ సీట్లు ఇచ్చిన కోట్లాది మంది భారతీయులందరూ సంఘీలేనా..? ప్రధాని, రాష్ట్రపతి దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఓ సగటు కార్యకర్త దాకా సంఘీలే కదా…

సో, సంఘీ అనే పదాన్ని రజినీ కుటుంబం రిసీవ్ చేసుకోవడంలోనే ఏదో తేడా ఉంది… అంతే…!! అవునూ, మొయిద్దీన్ పాత్ర చేయడానికీ హిందుత్వ అభిమానిగా ఉండటానికి నడుమ లంకె ఏమిటి..? ఆ పాత్ర తన వృత్తి..! ఇతర మతస్తులు హిందూ దేవుళ్ల పాత్రలు చేయడం లేదా..? హిందువులు ఇతర మతపాత్రల్ని పోషించడం లేదా..? ఎందుకు చేయకూడదు..? వృత్తిపరమైన పాత్రల పోషణకూ వ్యక్తిగత మత ఆచరణకూ ముడిపెట్టడం దేనికి..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions